- హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ల విషయంలో రవాణా శాఖ కొత్త మెలిక
సాక్షి, హైదరాబాద్: హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ల (హెచ్‌ఎస్‌ఆర్‌పీ) ప్రాజెక్టును నిర్బంధం చేశారు. అధికారికంగా ఎలాంటి ఆదేశాలు వెలువరించకుండానే అధికారులు దాని నిర్బంధ అమలును ప్రారంభించారు. ఇక నుంచి హెచ్‌ఎస్‌ఆర్‌పీ రుసుం చెల్లిస్తేనే వాహనం రిజిస్ట్రేషన్ అవుతుంది.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కాగానే తొలుత హెచ్‌ఎస్‌ఆర్‌పీ ధరను ఆ సంస్థ కౌంటర్‌లో చెల్లించాలి. దాని చెల్లింపు పూర్తయిందని ఆన్‌లైన్‌లో పరిశీలించి అధికారులు నిర్ధారించుకున్న తర్వాతే వాహనం రిజిస్ట్రేషన్ పూర్తి చేస్తారు.
ఈ నిర్ణయం పట్ల వాహనదారులు మండిపడుతున్నారు. హెచ్‌ఎస్‌ఆర్‌పీ విషయంలో నెలకొన్న వివాదాలను పరిష్కరించకుండానే అధికారులు దాన్ని తప్పనిసరి చేయడాన్ని వ్యతిరేకి స్తున్నారు. ఢిల్లీలాంటి చోట్ల తక్కువ ధరకే ఈ ప్లేట్లను సరఫరా చేస్తుండగా, తెలంగాణలో ఎక్కువ ధర ఖరారు చేయడాన్ని పలువురు వ్యతిరేకిస్తున్నారు.
ధరలిలా..
ద్విచక్ర వాహనాలు: రూ.245
ఆటోరిక్షాలు: రూ.252
కార్లు, తేలిక వాహనాలు: రూ.619
భారీ వాహనాలు: రూ.649