వాహనాలను నంబర్‌ప్లేట్ లేకుండా, ఎలాంటి పత్రాలు లేకుండా నడిపితే సీజ్ చేస్తామని సైబరాబాద్ పశ్చిమ కమిషనర్ నవీన్‌చంద్ హెచ్చరించారు.
వాహనాలను నంబర్‌ప్లేట్ లేకుండా, ఎలాంటి పత్రాలు లేకుండా నడిపితే సీజ్ చేస్తామని సైబరాబాద్ పశ్చిమ కమిషనర్ నవీన్‌చంద్ హెచ్చరించారు. శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు. ఇకపై నంబర్ ప్లేట్ లేకుండా వాహనదారులు వాహనాలను నడపవద్దని ఆయన కోరారు. ఒక వేళ వస్తే మోటార్ వెహికల్ యాక్టు మేరకు తదుపరి చర్యలుంటాయని పేర్కొన్నారు. దీనిపై త్వరలోనే స్పెషల్ డ్రైవ్ కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు.