
సాక్షి, తిరుమల : శ్రీలంకలో ఈస్టర్ రోజున ఉగ్రవాదులు సృష్టించిన మారణహోమం నేఫథ్యంలో భారత నిఘావర్గాలు అలర్ట్ అయ్యాయి. ఆల్ ఉమా ఉగ్రవాద సంస్థ తిరుమల తిరుపతి ప్రాంతాలలో రెక్కీ నిర్వహించినట్లు అధికారులకు సమాచారం అందింది. ఐబీ హెచ్చరికల నేపథ్యంలో శనివారం తిరుమలకు వచ్చే మార్గాలన్నింటిలో విజిలెన్స్ అధికారులు ముమ్మర తనిఖీలు చేపట్టారు.
కాగా ఎన్‌ఐఏ అదుపులో ముగ్గురు పురుషులు, ఒక మహిళా ఉగ్రవాది ఉన్నట్లు సమాచారం. ఈస్టర్ రోజున శ్రీలంకలో జరిగిన ఉగ్రదాడిలో దాదాపు 290 మంది మృత్యువాత పడ్డ సంగతి తెలిసిందే.