పెండింగ్ చలానాలతో పట్టుబడిన వ్యక్తి ,పోలీసులతో యశ్వంత్
బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ ఫేజ్ 03లో నివసించే పోలిరెడ్డి ప్రతాప్ టీఎస్ 09 ఈఎక్స్ 6724 హోండా యాక్టీవా బైక్‌కు 31 చలానాలు పెండింగ్‌లో ఉన్నాయి. ఆయన రూ. 5,385 జరిమానా చెల్లించాల్సి ఉంది. అయితే పెండింగ్ చలానాలు కట్టకుండా తిరుగుతున్న ఈ వాహనాన్ని జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు వాహనాల తనిఖీల్లో భాగంగా జూబ్లీహిల్స్ చెక్‌పోస్టులో పట్టుకున్నారు. 31 చలానాలు పెండింగ్‌లో పెట్టుకొని తిరుగుతుండగా పట్టుకున్న పోలీసులు వాటిని తిరిగి చెల్లించిన తర్వాతనే వదిలిపెట్టారు.
నంబర్ ప్లేట్‌ను మలిచి తిరుగుతున్న వ్యక్తికి జరిమానా
బంజారాహిల్స్: నంబర్ ప్లేట్‌ను మలిచి ట్రాఫిక్ పోలీసులకు, సీసీ కెమెరాలకు, పోలీసు కెమెరాలకు చిక్కకుండా అడ్డదారుల్లో వాహన నిబంధనలు ఉల్లంఘించి తిరుగుతున్న ఓ పూజారిని జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు అదుపులోకి తీసుకొని చలానా విధించారు. బంజారాహిల్స్ రోడ్ నం.10లోని నూర్‌నగర్‌కు చెందిన యశ్వంత్‌శర్మ(19) గత కొంత కాలంగా హోండా యాక్టీవా బైక్ నంబర్ ప్లేట్‌ను సంఖ్య కనిపించకుండా ఒక మూలలో మలిచారు. అయితే వాహన తనిఖీల్లో భాగంగా జూబ్లీహిల్స్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ కె.ముత్తు ఈ వాహనాన్ని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు బాధితుడికి జరిమానా విధించారు.
Comments
Please login to add a commentAdd a comment