తమిళ నటి షాలు షమ్ము అంటే తెలుగువారు ఎవరైన టక్కున గుర్తు పట్టకపోవచ్చు కానీ కోలీవుడ్‌లో పాపులర్ నటి. అక్కడి సోషల్ మీడియాలో తనపేరు ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉంటుంది. గతంలో టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ దర్శకుడిపై కాస్టింగ్ కౌచ్ ఆరోపణ చేయడంతో అప్పట్లో ఆమె పేరు తెలుగునాట కూడా వైరల్ అయింది. శివకార్తికేయన్ హీరోగా మిస్టర్ లోకల్ సినిమాతో మంచి గుర్తింపు పొందింది. తర్వాత తనకు పలు సినిమా అవకాశాలు వచ్చినా అవి ఆశించినంత ఫలితాన్ని ఇవ్వలేదు.
దీంతో షాలు షమ్ముకు సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. తర్వాత ఆమె షోషల్‌మీడియాకే పరిమితమై తన వర్కౌట్ వీడియోలతో పాటు సల్సా డ్యాన్స్ వీడియోలను పోస్ట్ చేసేది. అంతే కాకుండా చాలా ఆకర్షణీయమైన తన ఫోటోలను కూడా షేర్ చేసేది. అలా ఆమె పేరు అందరిలో ఉండేలా జాగ్రత్తపడేది.
(ఇదీ చదవండి: రాజకీయాల్లోకి కీర్తి సురేష్.. గతంలోనూ ఇదే చర్చ)
తర్వాత తనకు తమిళ్ బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొనబోతున్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి. కానీ వాటిలో నిజం లేదని ఆమె తెలిపింది. తాజాగా తను కోటి రూపాయల లగ్జరీ కారును తక్కువ ధరకు కొనుగోలు చేసిందని తెలిసి అభిమానులు షాక్ అవుతున్నారు. షాలూ షమ్ము తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో రూ.1 కోటి విలువ చేసే జాగ్వార్ కారును సెకండ్ హ్యాండ్‌లో రూ. 50 లక్షలకు కొన్నట్లు తెలిపింది. ఆ కారు కొనడం తన చిరకాల కోరికని తెలిపింది.
(ఇదీ చదవండి: రోడ్డు ప్రమాదానికి గురైన 'సలార్' విలన్.. నేడు సర్జరీ)
ఓ వైపు సినిమా అవకాశాలు లేనప్పుడు ఇంత డబ్బు ఎలా వస్తుందని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. సినిమాలేనా? మరేదైనా చేస్తున్నావా? అంటూ కామెంట్లు చేస్తున్నారు. వాటికి ఆమె తిరిగి ఎలాంటి సమాధానాలు ఇవ్వలేదు. కానీ నటి షాలు షమ్ము స్కిన్ కేర్ క్లినిక్ కూడా నడుపుతున్నట్లు గతంలో తెలిపింది. ఆ కంపెనీ నుంచి వచ్చిన మొత్తంతోనే ఆమె ఈ కారును కొనుగోలు చేసి ఉంటుందని పలువురు అంటున్నారు.
విజయ్ దేవరకొండతో సినిమా.. గతంలో ఇలాంటి కామెంట్ చేసింది
గతంలో తను చేసిన ఆరోపణలు ఇవే.. తెలుగు పరిశ్రమలో ఓ ప్రముఖ దర్శకుడు తనకు విజయ్ దేవరకొండ సినిమాలో అవకాశాలు ఇప్పిస్తామని ఆఫర్ చేశాడు, అయితే ఆ సినిమాలో ఆఫర్ రావాలంటే.. తన కోరిక తీర్చాల్సి ఉంటుందని కండీషన్ పెట్టినట్లు అప్పట్లో కామెంట్ చేసింది. ఆ కారణంతో విజయ్‌తో వచ్చిన సినిమా అవకాశాన్ని వదులుకున్నట్లు చెప్పిన విషయం తెలిసిందే. కానీ ఆ దర్శకుడెవరో మాత్రం చెప్పలేదు ఈ ముద్దుగుమ్మ. దీంతో ఒక్కసారిగా ఆమె పేరు తమిళ్, తెలుగు పరిశ్రమలో సంచలనంగా మారిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment