సాక్షి, జీడిమెట్ల : పోలీస్ చలానాల నుంచి తప్పించుకోవాలంటే మూతికి ఉండాల్సిన మాస్క్‌ను బండికి పెట్టుకోవాలి. అప్పుడే ఓవర్ స్పీడ్, ట్రిపుల్ రైడింగ్, రాంగ్‌రూట్‌లలో ఇష్టం వచ్చినట్లు వెళ్లొచ్చు. ప్రస్తుతం హైదరాబాద్‌లో కొంతమంది యువకులు ఇలా బైక్ నంబర్ ప్లేట్‌ను మాస్క్‌తో మూసేసి పోలీసుల కెమెరాలకు చిక్కకుండా తిరుతున్నారు. ఇలాంటి వారు ఏదైనా ప్రమాదం చేసి తప్పించుకుంటే దొరకడం కష్టంగా మారుతుంది. ఇటువంటి వాహనదారుల పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించకుంటే ఇది ప్రమాదమేనని ప్రజలు అంటున్నారు.
చింతల్‌లో నంబర్ ప్లేట్‌కు మాస్కు పెట్టి యువకులు ఇలా ట్రిపుల్ రైడింగ్‌లో వెళ్తున్నారు. అసలే కోవిడ్ మహమ్మారి మరోసారి రెక్కలు విప్పేందుకు సిద్ధమవుతోంది. మరోవైపు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు కూడా పెరుగుతున్నాయి. వ్యక్తిగత పరిశుభ్రత, మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించాలని ప్రభుత్వాలు ఎన్ని హెచ్చరికలు జారీ చేసిన కొంతమంది నిర్లక్ష్యం వీడటం లేదు. ఇంకోవైపు రాష్ట్రంలో రోజూ పదుల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలబారినపడి జనం ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా యువకులు తమకేం కాదులే అన్న విపరీత ధోరణితో అటు వైరస్‌ను , ఇటు ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు.
చదవండి: నగరానికి నయా పోలీస్ బాస్.. సీవీ ఆనంద్ గురించి ఆసక్తికర విశేషాలు..
హైదరాబాద్ నగరంలో గతంలో దర్శనమిచ్చిన ‘మాస్కు’ నెంబర్ ప్లేట్లు..
Comments
Please login to add a commentAdd a comment