ఇటీవల జరుగుతున్న రోడ్డు ప్రమాదాల రీత్యా వాహానాల రిజిస్ట్రేషన్ నిబంధనలు నుంచి ట్రాఫిక్ రూల్స్ వరకు అన్ని కఠినతరం చేశారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు పలు వాహనదారులు చేస్తున్న తప్పిదాలు, రిజిస్ట్రేషన్ నంబర్ విషయాల్లో పాటించాల్సిన జాగ్రత్తలు వంటి విషయాల్లో సోషల్ మీడియా వేదికగా అవగాహన కల్పిస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగా ఒక వ్యక్తి కారుకి ఉండే నెంబర్ ప్లేట్ మీద నెంబర్ బదులు ఏం రాయించుకున్నాడో ఫోటోలు ట్వీట్ చేశారు
సదరు కారు యజమాని నెంబర్ ప్లేట్ మీద రిజస్టేషన్ నెంబర్‌ని విచిత్రంగా హిందీలో తండ్రిని పిలిచే విధంగా 'పాపా' అనే అర్థం వచ్చేలా పెట్టుకున్నాడు. ఈ నెంబర్ ప్లేట్‌తోనే కారులో దర్జాగా తిరిగేస్తున్నాడు సదరు వ్యక్తి. దీంతో ఉత్తరాఖండ్ పోలీసులు సదరు కారు యజమానిని అదుపులోకి తీసుకోవడమే కాకుండా రిజిస్ట్రేషన్ నెంబర్ స్థానంలో ఇలా పేర్లు ఉండకూడదంటూ సదరు యజమానికి జరిమాన విధించారు.
ఈ మేరకు పోలీసులు ట్విట్టర్‌లో ...1987 చిత్రం "ఖయామత్ సే ఖయామత్ తక్"లోని నాన్న మీద ప్రేమతో కూడిన ప్రసిద్ధ పాట "పాపా కెహతే హై"ఉంటుందని చెప్పారు. అందులో మాదరి మా నాన్న పేరు కారు మీద రాస్తాను అంటే కుదరదన్నారు. అలాంటి రిజిస్ట్రేషన్ ప్లేట్‌లకు జరిమాన విధించబడుతుందని కూడా ఎవరికీ తెలియదని చెప్పారు. సదరు వాహన యజమానికి జరిమాన విధించడంతో రిజస్ట్రేషన్ నెంబర్ సరిచేసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు పోలీసులు రిజిస్ట్రేషన్ నెంబర్ సరిచేయక ముందు, సరిచేసుకున్నాక కారు నెంబర్ ప్లేట్‌కి సంబంధించిన ఫోటోలను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ విషయం ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది.
पापा कहते हैं बड़ा नाम करेगा,
— Uttarakhand Police (@uttarakhandcops) July 12, 2022
गाड़ी के प्लेट पर पापा लिखेगा,
मगर ये तो कोई न जाने,
कि ऐसी प्लेट पर होता है चालान..
ट्वीट पर शिकायत प्राप्त करने के बाद #UttarakhandPolice ने गाड़ी मालिक को यातायात ऑफिस बुलाकर नम्बर प्लेट बदलवाई और चालान किया। pic.twitter.com/oL4E3jJFAV
(చదవండి: జస్ట్ మిస్.. చిన్నారికి తప్పిన ఘోర ప్రమాదం.. ‘స్టుపిడ్ ఫెల్ అంటూ’.. )
Comments
Please login to add a commentAdd a comment