
ఇక రాష్ట్రమంతా ఒకే సిరీస్..
సాక్షి, అమరావతిబ్యూరో : కృష్ణా జిల్లాకు కేటాయించిన ‘ఏపీ–16’ కోడ్ రద్దు కానుంది. ఇకపై ఫిబ్రవరి 1 నుంచి ఆ స్థానంలో ‘ఏపీ–39’ సిరీస్ అమల్లోకి రానుంది. ఈ మేరకు బుధవారం రవాణాశాఖ మంత్రి అచ్చెన్నాయుడు విజయవాడలో ఈ సిరీస్‌ను లాంఛనంగా ప్రారంభించనున్నారు. రాష్ట్రమంతా ఇదే కోడ్‌తో వాహనాల రిజిస్ట్రేషన్లు జరగనున్నాయి. ఇప్పటి వరకు కొనసాగిన ఏపీ –16.. కృష్ణా జిల్లా రిజిస్ట్రేషన్ కోడ్ నంబరు.. ఫిబ్రవరి 1 తర్వాత ఈ కోడ్ నంబరు ఏపీ–39గా మారనుంది. ఏపీ రవాణా శాఖ తీసుకున్న నిర్ణయంతో జిల్లా అంతటా ఒకే కోడ్ నంబర్ అమల్లోకి రానుంది. కొత్త సిరీస్ ప్రారంభం కావడం వల్ల వారం రోజుల్లోనే 1–9999 నంబర్ల సిరీస్ మారిపోయే అవకాశం ఉంది.
తద్వారా నెలలోనే మూడు నాలుగేసిసార్లు కొత్త సిరీస్ అంకెలు వచ్చేస్తుంటాయి. రవాణా శాఖలో ఈ నూతన విధానం అమల్లోకి రానుండటంతో పక్క జిల్లాల్లో తాత్కాలిక చిరునామాలతో ఫ్యాన్సీ నంబర్లను దక్కించుకుంటున్న వాహనదారులకు కట్టడి పడినట్లే. ఫలితంగా రాబోయే రోజుల్లో ఏదైనా వాహనానికి 9999 లాంటి ఫ్యాన్సీ నంబర్లు కావాలనుకునే వాహన యజమాని ఇకపై అలాంటి నంబర్ల కోసం తీవ్రమైన పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది.రాష్ట్రమంతా వాహనాలకు ‘ఒకే కోడ్’ ఉండేలా రవాణా శాఖ చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు బుధవారం రవాణాశాఖ మంత్రి అచ్చెన్నాయుడు విజయవాడలో నూతన సిరీస్ ఏపీ– 39ను లాంఛనంగా ప్రారంభించనున్నారు. దీంతో కృష్ణా జిల్లాకు కేటాయించిన ‘ఏపీ–16’ కోడ్ రద్దు కానుంది.