సాక్షి, తిరుమల: టీటీడీ విజిలెన్స్ వలలో పెద్ద దళారీ పడ్డాడు. 46 మంది ప్రజా ప్రతినిధులు, మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల సిఫార్సు లేఖలతో భక్తులకు అధికమొత్తంలో విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. తెలంగాణ మాజీ డిప్యూటీ సీఎం సిఫార్సు లేఖ పై 36 సార్లు, అంబర్ పేట ఎమ్మెల్యే సిఫార్సు పై 23 సార్లు, వరంగల్ ఎమ్మెల్యే కోటాలో 17 సార్లు, ఎంపీ కోటాలో 11 సార్లు టిక్కెట్లు అమ్ముకున్నట్లు గుర్తించారు. ఏపీ మాజీ, ప్రస్తుత హోం మంత్రులనూ కూడా వదిలి పెట్టని దళారీ చారి.. వారి లేఖలపై కూడా టిక్కెట్లు పొందినట్లు తెలుస్తోంది.
తిరుమలలో కల్లూరీ రాజు అనే మరో దళారీని టీటీడీ విజిలెన్స్ విభాగం అధికారులు పట్టుకున్నారు. ఇద్దరు ప్రజాపతినిధుల సిఫార్సు లేఖలతో శ్రీవారి దర్శనానికి పంపుతుండగా విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సిఫార్సు లేఖలతో పేర్లు మార్చి పంపుతున్న అతడిని పట్టుకొని పోలీసులకు పిర్యాదు చేసినట్లు విజిలెన్స్ అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment