ఛత్తీస్‌గఢ్‌లో ప్రభుత్వం మారిన వెంటనే పాలనలో అనేక మార్పులు మొదలయ్యాయి. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి కాన్వాయ్‌లోని ఒక వాహనానికి గల బీబీ-0023 అనే నంబర్ ప్లేటును తొలగించారు. దీనిలో బీబీ అంటే అంటే భూపేష్ బఘేల్ (మాజీ ముఖ్యమంత్రి). అలాగే 23 అతని పుట్టినరోజు. దీని ప్రకారం నంబర్ ప్లేటును బీబీ-0023గా రూపొందించారు. ముఖ్యమంత్రి సచివాలయం అందించిన మార్గదర్శకాల ప్రకారం ఈ నంబర్ ప్లేట్ మార్చారు.
నూతన సీఎం విష్ణు దేవ్ సాయి కారుకు వచ్చిన కొత్త నంబర్ సీజీ-03-9502. గతంలో ముఖ్యమంత్రి కాన్వాయ్‌లో సీజీ-02 నంబర్ ఉండేది. మాజీ సీఎం బఘేల్ తన కాన్వాయ్‌లో ఉన్న వాహనాలకు ప్రత్యేక నంబర్‌ను తీసుకున్నారు. ఇప్పుడు ఆ నంబర్లను సమూలంగా మార్చారు.
అంతకు ముందు మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ తన కాన్వాయ్‌లో ఉన్న వాహనాలను కూడా మార్చారు. నాడు సీఎం తన కాన్వాయ్‌లోని మిత్సుబిషి పజెరో వాహనాన్ని తొలగించారు. ఛత్తీస్‌గఢ్‌లో సీజీ-01, సీజీ-02, సీజీ-04 రిజిస్ట్రేషన్‌ను రాయ్‌పూర్ ఆర్‌టీఓ పర్యవేక్షిస్తుండగా, సీజీ-03 రిజిస్ట్రేషన్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో జరగడం గమనార్హం.
ఇది కూడా చదవండి: ‘నిర్భయ’కు 11 ఏళ్లు... మహిళల భద్రతకు భరోసా ఏది?
Comments
Please login to add a commentAdd a comment