
మా ఇష్టం.. ఆపేదెవరు?
ముగ్గురు వ్యక్తులు పాతకాలం నాటి స్కూటర్లను బయటకు తీశారు. ఒక్కదానికీ నెంబర్ ప్లేట్ లేదు. ఒక్కరూ హెల్మెట్ కూడా ధరించలేదు. పైగా బరువైన బస్తాలతో దూసుకెళుతున్నారు.
ముగ్గురు వ్యక్తులు పాతకాలం నాటి స్కూటర్లను బయటకు తీశారు. ఒక్కదానికీ నెంబర్ ప్లేట్ లేదు. ఒక్కరూ హెల్మెట్ కూడా ధరించలేదు. పైగా బరువైన బస్తాలతో దూసుకెళుతున్నారు. పోలీసులు సాధారణ వాహనదారులను రకరకాల కారణాలతో నిలపడమో.. హెల్మెట్ లేకుంటే చలాన్ విధించడమో చేస్తారు.
లేదంటే వేగంగా వెళ్లేవారిని ఫొటో తీసి ఆన్‌లైన్‌లో చాలాన్ పంపిస్తారు. వీరు వెళ్లే మార్గంలో అనేక ట్రాఫిక్ సిగ్నళ్లు ఉన్నాయి.. అక్కడ పోలీసు సిబ్బందీ ఉన్నారు. కానీ ఒక్కరూ నిలువరించలేదు. ఇదేంటని అడగనూ లేదు. ఖైరతాబాద్ ఫ్లై ఓవర్‌పై కనిపిందీ దృశ్యం. – ఫొటో: గడిగె బాలస్వామి