![Former Intelligence Officer Died After Car Accident Suspect Murde - Sakshi](/styles/webp/s3/article_images/2022/11/6/car5.jpg.webp?itok=KV9DYsZP)
మైసూరు: కారు ఢీ కొని 82 ఏళ్ల మాజీ ఇంటిలిజెన్స్ బ్యూరో ఆఫీసర్ మృతి చెందారు. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...మాజీ ఇంటిలిజెన్స్ ఆఫీసర్ ఆరేకే కులకర్ణి మైసూరు యూనివర్సిటీ మానస గంగోత్రి క్యాంపస్ వద్ద వాకింగ్ చేస్తుండగా ఒక గుర్తు తెలియని వాహనం ఆయన్ను ఢీ కొట్టింది. దీంతో అక్కడికక్కడే ఆయన కుప్పకూలి మృతి చెందినట్లు తెలిపారు.
ఐతే ఆ వాహనానంపై నెంబర్ ప్లేట్ లేదని పోలీసుల తెలిపారు. కులకర్ణి తన రోజువారి నిత్యచర్యలో భాగంగా వాకింగ్ వెళ్తుండగా ఈ ప్రమాదం బారిన పడినట్లు పేర్కొన్నారు. పోలీసులు ఆ పరిసరాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా ఆ వాహనం ఆయన్ను కావాలనే ఢీకొట్టినట్లు స్పష్టంగా కనిపించింది. పోలీసులు దీన్ని ప్రీ ప్లాన్ మర్డర్‌గా అనుమానిస్తున్నారు. ఎందుకంటే సీసీఫుటేజ్‌లో కులకర్ణి కరక్ట్‌గా రోడ్డుకి పక్కగా ఉన్న కావాలనే కారు రోడ్డు లైన్‌ని క్రాస్ చేసి మరి ఢీ కొట్టినట్టు వీడియోలో చాలా స్పష్టంగా కనిపిస్తోందన్నారు అధికారులు.
దీంతో అధికారులు ఈ యాక్సిడెంట్‌ని హత్యగా కేసుగా నమోదు చేసుకుని, ఆ కోణంలో దర్యాప్తు సాగిస్తున్నట్లు పోలీస్ కమీషనర్ చంద్రగుప్త తెలిపారు. తమ పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి నిందితుడు కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు తెలిపారు. కులకర్ణి మూడు దశాబ్దాలకు పైగా ఇంటిలిజెన్స్ ఆఫీసర్‌గా పనిచేసి 23 ఏళ్ల క్రితం రిటైర్ అయినట్లు తెలిపారు.
(చదవండి: గంగ మీద ప్రమాణం చేద్దామని చెరువుకెళ్లి.. నీటిలో మునిగి..)
Comments
Please login to add a commentAdd a comment