ఎవరికైన ఒకటో రెండో లేక మహా అయితే నాలుగు పెంపుడు జంతువులు ఉంటాయి. అంతేగానీ ఎవరు పెద్ద మొత్తంలో జంతువులను పెంచుకోరు. పైగా వాటి ఆలనాపాలన చూసుకోవడం కష్టమవుతుంది కూడా. ఐతే ఇక్కడోక యజమాని దగ్గర ఉన్న పెంపుడు జంతువుల సంఖ్యను చూసి ఆశ్చర్యపోతారు! పైగా వాటితో ఎక్కడ నివశిస్తున్నాడో వింటే నోరెళ్లబెడతారు.
వివరాల్లోకెళ్తే...అమెరికాలోని మిన్నెసోటాలోని ఒక ప్రదేశంలో పార్క్ చేసిన కారులో ఏకంగా 47 పిల్లులు ఉన్నాయి. భారత్‌లో 40 ఉంటే అధిక ఉష్ణోగ్రతలు అంటాం. కానీ అమెరికాలో కేవలం 30 డిగ్రిల ఉష్ణోగ్రత నమోదైతే చాలు ప్రజల గగ్గోలు పెట్టేస్తారు. ప్రస్తుతం అక్కడ మిన్నెసోటాలో సుమారు 32 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ అధిక ఉష్ణోగ్రతలు కారణంగా ప్రలెవ్వరూ బయటకు అడుగుపెట్టను కూడా పెట్టడం లేదు. ఐతే ఒక వ్యక్తికి 47 పెంపుడు పిల్లులు ఉన్నాయి. ఈ మధ్య అతనికి కొన్ని కారణాల వల్ల ఉండేందుకు ఇల్లు కూడా లేకుండా పోయింది.
ఐతే తన పెంపుడు పిల్లులను విడిచిపెట్టేందకు ఇష్టపడలేదు. దీంతో అతను ఆ 47 పిల్లులను తీసకుని తన కారులోనే నివశిస్తున్నాడు. ఈ మేరకు ఒకతను కారు కిటికి తట్టినప్పుడూ ఆ యజమాని విషయమంతా చెప్పాడంతో ఈ ఘటన వెలుగు చూసింది. దీంతో యానిమల్ హ్యూమన్ సొసైటీ(ఏహెచ్‌ఎస్) రంగంలోకి దిగి ఆ 47 పిల్లులను స్వాధీనం చేసకుని వాటికి అవసరమైన సంరక్షణను అందించింది. అవన్నీ ఒకచోట చాలా రోజులుగా ఉన్నప్పటికీ ఆరోగ్యంగానే ఉన్నాయని ఏహెచ్‌ఎస్ తెలిపింది.
(చదవండి: టిఫిన్ ప్లేట్‌లో బల్లి...కస్టమర్‌కి ఎదురైన చేదు అనుభవం)
Comments
Please login to add a commentAdd a comment