inteligence buero
-
యాక్సిడెంట్‌గా చిత్రీకరించి మర్డర్‌కి ప్లాన్! మాజీ ఇంటిలిజెన్స్ ఆఫీసర్ మృతి
మైసూరు: కారు ఢీ కొని 82 ఏళ్ల మాజీ ఇంటిలిజెన్స్ బ్యూరో ఆఫీసర్ మృతి చెందారు. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...మాజీ ఇంటిలిజెన్స్ ఆఫీసర్ ఆరేకే కులకర్ణి మైసూరు యూనివర్సిటీ మానస గంగోత్రి క్యాంపస్ వద్ద వాకింగ్ చేస్తుండగా ఒక గుర్తు తెలియని వాహనం ఆయన్ను ఢీ కొట్టింది. దీంతో అక్కడికక్కడే ఆయన కుప్పకూలి మృతి చెందినట్లు తెలిపారు. ఐతే ఆ వాహనానంపై నెంబర్ ప్లేట్ లేదని పోలీసుల తెలిపారు. కులకర్ణి తన రోజువారి నిత్యచర్యలో భాగంగా వాకింగ్ వెళ్తుండగా ఈ ప్రమాదం బారిన పడినట్లు పేర్కొన్నారు. పోలీసులు ఆ పరిసరాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా ఆ వాహనం ఆయన్ను కావాలనే ఢీకొట్టినట్లు స్పష్టంగా కనిపించింది. పోలీసులు దీన్ని ప్రీ ప్లాన్ మర్డర్‌గా అనుమానిస్తున్నారు. ఎందుకంటే సీసీఫుటేజ్‌లో కులకర్ణి కరక్ట్‌గా రోడ్డుకి పక్కగా ఉన్న కావాలనే కారు రోడ్డు లైన్‌ని క్రాస్ చేసి మరి ఢీ కొట్టినట్టు వీడియోలో చాలా స్పష్టంగా కనిపిస్తోందన్నారు అధికారులు. దీంతో అధికారులు ఈ యాక్సిడెంట్‌ని హత్యగా కేసుగా నమోదు చేసుకుని, ఆ కోణంలో దర్యాప్తు సాగిస్తున్నట్లు పోలీస్ కమీషనర్ చంద్రగుప్త తెలిపారు. తమ పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి నిందితుడు కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు తెలిపారు. కులకర్ణి మూడు దశాబ్దాలకు పైగా ఇంటిలిజెన్స్ ఆఫీసర్‌గా పనిచేసి 23 ఏళ్ల క్రితం రిటైర్ అయినట్లు తెలిపారు. (చదవండి: గంగ మీద ప్రమాణం చేద్దామని చెరువుకెళ్లి.. నీటిలో మునిగి..) -
ఇంటలిజెన్స్ అధికారులపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: బిజేపీ రాష్ట్ర కార్యాలయంలో వచ్చిన ఇంటలిజెన్స్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. బిజేపీ కార్యాలయంలోకి ఎలా వస్తారని ప్రశ్నించారు. ‘ఫోన్ లు ట్యాప్ చేస్తున్నది సరిపోవడం లేదా ? కార్యాలయంలోపలికి వస్తే బాగోదు. ప్రగతి భవన్, తెలంగాణ భవన్లో ఐబీ వాళ్ళను పెడతా.. ఒప్పుకుంటారా ? అక్కడ ఒప్పుకుంటే.. ఇక్కడ రాష్ట్ర ఇంటలిజెన్స్ వారికి పార్టీ కార్యాలయంలో ప్రత్యేక క్యాబిన్ ఏర్పాటు చేయిస్తా’ అని తీవ్రంగా మండిపడ్డారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇదీ చదవండి: అబద్ధాలపై క్షమాపణ కోరే ధైర్యం కూడా లేదు.. కిషన్‌రెడ్డిపై కేటీఆర్ ఆగ్రహం -
హిజాబ్ వివాదం.. కొత్త మలుపు! ఐబీ హెచ్చరికలు
హిజాబ్ వివాదం ఇప్పుడు మరో రూపం దాలుస్తోంది. హిజాబ్ అంశాన్ని అడ్డుపెట్టుకుని ఉర్దూయిస్థాన్ ఏర్పాటు కుట్ర జరుగుతోందంటూ నిఘా వర్గాలు హెచ్చరించాయి. నిషేధిత సిఖ్స్ ఫర్ జస్టిస్ విభాగంతో సంఘ విద్రోహ శక్తులు చేతులు కలపొచ్చని, ఉర్దూయిస్థాన్ ఏర్పాటుకు ప్రయత్నించొచ్చని పోలీసులకు ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరికలు జారీ చేసింది. పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐ భారత్‌లో అశాంతి రాజేందుకు రంగంలోకి దిగినట్లు ఇంటెలిజెన్స్ బ్యూరో ఒక అంచనాకి వచ్చింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ నడుస్తున్న హిజాబ్ వివాదాన్ని ఖలీస్థానీ విభాగం ‘సిఖ్స్ ఫర్ జస్టిస్’ (ఎస్ఎఫ్జే) చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్ను సాయంతో మరింత రగిలించే ప్రయత్నం చేస్తున్నట్టు నిఘా వర్గాలు (ఇంటెలిజెన్స్) హెచ్చరించాయి. కాబట్టి అప్రమత్తంగా ఉండాలని పోలీసు శాఖలకు, చట్టాన్ని అమలు చేసే సంస్థలకు నిఘా వర్గాలు శుక్రవారం ఒక నోట్ ద్వారా సూచించాయి. ముస్లిం బాలికలు హిజాబ్ ధరించి విద్యా సంస్థలకు రావడం కుదరదంటూ కర్ణాటక రాష్ట్రం అభ్యంతరం చెప్పడం ఈ వివాదానికి కేంద్ర బిందువుగా మారిన విషయం తెలిసిందే. చదువుకునే చోటు వివాదాలకు, రాజకీయాలకు వేదిక కాకూడదనేది పలువురి అభిప్రాయం. అయితే భారత్ వ్యతిరేక శక్తులు కొన్ని సిఖ్స్ ఫర్ జస్టిస్ చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నుతో చేతులు కలపొచ్చని, హిజాబ్ అంశాన్ని అడ్డుపెట్టుకుని ఉర్దూయిస్థాన్ కాన్సెప్ట్ ను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయవచ్చంటూ ఇంటెలిజెన్స్ బ్యూరో తాజాగా హెచ్చరించింది. రాజస్థాన్, ఢిల్లీ, యూపీ, బిహార్, వెస్ట్ బెంగాల్ లోని ప్రాంతాలతో ఉర్దూయిస్థాన్ ఏర్పాటుకు హిజాబ్ రెఫరెండమ్ ఉద్యమాన్ని ముస్లింలు ప్రారంభించాలంటూ సిఖ్స్ ఫర్ జస్టిస్ పిలుపునిచ్చినట్టు ఇంటెలిజెన్స్ బ్యూరో పేర్కొంది. ఇందుకు కావాల్సిన నిధులను సమీకరిస్తామంటూ హామీఇవ్వడాన్ని సైతం ప్రస్తావించింది. హిజాబ్ రిఫరెండం కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్లాట్‌ఫారమ్ కొన్ని స్క్రీన్షాట్లు, చిత్రాలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ అయ్యాయి. అంతేకాదు గురుపత్వంత్ సింగ్ పన్నూ ప్రసంగం కూడా వైరల్ అవుతున్న విషయాన్ని ఇంటెలిజెన్స్ వర్గాల నోట్ శుక్రవారం వివరించింది. -
అందుకే అర్థరాత్రి దహనం చేశాం: యూపీ సర్కార్
న్యూఢిల్లీ: హథ్రాస్ మృతురాలికి అర్థరాత్రి దహన సంస్కారాలు నిర్వహించడంతో యూపీ పోలీసుల పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. అయితే అందుకు గల కారణాలను ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వివరించింది. మరుసటి రోజు భారీ స్థాయిలో శాంతిభద్రతలకు ముప్పు తలెత్తే అవకాశం ఉందన్న ఇంటెలిజెన్స్ నివేదిక కారణంగానే తాము ఆ విధంగా చేయాల్సి వచ్చిందని తెలిపింది. అర్ధరాత్రి 2.30 నిమిషాలకు ఎందుకు దహనం చేయాల్సి వచ్చిందో కూడా తన అఫిడవిట్లో యూపీ సర్కార్ వివరించింది. బాబ్రీ మసీదు తీర్పు నేపథ్యంలో జిల్లాలో హై అలర్ట్ విధించారని, ఆ నేపథ్యంలో అల్లర్లు జరిగే ప్రమాదం ఉందన్న భావనతో అర్థరాత్రి దహనం చేసినట్లు తెలిపింది. సఫ్దార్‌గంజ్ హాస్పిటల్లో సెప్టెంబర్ 29వ తేదీన జరిగిన ధర్నా గురించి ఇంటెలిజెన్స్ నివేదిక వచ్చిందని, ఆ ఘటనకు కులం రంగు పూశారని యూపీ సర్కార్ సుప్రీం కోర్టుకు తెలిపింది. మరోవైపు ఇవాళ యోగి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ బృందం.. హత్రాస్ క్రైమ్‌సీన్‌కు వెళ్లి సమాచారం సేకరిస్తున్నది. (హత్రాస్ ఉదంతం: పోలీసుల ఎదుటే బెదిరింపులు) హత్రాస్ కేసులో సీబీఐ విచారణ చేపట్టే విధంగా ఆదేశాలు జారీ చేయాలని యూపీ సర్కార్ తన పిటిషన్లో సుప్రీంకోర్టును కోరింది. సుప్రీం పర్యవేక్షణలో సీబీఐ విచారణ కొనసాగాలని యూపీ ప్రభుత్వం అభిప్రాయపడింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేసేందుకు విషప్రచారం నిర్వహించారని అఫిడవిట్లో యోగి ప్రభుత్వం ఆరోపించింది. హత్రాస్ ఘటన పట్ల ఇప్పటి వరకు జరిగిన విచారణకు సంబంధించిన వివరాలను సుప్రీంకు సమర్పించారు. అర్థరాత్రి దహనం చేసేందుకు యువతి తల్లితండ్రులను జిల్లా అధికారులు ఒప్పించినట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. -
భారీ కుట్రకు పాక్ పన్నాగం.. మసూద్ విడుదల!
సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌పై ఉగ్రకుట్రకు పాల్పడేందుకు పాకిస్తాన్ వ్యూహాలు రచిస్తోంది. కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి హోదాకు కల్పిస్తున్న ఆర్టికల్ 370 రద్దు అనంతరం భారత్‌ను భారీ దెబ్బతీయాలని ఆదేశం పావులు కదుపుతోన్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ అధినేత మసూద్ అజాద్‌ను జైలు నుంచి రహస్యంగా విడుదల చేసినట్లు భారత ఇంటిలిజెన్స్ వర్గాలకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో భారత్-పాక్ సరిహద్దుల్లోని పంజాబ్, రాజస్తాన్, సియోల్‌కోట ప్రాంతాల్లో భారత బలగాలను అప్రమత్తం చేయాలని ఐబీ హెచ్చరించింది. భారత్‌పై ప్రతీకార చర్యలకు ఎప్పటి నుంచో కాలుదువ్వుతున్న పాక్.. అజార్‌ను విడుదల చేసి ప్రత్యేక వ్యూహాలు రచించినట్లు ఐబీ అనుమానం వ్యక్త చేస్తోంది. భారత్‌పై దాడికి పాల్పడేందుకు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులకు దిశానిర్థేశం చేయడానికి రెండురోజుల క్రితం మసూద్‌ను రహస్యంగా విడుదల చేశారని ఐబీ పేర్కొంది. కాగా అజాద్‌ను అరెస్ట్ చేయాల్సిందిగా ఇటీవల అంతర్జాతీయ వేదికలపై ప్రపంచ దేశాలు పాక్‌పై ఒత్తిడి చేయడంతో అతన్ని అరెస్ట్ చేసి జైలుకు పంపిన విషయం తెలిసిందే. ఉగ్రవాదాన్ని అణచివేస్తున్నామని అంతర్జాతీయ సమాజం ముందు నటిస్తూనే పాక్ ఇలాంటి వక్రబుద్ధిని ప్రదర్శిస్తోంది. కశ్మీర్ అంశం అనంతరం రెండు దేశాల మధ్య వాతావరణం యుద్ధ రీతిలో మాటల తూటాలు పేలిన విషయం తెలిసిందే. పాక్ మాటలకు భారత్ కూడా అదేరీతిలో ధీటైన సమాధానమే ఇచ్చింది. పాక్ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ ఓ అడుగుముందుకేసి కశ్మీర్‌కు తాము అండగా ఉంటామని, అవసరమైతే భారత్‌తో యుద్ధానికి కూడా సిద్ధంగా ఉంటామని గెంతులేశారు. భారత్‌పై త్వరలోనే ప్రతీకారం తీర్చుకుంటామని కూడా వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ ఉగ్రవాదిగా పేరొందిన అజార్‌ను భారత్‌పై యుద్ధానికి ఉసిగొల్పేందుకు జైలు నుంచి విడుదల చేసినట్లు అనుమానం వ్యక్తమవుతోంది. భారత నిఘా వర్గాల నుంచి సమాచారం అందుకున్న ఆర్మీ, రక్షణ సిబ్బంది సరిహద్దులో భద్రతను మరింత పెంచింది. బలగాలను అప్రమత్తం చేసింది. -
కేంద్రంలో కీలక నియామకాలు
సాక్షి, న్యూఢిల్లీ: నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ పదవీ కాలాన్ని మరో రెండేళ్ల పాటు పొడగిస్తూ.. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. నీతి ఆయోగ్ సీఈవోగా ఆయన 2016 ఏప్రిల్ 1న నియమితులైన విషయం తెలిసిందే. కాంత్ పదవీ కాలంలో జూన్ 30తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆయన పదవీ కాలాన్ని మరో రెండేళ్లు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుత పెంపుతో 2021 జూన్ 30 వరకు ఆయన పదవిలో కొనసాగనున్నారు. ఇంటెలిజెన్స్ బ్యూరో, రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (రా)లకు కేంద్ర ప్రభుత్వం కొత్త అధిపతులను నియమించింది. అస్సాం-మేఘాలయ కేడర్ 1984 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అరవింద్ కుమార్‌ను ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్‌గా కేంద్ర ప్రభుత్వం బుధవారం నియమించింది. ఆయన కశ్మీరు సంబంధిత అంశాల్లో నిపుణుడు. రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (రా) చీఫ్‌గా కశ్మీర్‌కు చెందిన సామంత్ గోయల్‌ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో భారత బలగాలు చేపట్టిన మెరుపు దాడులు, బాలకోట్ వైమానిక దాడులకు గోయల్ వ్యూహకర్తగా వ్యవహరించిన విషయం తెలిసిందే. కొత్తగా నియమితులైన వీరిద్దరూ కూడా 1984 బ్యాచ్ ఐపీఎస్ అధికారులు కావడం విశేషం. ఇక త్వరలో పదవీ విరమణ చేయబోతున్న భారత సైన్యం అధిపతి జనరల్ బిపిన్ రావత్ స్థానంలో ఎవరిని నియమిస్తారోనని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. -
అల్లర్లకు టీడీపీ కుట్ర
సాక్షి, అమరావతి: అధికారాంతమున తెలుగుదేశం పార్టీ బరి తెగిస్తోంది. ఓట్ల లెక్కింపు సందర్భంగా రాష్ట్రంలో అల్లర్లు, అలజడులు రేపేందుకు పన్నాగం పన్నుతోంది. శాంతిభద్రతల సమస్యలు సృష్టించి, ఓట్ల లెక్కింపు ప్రక్రియలో అక్రమాలకు పాల్పడాలన్నదే ఆ పార్టీ లక్ష్యం. టీడీపీ కుట్రను కేంద్ర నిఘా వర్గాలు గుర్తించడంతో అసలు బండారం బట్టబయలైంది. ఈ మేరకు టీడీపీ కుతంత్రంపై కేంద్ర ఇంటలిజెన్స్ బ్యూరో(ఐబీ) కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు నివేదిక అందజేసింది. దాంతో ఓట్ల లెక్కింపు సందర్భంగా ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఎన్నికల సంఘానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సమాచారం ఇచ్చినట్లు అత్యంత విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఐబీ వర్గాల సమాచారం ప్రకారం.. ఓట్ల లెక్కింపు ప్రక్రియకు విఘాతం కలిగించేందుకు టీడీపీ పక్కాగా పన్నాగం పన్నింది. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లోని అధికారులు, సిబ్బందితో టీడీపీ ఏజెంట్లు కుమ్మక్కయ్యేందుకు వ్యూహం పన్నారని ఐబీ గుర్తించింది. తద్వారా వీవీ ప్యాట్లోని స్లిప్పులను గల్లంతు చేయడం టీడీపీ ఏజెంట్ల అసలు ఉద్దేశం. అందుకోసం అవసరమైతే వీవీ ప్యాట్ స్లిప్పులను నమిలి మింగేయాలని కూడా టీడీపీ అధిష్టానం తమ ఏజెంట్లకు నిర్దేశించినట్లు సమాచారం. అనంతరం ఈవీఎంలోని ఓట్లకు, వీవీ ప్యాట్లలోని స్లిప్పులకు మధ్య తేడా ఉందని టీడీపీ ఏజెంట్లే లెక్కింపు కేంద్రాల్లో ఆందోళనకు దిగుతారు. అప్పటికే బయట ఉన్న టీడీపీ నేతలు, కార్యకర్తలు వెంటనే ఆందోళనలను ఉధృతం చేస్తారు. ఆ వెనువెంటనే దాడులకు దిగుతూ కౌంటింగ్ కేంద్రాల వద్ద భయోత్పాతాన్ని సృష్టిస్తారు. తద్వారా శాంతిభద్రతలకు విఘాతం కల్పించి ఏకంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియను అడ్డుకోవడమే వారి లక్ష్యం. ఇక టీడీపీ కచ్చితంగా ఓడిపోతుందన్న అంచనా ఉన్న నియోజకవర్గాల లెక్కింపు కేంద్రాల వద్దకు వైఎస్సార్సీపీ ఏజెంట్లను అనుమతించకూడదని టీడీపీ ఎత్తుగడ వేస్తోంది. అందుకోసం కొందరు రిటర్నింగ్ అధికారులతో టీడీపీ కుమ్మక్కైంది. వైఎస్సార్సీపీ ఏజెంట్లు లేకుండా చేసి ఓట్ల లెక్కింపు ప్రక్రియను తమకు అనుకూలంగా మార్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు. టీడీపీ ఓడిపోతుందని స్పష్టమవుతున్న నియోజకవర్గాల కౌంటింగ్ కేంద్రాల వద్ద మరింతగా బరి తెగించాలని టీడీపీ ఎత్తుగడ వేస్తోంది. ఆ కేంద్రాల వద్ద శాంతిభద్రతల సమస్యను సృష్టించేందుకు ఎంతకైనా తెగించాలని తమ శ్రేణులకు టీడీపీ నాయకత్వం ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఆయా నియోజకవర్గాల ఎన్నికల ఫలితాలను ప్రకటించకుండా అడ్డుకోవాలన్నది టీడీపీ కుతంత్రం. అందుకోసం పెద్దఎత్తున దాడులకు తెగబడేందుకు టీడీపీ సంఘ విద్రోహ శక్తులను ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద ముందస్తుగానే మోహరిస్తోందని ఐబీ నివేదించింది. సున్నిత నియోజకవర్గాలివీ... టీడీపీ అల్లర్లు, అలజడులు సృష్టించే అవకాశాలున్న నియోజకవర్గాల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘానికి ఐబీ నివేదించింది. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. అల్లర్లకు ఆస్కారం ఉన్న నియోజకవర్గాలు ఇవీ... అనంతపురం: తాడిపత్రి, రాప్తాడు, ఉరవకొండ, పెనుకొండ, హిందూపూర్ కర్నూలు: ఆళ్లగడ్డ, బనగానపల్లె, ఆదోని, డోన్, పత్తికొండ వైఎస్సార్: జమ్మలమడుగు, మైదుకూరు, రైల్వే కోడూరు, కమలాపురం, కడప చిత్తూరు: తంబళ్లపల్లె, పలమనేరు, చంద్రగిరి, శ్రీకాళహస్తి, తిరుపతి నెల్లూరు: నెల్లూరు టౌన్, నెల్లూరు రూరల్, ఆత్మకూరు, కొవ్వూరు, ప్రకాశం: చీరాల, అద్దంకి, కొండేపి, కనిగిరి గుంటూరు: పెదకూరపాడు, సత్తెనపల్లి, మంగళగిరి, ప్రత్తిపాడు, చిలకలూరిపేట కృష్ణా: మైలవరం, విజయవాడ సెంట్రల్, విజయవాడ తూర్పు, గన్నవరం, గుడివాడ పశ్చిమ గోదావరి: దెందులూరు, ఏలూరు, తణుకు, ఆచంట తూర్పు గోదావరి: కొత్తపేట, రామచంద్రాపురం, కాకినాడ రూరల్, అమలాపురం విశాఖపట్నం: భీమిలి, గాజువాక, పెందుర్తి విజయనగరం: బొబ్బిలి, చీపురుపల్లి శ్రీకాకుళం: నరసన్నపేట, ఆమదాలవలస అప్రమత్తంగా ఉండండి కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ సందర్భంగా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల అధికారిని ఆదేశించింది. ఈవీఎంలలో ఓట్ల లెక్కింపును మొదట పూర్తి చేయాలని స్పష్టం చేసింది. అనంతరం ఈవీఎంలను సురక్షితంగా మళ్లీ భద్రపర్చాలని సూచించింది. ఆ తరువాతే వీవీ ప్యాట్ల స్లిప్పుల లెక్కింపు ప్రక్రియ చేపట్టాలని స్పష్టం చేసింది. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించింది. అసాంఘిక, అనధికార వ్యక్తులు ఎవరూ లెక్కింపు కేంద్రాల పరిసర ప్రాంతాల్లో ఉండకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని నిర్దేశించింది. ఓట్ల లెక్కింపు సందర్భంగా టీడీపీ అరాచకాలు సృష్టించేందుకు కుట్ర పన్నిందన్న నిఘా వర్గాల సమాచారం అధికార వర్గాలను ఆందోళన పరుస్తోంది. -
ఐబీ హెచ్చరికలతో తిరుమలలో ముమ్మర తనిఖీలు
సాక్షి, తిరుమల : శ్రీలంకలో ఈస్టర్ రోజున ఉగ్రవాదులు సృష్టించిన మారణహోమం నేఫథ్యంలో భారత నిఘావర్గాలు అలర్ట్ అయ్యాయి. ఆల్ ఉమా ఉగ్రవాద సంస్థ తిరుమల తిరుపతి ప్రాంతాలలో రెక్కీ నిర్వహించినట్లు అధికారులకు సమాచారం అందింది. ఐబీ హెచ్చరికల నేపథ్యంలో శనివారం తిరుమలకు వచ్చే మార్గాలన్నింటిలో విజిలెన్స్ అధికారులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. కాగా ఎన్ఐఏ అదుపులో ముగ్గురు పురుషులు, ఒక మహిళా ఉగ్రవాది ఉన్నట్లు సమాచారం. ఈస్టర్ రోజున శ్రీలంకలో జరిగిన ఉగ్రదాడిలో దాదాపు 290 మంది మృత్యువాత పడ్డ సంగతి తెలిసిందే. -
పట్టుబడింది ఐబీ అధికారులే..
సాక్షి, న్యూఢిల్లీ : సీబీఐ మాజీ చీఫ్ అలోక్ వర్మ నివాసం ఎదుట పట్టుబడిన నలుగురు వ్యక్తులు తమ అధికారులేనని ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) గురువారం అంగీకరించింది. సమస్యాత్మక ప్రాంతాల్లో సాధారణ గస్తీలో భాగంగానే వారు అక్కడ విధుల్లో ఉన్నారని వివరణ ఇచ్చింది. అంతర్గత భద్రత పర్యవేక్షణ, శాంతిభద్రతలకు విఘాతం వంటి ఇబ్బందులు తలెత్తకుండా నివారించే క్రమంలో ఇంటెలిజెన్స్ సమాచారం సేకరించే బాధ్యతను ఆ నలుగురు అధికారులకు అప్పగించారని ఐబీ వర్గాలు వెల్లడించాయి. సమస్యాత్మక ప్రాంతాల్లో తరచూ ఐబీ అధికారులను నియోగిస్తారని, స్ధానిక పోలీసుల సహకారంతోనూ వీటిని చేపడతారని తెలిపాయి. తమ పరిశీలనలో తేలిన విషయాలను స్ధానిక పోలీసులకు చేరవేస్తే వారు వేగంగా స్పందించే అవకాశం ఉంటుందని పేర్కొన్నాయి. ఐబీ ఐడీ కార్డులతోనే వారు డ్యూటీలో ఉన్నారని, గురువారం ఉదయం ఐబీ యూనిట్ జన్‌పథ్ వద్ద పెద్దసంఖ్యలో ప్రజలు గుమికూడటంతో అక్కడ ఆగిందని, దీంతో వారిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారని పేర్కొన్నాయి. మరోవైపు నలుగురు ఐబీ అధికారులను అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నారన్న వార్తలను ఢిల్లీ డీసీపీ మాధుర్ వర్మ తోసిపుచ్చారు. -
గన్‌మెన్ ఉండాల్సిందే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీల భద్రతపై ఇంటెలిజెన్స్ విభాగం అప్రమత్తమైనట్లు తెలిసింది. ఎన్నికలు సమీపిస్తుండటం, ఇతరత్రా కారణాల వల్ల వారి భద్రత విషయమై జాగ్రత్తలు తీసుకుంటోంది. నాలుగేళ్లుగా గన్మెన్లను నియమించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్న ఎమ్మెల్యేలు, ఎంపీలపై ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావుకు అధికారులు నివేదించినట్లు సమాచారం. ఉండాల్సిందే.. రాష్ట్రంలోని ఎమ్మెల్యేల్లో కొంతమంది ఒకే గన్‌మెన్‌తో, మరికొంత మంది గన్మెన్లు లేకుండానే నియోజకవర్గాలు, ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. దీంతో అనుకోని సంఘటనలు జరగకుండా ఉండేందుకు గన్మెన్లను నియమిస్తే మరుసటి రోజే హెడ్‌క్వార్టర్స్‌కు రిటర్న్ చేస్తున్నట్లు ఇంటెలిజెన్స్‌కు ఎస్పీలు రిపోర్టు చేశారు. ఈ విషయమై ఎమ్మెల్యేలకు ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు లేఖలు రాశారు. పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ (పీఎస్ఓ)లను తొలగించుకోవడం సరికాదని చెప్పారు. ఎమ్మెల్యేలు సొంతగా కారు డ్రైవ్ చేసుకుంటూ తిరగడంపైనా అభ్యంతరం వ్యక్తం చేశారు. భద్రతపై ఆయా జిల్లాల మంత్రులతోనూ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. సీఎం కార్యాలయం నుంచి నేరుగా కొంతమందికి ఫోన్లు వెళ్లడంతో తప్పక పలువురు గన్మెన్లను నియమించుకున్నట్లు తెలిసింది. ముగ్గురు ఎంపీలూ.. ముగ్గురు ఎంపీల విషయంలోనూ ఇదే వ్యవహారం బయటపడినట్లు తెలిసింది. గన్మెన్లను కేటాయిస్తే క్యాంపు ఆఫీసు, ఇళ్లలో వదిలి కార్యకర్తలు, అనుచరులతో వెళ్తున్నారని.. ఆ ఎంపీలకూ మందలింపులు జరిగాయని సమాచారం. దీంతో ఇద్దరు 2+2 నియమించుకోగా, ఓ ఎంపీ 1+1 స్వీకరించినట్లు తెలిసింది. కాగా ఎమ్మెల్యేలు, ఎంపీలు.. ఎస్పీలు, కమిషనర్ల మధ్య గన్మెన్లు ఒత్తిడికి గురవుతున్నారు. వారిని ఎమ్మెల్యేలు వెంట తీసుకెళ్లకపోవడం.. వెళ్లకపోతే అధికారులు క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుండటంతో ఏం చేయాలో తెలియడం లేదని వారు వాపోతున్నారు. -
ఇంటెలిజెన్స్ ఉద్యోగి అనుమానాస్పద మృతి
గుణదల (విజయవాడ ఈస్ట్) : విధి నిర్వహణలో ఉన్న ఇంటిలిజెన్స్ ఉద్యోగి అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. బాపట్ల నగరం నర్సాయపాలెం ప్రాంతానికి చెందిన కట్టా విజయకుమార్ (37) ప్రస్తుతం కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నంలో కుటుంబంతో ఉంటున్నారు. ఇంటెలిజెన్స్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్‌గా ఉద్యోగం చేస్తున్నారు. అతనికి భార్య ఏసువాణి, కుమార్తె థెరిసా ఉన్నారు. విధి నిర్వహణలో భాగంగా సోమవారం విజయవాడకు వచ్చారు. రాత్రి 11 గంటల సమయంలో మొగల్రాజపురం సున్నపు బట్టీల సెంటర్‌కు చేరుకున్నారు. సమీపంలో ఉన్న లక్ష్మీదుర్గ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో టిఫిన్ చేస్తూ కుప్పకూలిపోయారు. పరిస్థితి అర్థం కాని స్థానికులు అతనిని తట్టిలేపే ప్రయత్నం చేశారు. ఎంతకీ లేవకపోవడంతో మాచవరం పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించిన పోలీసులు 108 సహాయంతో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు చేసిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు వెల్లడించారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గుండెపోటుతో చనిపోయి ఉండవచ్చని భావిస్తున్నారు. గతంలో కూడా ఒకసారి గురైనట్లు దర్యాప్తులో తేలిందని అంటున్నారు. ఏదైనా పోస్టుమార్టం రిపోర్ట్ ఆధారంగానే కేసు నిర్ధారిస్తామని పోలీసులు తెలిపారు. కన్నీరుమున్నీరుగా రోదన విజయకుమార్ మృతి చెందారన్న వార్త వినగానే కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. భార్య, కుమార్తె, బంధువులు సోమవారం అర్ధరాత్రి ప్రభుత్వాసుపత్రి వద్దకు చేరుకుని మృతదేహం వద్ద కన్నీరు మున్నీరుగా విలపించారు. నిన్నటి వరకూ కళ్ల ముందు తిరిగిన వ్యక్తి విగత జీవిగా మారటంతో తీవ్ర ఆవేదనకు గురయ్యారు. విధి నిర్వహణలో మృతి చెందినందుకు ఇంటెలిజెన్స్ పోలీసులు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని ఇబ్రహింపట్నానికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. అంకిత భావంతో విధులు రైతువారీ పద్ధతిలో పెరిగిన విజయకుమార్ కష్టపడి చదివి 2005 లో ఏపీఎస్పీ కానిస్టేబుల్ ఉద్యోగాన్ని సంపాదించారు. 2009లో పదోన్నతి పొంది ఇంటెలిజెన్స్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నారు. రానున్న రోజుల్లో మంచి ఉన్నతాధికారిగా ఎదగాలనే కోరిక తీరకుండానే మృతి చెందారు. పోలీస్ లాంఛనాల ప్రకారం మంగళవారం అంత్యక్రియలు నిర్వహించారు. -
మాట్లాడింది బాబే!
-
మాట్లాడింది బాబే!
- ట్యాపింగ్‌కు అవకాశమే లేదు - ‘ఓటుకు నోటు’ కేసులో నిర్ధారించిన ఇంటెలిజెన్స్ బ్యూరో - ఈ వ్యవహారంపై కేంద్రానికి అరడజను నివేదికలు - జూబ్లీహిల్స్‌లోని బాబు నివాసం నుంచే స్టీఫెన్సన్కు ఫోన్ - సెల్‌టవర్ లొకేషన్ వివరాలతో సహా వెల్లడి - ఎమ్మెల్యేల కొనుగోలుకు భారీగా బేరసారాలు - స్వయంగా ఓ కేంద్ర మంత్రి పర్యవేక్షణపైనా నివేదిక సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు నోటు’ వ్యవహారంలో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో ఫోన్లో మాట్లాడింది ఏపీ సీఎం చంద్రబాబునాయుడేనని కేంద్ర నిఘా సంస్థ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) స్పష్టం చేసింది. చంద్రబాబు, ఆంధ్రప్రదేశ్ మంత్రులు, టీడీపీ నేతలు ఆరోపిస్తున్నట్లుగా ఫోన్ ట్యాపింగ్ జరగలేదని.. ట్యాపింగ్ జరిగి ఉండే అవకాశం ఏమాత్రం లేదని నిర్ధారించింది. ఇందుకు తగిన ఆధారాలతో కూడిన అరడజను నివేదికలను కేంద్ర ప్రభుత్వానికి ఐబీ అందజేసింది. ఈ వ్యవహారంలో ఎమ్మెల్యేల బేరసారాల దగ్గరి నుంచి ఓ కేంద్రమంత్రి భాగస్వామ్యం దాకా అన్ని వివరాలనూ ఆ నివేదికల్లో పొందుపరచింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటేయాలంటూ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో రూ. 5 కోట్లకు ఒప్పందం కుదుర్చుకుని రూ.50 లక్షలు అడ్వాన్స్‌గా ఇస్తూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన విషయం విదితమే. ఈ వ్యవహారంలో స్టీఫెన్సన్కు రేవంత్ రూ.50 లక్షలు ఇవ్వజూపుతున్న దృశ్యాల వీడియోలతో పాటు స్టీఫెన్‌సన్‌తో ఏపీ సీఎం చంద్రబాబు ఫోన్లో మాట్లాడిన ఆడియో రికార్డులు బహిర్గతమయ్యాయి. దీంతో ఆత్మరక్షణలో పడిన చంద్రబాబు, ఆంధ్రప్రదేశ్ మంత్రులు, టీడీపీ నేతలు.. తమ ఫోన్లను తెలంగాణ ప్రభుత్వం ట్యాప్ చేస్తోందంటూ అడ్డగోలు ఆరోపణలకు దిగారు. తమ ఫోన్లు ట్యాప్ చేస్తున్నారంటూ కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు కూడా చేశారు. దీంతో కేంద్ర హోంశాఖ ఈ వ్యవహారంపై నివేదిక ఇవ్వాల్సిందిగా ఇంటలిజెన్స్ బ్యూరో(ఐబీ)ను ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్‌కు అవకాశం ఉన్న దాదాపు అన్ని విభాగాల అధికారులను ఐబీ విచారించింది. బీఎస్ఎన్ఎల్తో పాటు ప్రైవేట్ ఆపరేటర్లను విచారించి.. తెలంగాణ రాష్ట్ర పోలీసులు ఎవరి ఫోన్లు ట్యాప్ చేయలేదని నిర్ధారించుకుంది. దీంతోపాటు ‘ఓటుకు నోటు’ కేసుకు సంబంధించి అన్ని అంశాలతో కేంద్ర ప్రభుత్వానికి దాదాపు అరడజను నివేదికలను ఐబీ అందజేసింది. ఫలానా ఫోన్ ట్యాపింగ్ కోసం లేదా ఫలానా ప్రాంతం నుంచి మాట్లాడే ఫోన్లు ట్యాప్ చేయడం కోసం ఎలాంటి సాంకేతిక సదుపాయాలు వినియోగించలేదని ఐబీ తన నివేదికలో స్పష్టం చేసింది. దీంతో తమ ఫోన్లు ట్యాప్ చేశారంటూ చంద్రబాబు, ఏపీ మంత్రులు, టీడీపీ నేతలు చేసిన ఆరోపణలన్నీ పూర్తిగా అవాస్తవాలని తేలిపోయింది. బాబు నివాసం నుంచే.. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో ఫోన్లో మాట్లాడింది ఏపీ సీఎం చంద్రబాబేనని తమ నివేదికల్లో ఐబీ స్పష్టం చేసింది. ఆ సమయంలో హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన నివాసం నుంచే చంద్రబాబు మాట్లాడారని సెల్‌టవర్ లొకేషన్ వివరాలతో సహా పేర్కొంది. ఎమ్మెల్యేలతో పెద్ద ఎత్తున బేరసారాలు జరిగాయని నివేదించింది. ఈ బేరసారాలకు ఎవరు పాల్పడ్డారు, వారు ఏ హోదాలో ఉన్నారనే వివరాలను రేవంత్ అరెస్టయిన రెండు రోజులకే కేంద్రానికి అందజేసిన నివేదికలో తెలియజేసింది. కేంద్ర మంత్రి ఒకరు ఈ వ్యవహారాన్ని దగ్గరుండి పర్యవేక్షించారని, కొందరు ఎమ్మెల్యేలతో నేరుగా మాట్లాడారని అందులో వివరించింది. ఈ కేసుకు సంబంధించి ఏసీబీ ఉన్నతాధికారులతో ఐబీ అధికారి ఒకరు ఇటీవల తరచూ సమావేశమై, కేసు పూర్వాపరాలను అడిగి తెలుసుకున్నారు కూడా. ‘‘ఎప్పటికప్పుడు మేం కేంద్రానికి నివేదికలు ఇస్తుంటాం. ఇదేం కొత్త కాదు.. ఏ ముఖ్యమైన ఘటన జరిగినా పూర్వాపరాలు తెలుసుకుంటాం. ముఖ్యంగా రాష్ట్ర పోలీసులపైనే ఆధారపడుతాం. కానీ ఈ కేసులో ఓ ముఖ్యమంత్రి పాత్ర ఉండటంతో ప్రతి దానినీ లోతుగా పరిశీలిస్తున్నాం..’’ ఓ సీనియర్ అధికారి సాక్షి ప్రతినిధికి చెప్పారు.