రాష్ట్ర ఇంటలిజెన్స్ చీఫ్‌గా ఐజీ నవీన్‌చంద్ బాధ్యతలు స్వీకరించారు. ఇంటలిజెన్స్ ప్రధాన కార్యాలయానికి చేరుకొని శుక్రవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు ఆ స్థానంలో ఉన్న ఐజీ శివధర్‌రెడ్డి.. డీజీపీ ప్రధాన కార్యాలయంలో పీ అండ్ ఎల్ విధులు స్వీకరించారు. అదే విధంగా పర్సనల్ విధులు చూస్తున్న సందీప్ శాండిల్య ఆ బాధ్యతల నుంచి రిలీవ్ అయ్యారు.
కాగా ఇంటలిజెన్స్ చీఫ్‌గా పనిచేసిన శివధర్‌రెడ్డి బదిలీ... పోలీసు ఉన్నతాధికారులతో పాటు అన్ని వర్గాలలో చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇంటలిజెన్స్ చీఫ్‌గా ప్రభుత్వానికి చేదోడు వాదోడుగా నిలిచారు. రెండున్నర ఏళ్ల కాలంలో ప్రభుత్వం సాధించిన విజయాలలో శివధర్‌రెడ్డి ప్రధాన పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో అతని బదిలీపై శుక్రవారం రోజంతా అన్ని వర్గాల వారు తీవ్రంగా చర్చించుకున్నారు.