షారుక్‌ ఇంటికి డైమండ్‌ నేమ్‌ ప్లేట్‌, మెరిసిపోతున్న మన్నత్‌ | Shah Rukh Khan Bungalow Mannat Gets new Diamond Nameplate | Sakshi
Sakshi News home page

Shah Rukh Khan: షారుక్‌ ఇంటికి డైమండ్‌ నేమ్‌ ప్లేట్‌, మెరిసిపోతున్న మన్నత్‌

Published Tue, Nov 22 2022 10:23 AM | Last Updated on Tue, Nov 22 2022 10:28 AM

Shah Rukh Khan Bungalow Mannat Gets new Diamond Nameplate - Sakshi

బాలీవుడ్‌ బాద్‌షా షారుక్ ఖాన్‌ హిందీ చిత్ర పరిశ్రమలో స్టార్‌ హీరోలో ఒకరు. ఇక ముంబైలోని ఆయన నివాసం ఎంత ప్రత్యేకమో చెప్పనక్కర్లేదు. అక్కడ చూడదగిన ప్లేస్‌లో షారుఖ్‌ నివాసం మన్నత్‌ ఒకటి.  సుమారు రూ. 200 కోట్లతో అన్ని హంగులతో షారుక్‌ తనకు నచ్చినట్టుగా మన్నత్‌నని నిర్మించుకున్నాడు. ఇందులో షారుక్‌ ఇంటి నెంబర్‌ ప్లేటు చాలా ప్రత్యేకత సంతరించుకుంది. మన్నత్‌కు మరింత మెరుపు తీసుకువచ్చేందుకు గతంలో వజ్రాలతో ఉన్న నెంబర్‌ ప్లేట్‌ని చేపించాడు షారుక్‌. పూర్తిగా వజ్రాలతో పొదిగిన ఈ ప్లేట్‌పై మన్నత్‌ అని నల్లటి అక్షరాలతో రాసి ఉంటుంది.

చదవండి: జబర్దస్త్‌ ‘పంచ్‌’ ప్రసాద్‌ ఆరోగ్యంపై డాక్టర్లు ఏమన్నారంటే?

అయితే భద్రత దృష్ట్యా ఈ నేమ్‌ ప్లేట్‌ తీసేశారు. తాజాగా మరోసారి షారుఖ్ తన ఇంటికి డైమండ్‌ నేమ్ ప్లేట్ పెట్టించాడు. దాదాపు 35 లక్షలతో ఈ వజ్రాల నేమ్ ప్లేట్ తయారు చేయించినట్లు తెలుస్తోంది. రాత్రిపూట ఆ వజ్రాలు మెరుస్తూ ఆ ఇంటికి మరింత అందాన్ని తీసుకొచ్చాయి. దీంతో ఈ వజ్రాల నేమ్ ప్లేట్‌ని చూసేందుకు మరోసారి ప్రజలు షారుఖ్ ఇంటికి క్యూ కడుతున్నారు. మన్నత్‌ను సందర్శించిన ఫొటోలు, వీడియోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు. దీంతో షారుఖ్ ఇంటి డైమండ్‌ నేమ్‌ ప్లేట్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement