Word
-
మాటే మహాత్మ్యం
మాటకున్న మహత్తు ఇంతా అంతా కాదు. బయటి నుంచి తెచ్చుకోవాల్సిన పని లేని ఆయుధం. ప్రతి మనిషికి సహజంగా ఇవ్వబడినది. ఎవరికి వారికి తగిన రీతిలో ప్రత్యేకంగా తయారు చేసి ఇవ్వబడింది. మనిషి తనంత తానుగా చేయ వలసినది దానిని పదును పెట్టి, పాడవకుండా, తుప్పు పట్టకుండా చూసుకోవటం. దానికి ముందుగా అందరూ అప్రయత్నంగా చేసేది పెద్దలని చూసి అనుకరించటం. తరువాత శిక్షణ తీసుకోవటం. ఈ శిక్షణ పాఠశాలలలో కాని, విడిగా శిక్షణాతరగతులలో కాని జరుగుతుంది. ఇతర జీవులకి వేటికి లేని ప్రత్యేకత మానవుడికి మాత్రమే ఇవ్వ బడింది. అదే మనస్సు. దాని లక్షణం ఆలోచించటం. ఆపై తన ఆలోచనలను ఇతరులతో పంచుకోవటం. దానికి సాధనం భాష. మానవులకి మాత్రమే ఇవ్వ బడిన భాష అనే విలువైన సాధనాన్ని సద్వినియోగం చేసుకోవాలి కదా! అపార్థాలు కలగకుండా, అనర్థాలు వాటిల్లకుండా, సమర్థవంతంగా తన భావనలని వ్యక్తం చేయటానికి, దానికి సాధనమైన మాటని జాగ్రత్తగా ఉపయోగించాలి. మాటతో మనుషులు, కుటుంబాలు, సంస్థలు, దేశాలు కలుస్తాయి, విడిపోతాయి కూడా. మాట ప్రాణం పోస్తుంది, మాట ప్రాణం తీస్తుంది. వీటి అన్నిటికీ చరిత్రలో ఉదాహరణలు కోకొల్లలు. రామకథలో ప్రతి మలుపుకి ఒక మాట కారణమయింది. స్వతంత్ర భారత దేశం ముక్కలు కావటానికి ఒక మాట కారణం అంటారు ఆనాటి రాజనీతివేత్తలు. కుటుంబ కలహాలకి చెప్పుడు మాటలే కారణం అని విన్నవాళ్ళకి కూడా తెలుసు. కాని, ఆ క్షణాన ఆ మాటలు ఇంపుగా అనిపిస్తాయి. దీనినే కైటభుడుగా పురాణాలు సంకేతించి చెప్పాయి. వినగా వినగా నిజమే నేమో అనిపిస్తుంది, క్రమంగా నిజమే అనిపిస్తుంది. చిన్నప్పుడు విన్న బ్రాహ్మణుడు – నల్లమేకకథ గుర్తు ఉంది కదా! (ప్రస్తుతం మన ప్రచార, ప్రసార సాధనాలు ఈ సిద్ధాంతాన్ని బాగా ఉపయోగించుకుంటున్నాయి.) ఆంగ్లంలో ఒక సామెత ఉంది. ఒక కుక్కని చంపాలి అంటే ముందు అది పిచ్చిది అని ప్రచారం చేయాలి అని. మాటకి ఉన్న శక్తి అర్థమయింది కదా! ఉచ్చారణ, వ్యాకరణం, వాక్యనిర్మాణం, కాకువు, ముఖకవళికలు, ముఖ్యంగా కళ్ళు, కనుబొమల కదలికలు, శరీర భంగిమ, కాళ్ళు చేతుల కదలికలు మొదలైనవి అన్నీ మాటలతో పాటు భావ ప్రకటనకి సహకరిస్తాయి. ఉచ్చారణ స్పష్టంగా లేక పోతే ‘కళ్ళు’ తెరవటం ‘కల్లు’ తెరవటం అవుతుంది. ‘శకలం’ (ముక్క) ‘సకలం’ (సమస్తం) అవుతుంది. ‘శంకరుడు’కాస్తా ‘సంకరుడు’ అయిపోతాడు. తేడా తెలుస్తోంది కదా! వ్యాకరణం తెలియక ఎంతో సదుద్దేశంతో ‘‘సుపుత్రాప్రాప్తిరస్తు’’ అని దీవిస్తూ ఉంటారు. అంటే సుపుత్ర అప్రాప్తి అవుతుంది. ‘‘సుపుత్ర ప్రాప్తిరస్తు’’ అనాలి. అందరికీ వాక్సిద్ది లేకపోవటం అదృష్టం.జాగ్రత్తగా ఉచ్ఛరించిన మాటలకి సరైన కంఠస్వరం తోడు ఉంటే వినాలని అనిపిస్తుంది. చెవితో వింటే కదా! ఆచరించాలని అనిపించేది. ఎన్నో సందర్భాలలో ఆర్థికంగా గాని, శారీరికంగా గాని సహాయం చేయలేక పోయినా మాటసహాయం చేసి సమస్యలని పరిష్కరించటం చూస్తాం. ఇంత శక్తిమంతమైన ఆయుధాన్ని సద్వినియోగం చేసుకుని ఎవరికి వారు ఉద్ధరించ బడుతూ పదిమందికి సహాయం చేయవచ్చు. శక్తిమంతమైన మాటని చక్కగా ఉపయోగించుకోటానికి కొన్ని లక్షణాలని పెంపొందించుకోవాలి. అవి – సత్యం, హితం, మితం, ప్రియం, స్మితం, మధురం, ప్రథమం. ఏ ఒక్క లక్షణం ఉన్నా గొప్పే. అన్నీ ఉండటం సామాన్య మానవుల విషయంలో చాలా కష్టం. హితమైనది ప్రియంగా ఉండదు. సత్యం మధురంగా ఉండక పోవచ్చు. నిజం నిష్ఠురంగా ఉంటుంది కదా! ‘‘సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్, న బ్రూయాత్ సత్య మప్రియం, ప్రియం చ నానృతంబ్రూయాత్, ఏష ధర్మ స్సనాతనః’’. ఈ ఆరు లక్షణాలతో ఎవరిని నొప్పించకుండా మాట్లాడాలి అంటే సహజ స్వభావానికి మెఱుగు పెట్టే శిక్షణ అవసరం. – డా.ఎన్.అనంతలక్ష్మి -
‘బట్’ అనే మాట ఉంది చూశారూ.. బహు కంత్రీది.. కానీ!
మనిషి మనసులోని భావాలను తెలుసుకోవడానికి భాషే మార్గం. ఆ భాషను సక్రమంగా, తెలివిగా ఉపయోగించేవాళ్లు, ఉపయోగించగలిగేవాళ్లు ఉన్నత స్థానాలకు చేరతారు. ఉపయోగించలేని వాళ్లు మామూలు మనుషులుగా మిగిలిపోతారు. భాషలో కొన్ని వేల, లక్షల పదాలుంటాయి. వాటిలో ఒక ప్రమాదకరమైన పదం ‘కానీ’. అదేంటీ... ‘కానీ’ అనే పదం ఎలా ప్రమాదకరం? అనే డౌట్ మీకు రావచ్చు. ' ఇంట్రస్టింగ్ కథనం మీకోసం.... ‘‘కానీ’’ ఒక కంత్రీ పదం.../ మీరు తెలివైనవారు, కానీ... ♦ మీ డ్రెస్ బాగుంది, కానీ (but)... ♦ మీరు బాగా పాడుతున్నారు, కానీ (but)... ♦ మీ హెయిర్ స్టైల్ బాగుంది, కానీ (but)... ♦ ఒక ఫ్రెండ్ గా మీరంటే చాలా ఇష్టం... కానీ (but)... ♦ మీ సెన్స్ ఆఫ్ హ్యూమరంటే ఇష్టం.. కానీ (but)... ♦ చంపడం, చంపించడం తప్పే... కానీ (but)... ఇలా ఎవరైనా మీతో మాట్లాడినప్పుడు మీరెలా ఫీలవుతారు? ఆ సమయంలో మీ మనసులో ఏమనిపిస్తుంది? ఈ విషయంపై మీరెప్పుడూ పెద్దగా ఆలోచించి ఉండరు. కానీ ఆ ‘కానీ’ అనే ఒక్క పదం ఆ వ్యక్తి ఇంటెన్షన్ ను పట్టిస్తుంది. అతను లేదా ఆమె నిజంగా ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పకనే చెప్పేస్తుంది. ‘కానీ’ ఒక లాండ్ మైన్... ‘కానీ’' అనే పదం ఒక లాంగ్వేజ్ ల్యాండ్ మైన్ లాంటిది. ఎందుకంటే... ఈ పదం దానికి ముందు ఉన్న వాక్యాన్ని తిరస్కరిస్తుంది. ఆ వాక్యంలో అతి ముఖ్యమైన విషయం ఆ తర్వాత వస్తుందనీ, దాన్ని అంగీకరించాలనీ చెప్తుంది. ఉదాహరణకు... ‘‘మీ డ్రెస్ బాగుంది, కానీ రెడ్ అయితే ఇంకా బాగుండేది..’’ అని ఎవరైనా చెప్పారంటే, మీ మనసు డ్రెస్ బాగుందనే విషయాన్ని తిరస్కరిస్తుంది, రెడ్ అయితే బాగుంటుందనే విషయాన్నే అంగీకరిస్తుంది. అంటే... మీ డ్రెస్ బాగుంది అని చెప్పడం అబద్ధమన్నమాట. ఆ మాట చెప్పలేక, బాగుందని చెప్పి, 'కానీ' అని సన్నాయి నొక్కులు నొక్కుతారన్నమాట. అలా తమకు కావాల్సిన, తమకు నచ్చిన అభిప్రాయాన్ని మీ మనసుపై రుద్దుతారన్నమాట. మీరు, మీ మనసు ఆ మోసాన్ని గ్రహించలేరు. అలా 'కానీ' అనే ఈ చిన్న పదం దుర్వినియోగమవుతుంది. ఎవరెలా వాడతారంటే... అనుభవజ్ఞులైన కార్పొరేట్ మేనేజర్లు గొప్ప కాంప్లిమెంట్ ఇచ్చినప్పటికీ, ఆపై 'కానీ' జోడించడం ద్వారా ప్రభావాన్ని దెబ్బతీస్తారు. ♦ మొత్తం మీద మీ పనితీరు బాగుంది, కానీ మీరు టైం పాటించాలి. ♦ మీరు ఆ ప్రాజెక్ట్ బాగా హేండిల్ చేశారు, కానీ కొంచెం స్పీడ్ పెంచాలి. కపుల్స్ తమ జీవిత భాగస్వాములను ఎంతగా ప్రేమిస్తున్నారో చెప్పి, ఆపై 'కానీ' అనడంతో మొత్తం నాశనం చేస్తారు. ♦ ఇలా నీతో ఉండటం చాలా బాగుంది, కానీ నువ్వు శుభ్రంగా కనిపించాలి. ♦ నువ్వన్నా, నీ మాటలన్నా నాకు చాలా ఇష్టం, కానీ చాలా ఎక్కువ మాట్లాడతావు. తల్లిదండ్రులు వారి 'BUTs' ను నిర్లక్ష్యంగా ఉపయోగించడం వల్ల పిల్లల్లో ప్రతికూల స్పందనల్ని ప్రేరేపిస్తారు. ♦ నీ చేతిరాత బాగుంది, కానీ ఇంకా మార్కులు రావాలి. ♦ నీ స్పెల్లింగ్ బాగుంది, కానీ చేతిరాత బాగోలేదు. ఇలా వారు మెచ్చుకుంటున్నా, ‘కానీ’ మొత్తం అర్థాన్ని మార్చేస్తుంది. మీ మనసు ఆ 'కానీ..' ముందు ఉన్న ప్రశంసను తిరస్కరించి, దాని తర్వాత ఉన్న నెగెటివ్ నే స్వీకరిస్తుంది. 'అయితే' అనే పదం కూడా దాదాపు ఇలాంటి ప్రతికూల ప్రభావాన్నే చూపిస్తుంది. మరేం చెయ్యాలి? 'కానీ'ని 'అలాగే' అనే పదంతో భర్తీ చేయండి! ఇలా ఒక వారం రోజులు మీరు ప్రయత్నిస్తే... 'కానీ' బారినుంచి తప్పించుకోవచ్చు. ♦ ‘‘ఉద్యోగంలో మీ పనితీరు చాలా బాగుంది, కానీ మీరు టీమ్ తో కలిసిపోవాలని కోరుకుంటున్నాను...’’ అనే వాక్యానికి బదులుగా ‘‘ఉద్యోగంలో మీ పనితీరు చాలా బాగుంది, అలాగే మీరు టీమ్ తో కలిసిపోవాలని ఉండాలని కోరుకుంటున్నాను’’ అని చెప్పండి. ♦ ‘‘మీరు చెప్పే చాలా విషయాలతో అంగీకరిస్తున్నాను, కానీ ఈ ప్రత్యేకమైన విషయాన్ని పరిశీలించమని కోరుతున్నా’’ అని చెప్పడానికి బదులుగా ‘‘మీరు చెప్పే చాలా విషయాలతో అంగీకరిస్తున్నాను, అలాగే ఈ ప్రత్యేకమైన విషయాన్ని పరిశీలించమని కోరుతున్నా’’ అని చెప్పండి. అయితే ఈ 'అలాగే' వాడకంతో కూడా జాగ్రత్తగా ఉండండి. మీరు దీన్ని ఎక్కువగా నొక్కిచెప్పినా, దానిని ఉపయోగించటానికి ముందు, తరువాత పాజ్ చేసినా, ఇది 'కానీ'లాంటి దుష్ప్రభావాన్నే చూపిస్తుంది. ‘కానీ’ ఉపయోగించాల్సిన పద్ధతి వాస్తవానికి, 'కానీ' అనే పదం ఎదుటి వ్యక్తి ఆలోచనను ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకుంటే దాన్ని ఉపయోగించడంలో తప్పేమీ లేదు. అందువల్ల నెగెటివ్ విషయం స్థానంలో పాజిటివ్ ప్రత్యామ్నాయాన్ని నొక్కి చెప్పేటప్పుడు ఉపయోగించండి. ఉదాహరణకు... ♦ ‘‘మనం ఈ ప్రాజెక్టులో కొన్ని అడ్డంకులను ఎదుర్కొంటున్నాము, కానీ మనం విజయం సాధించగలమని నాకు తెలుసు.’’ ♦ ‘‘మనం పూర్తిగా ఫెయిలయ్యాం, కానీ మన తప్పుల నుండి నేర్చుకొని ముందుకు సాగాలి.’’ ఇలా చెప్పినప్పుడు మనసు ఆ వాక్యాల్లోని మొదటి భాగాన్నిన తిరస్కరించి, ‘కానీ’ తర్వాతి భాగాన్ని స్వీకరిస్తుంది. మీరు చెప్పాలనుకున్నది నేరుగా వారి మనసును చేరుతుంది. కాబట్టి మీ 'కానీ' ఎక్కడుందో, ఎలా ఉపయోగిస్తున్నారో గమనించుకోండి. 'కానీ' ఉపయోగం గురించి బాగా తెలుసుకోవడం ద్వారా, దాన్ని జాగ్రత్తగా ఉపయోగించడం ద్వారా, 'అలాగే' తో భర్తీ చేయడం ద్వారా మీరు కోరుకున్న ఫలితాలు సాధించండి. విష్ యూ ఆల్ ద బెస్ట్. -సైకాలజిస్ట్ విశేష్ 8019 000066 -
ఈ ఏడాది పదంగా గ్లోబిన్ మోడ్.. అర్థం తెలుసా?
లండన్: అత్యంత సోమరిగా ఉంటూ స్వార్థ చింతనతో జీవించే వ్యక్తులను ఉద్దేశిస్తూ వాడే ‘గోబ్లిన్ మోడ్’ పదాన్ని 2022 ఏడాదికి వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా ఆక్స్ఫర్డ్ ప్రకటించింది. ఇంట్లో వస్తువులు చిందర వందరగా పడేస్తూ, సామాజిక నియమాలను పాటించని స్వార్థపూరిత అపరిశుభ్ర వ్యక్తుల మానసిక వైఖరిని ‘గోబ్లిన్ మోడ్’ అని పిలుస్తుంటారు. ఒక సంవత్సరకాలంలో సమాజంలో అత్యంత సాధారణంగా వినిపించే, ప్రస్తావించే, చర్చించబడే పదాన్ని ‘ఆ ఏడాది పదం’గా ఆక్స్ఫర్డ్ ఇంగ్లిష్ డిక్షనరీ ప్రకటిస్తోంది. సాధారణంగా ఆక్స్ఫర్డ్ ప్యానెల్ నిపుణులే ప్రతి ఏటా పదాన్ని నిర్ణయిస్తారు. కానీ, తొలిసారిగా ఈఏడాది ప్రజాభిప్రాయాన్ని ఓటింగ్ ద్వారా తీసుకుని విజేత పదాన్ని ప్రకటించారు. ఓటింగ్‌లో దాదాపు 93 శాతం ఓట్లు ఒక్క గోబ్లిన్ పదానికి పట్టం కడుతూ పోలవడం విశేషం. రెండు వారాలపాటు సాగిన ఓటింగ్‌లో మూడు లక్షల మందికిపైగా ఓటేశారు. దాదాపు 13 ఏళ్ల క్రితం నుంచీ గోబ్లిన్ పదం అప్పుడప్పుడూ వార్తల్లో నిలుస్తోంది. కానీ, కోవిడ్ సంక్షోభం నేపథ్యంలో నెలల తరబడి కేవలం ఇంటికి, గదికే పరిమితమైన వారు మానసికంగా ‘గోబ్లిన్ మోడ్’లోకి వెళ్లిపోయారని అంతర్జాతీయంగా చర్చ కొనసాగిన విషయం విదితమే. ఈ పోటీలో మెటావర్స్(ఊహా ప్రపంచం) పదం రెండో స్థానంలో ఐ స్టాండ్ విత్ అనే పదం మూడో స్థానంలో నిలిచాయి. -
మంచి మాట: మాటల పాఠాలు
ఉన్నాయి కదా అని మనం మాటల్ని వాడేస్తూండకూడదు. వినిపించాయి కదా అని మనం మాటల్ని మాత్రమే పట్టించుకుని బతుకును పాడు చేసుకోకూడదు. మాటలతో, మాటలలో మనల్ని మనం వృథా చేసుకోకూడదు. మాటలకు పరిమితులు ఉంటాయి, ఉన్నాయి. అనేటప్పుడూ, వినేటప్పుడూ మాటల్ని ఒకస్థాయి వరకే పరిగణించాలి. మాటలు అని దెబ్బతిన్న సందర్భాలూ, మాటలు విని దెబ్బతిన్న సందర్భాలూ అందరికీ ఉంటాయి. వాటిని పాఠాలుగా తీసుకోవాలి. అవసరం అయినంత వరకే మాటల్ని అనాలి, వినాలి. మాటలు ఎక్కడ అనవసరమో తెలుసుకోవాలి. మాటలు ఎక్కడ అనర్థమో గ్రహించగలగాలి. మాటను కంచె అని అన్నారు చైనా తాత్త్వికులు, కవి లావొచు (లావోట్జ్). లావొచు అంటే ‘సిద్ధ గురువు’ అని అర్థం. వీరి రచనలు తావొ – త – చింగ్ అధారంగా తావొ మతం రూపొందింది. కవిత్వం నుంచి మతం పుట్టిన సందర్భం ప్రపంచంలో ఇదొక్కటే. లావొచు రోజూ ఉదయం పూట ఒక స్నేహితుడితో కలిసి నడకకు వెళ్లే వారు. ఆ సమయంలో వారు ఏ మాటా మాట్లాడేవారు కాదు, తపస్సు చేస్తున్నట్టుగా మౌనంగా ఉండేవారు. ఒకరోజు ఉదయం నడుస్తూండగా లావొచు స్నేహితుడి స్నేహితుడు దారిలో ఎదురుపడి వాళ్లతో కలిసి నడవసాగాడు. వాళ్ల నడక కొనసాగుతున్నప్పుడు ఉదయాన్ని చూస్తూ ‘ఈ ఉదయం ఎంతో అందంగా ఉంది’ అని అన్నాడు లావొచు స్నేహితుడి స్నేహితుడు. ఆ మాట వినగానే లావొచు ఉన్నపళాన నడక మానేసి ఇంటికి తిరిగి వచ్చేశారు. అది జరిగాక లావొచు స్నేహితుడు లావొచును ‘ఏమైంది, చిన్నమాటే కదా అతడన్నది ఆ మాత్రం దానికి మీరు నడక మానేసి తిరిగి వచ్చేయాలా?’ అని అడిగాడు. బదులుగా లావొచు ఇలా అన్నారు: ‘ఉదయ సౌందర్యమంతా ఆ మాటతో చెదిరిపోయింది. అది శబ్దం లేని సౌందర్యం. దాన్ని మౌనంగా అనుభవించాలి. మాట పుట్టి ఆ సౌందర్యాన్ని వేరు చేసింది. మాట పుట్టడానికి ముందున్న సౌందర్యానుభవం బృహదాత్మకం. – రోచిష్మాన్ మాట పుట్టగానే ఆ బృహత్తుకు కంచె వేసినట్టు అవుతుంది.‘ఒకరోజు లావొచు అనుయాయులు ‘తెలుసుకున్నవాళ్లు మాట్లాడరు, మాట్లాడుతున్న వాళ్లు తెలుసుకున్నవాళ్లు కారు’ అని లావొచు చెప్పిన మాటల గురించి చర్చ చేస్తూ వాళ్ల గురువును ఆ మాటలకు అర్థవివరణను ఇమ్మని అడిగారు. గురువు ‘మీలో ఎవరికి గులాబీ పువ్వు పరిమళం తెలుసు?’ అని వాళ్లను ప్రశ్నించారు. అందరూ తమకు తెలుసని చెప్పారు. ‘మీకు తెలిసిన ఆ విషయాన్ని మాటల్లోకి తీసుకురండి’ అని అన్నాడు గురువు. ఆ పని చెయ్యడం చాతకాక శిష్యులు మౌనంగా ఉండిపోయారు. మాట సత్యానుభవాన్ని సరిగ్గా సమర్పించలేదు. అనుభవానికి పరిధులు ఉండవు. అది ఆకాశంలా అనంతం. మాట సంకుచితమైంది. మాటలలో కూరుకుపోతూంటే మనం అనుభవాన్ని ఆస్వాదించలేం. మనం మాటల్ని పట్టుకుని కూర్చోకూడదు. ఒకదశ తరువాత మనం మాటల్ని దాటుకుని ముందుకు సాగాలి. ఎందుకంటే మౌనంలోనే సౌందర్యం అనుభవంలోకి వస్తుంది. సౌందర్యానుభవం మాటల్లో చెదిరిపోతుంది. అనుభవాన్ని మాటలు అనువదించలేవు. మాటలతో సౌందర్యానుభవాన్ని పోగొట్టుకోకూడదు. మాటను కంచె అని లావొచు అనడాన్ని సరిగ్గానూ, సమగ్రంగానూ అవగతం చేసుకోవాలి. మాట కంచె అయి మన చుట్టూ ఉండకూడదు. మాట మనల్ని కట్టిపడెయ్యకూడదు. మాటకు అందని స్థితిలో ఉండే రుచిని ఆస్వాదించ గలగాలి. మాటకు అతీతంగా ఉండే అత్యుదాత్తతను మనం అనుభవంలోకి తెచ్చుకోవాలి. -
ఆ కారు రిజిస్ట్రేషన్ నెంబర్ చూసి షాక్ అయిన పోలీసులు: ఫోటోలు వైరల్
ఇటీవల జరుగుతున్న రోడ్డు ప్రమాదాల రీత్యా వాహానాల రిజిస్ట్రేషన్ నిబంధనలు నుంచి ట్రాఫిక్ రూల్స్ వరకు అన్ని కఠినతరం చేశారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు పలు వాహనదారులు చేస్తున్న తప్పిదాలు, రిజిస్ట్రేషన్ నంబర్ విషయాల్లో పాటించాల్సిన జాగ్రత్తలు వంటి విషయాల్లో సోషల్ మీడియా వేదికగా అవగాహన కల్పిస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగా ఒక వ్యక్తి కారుకి ఉండే నెంబర్ ప్లేట్ మీద నెంబర్ బదులు ఏం రాయించుకున్నాడో ఫోటోలు ట్వీట్ చేశారు సదరు కారు యజమాని నెంబర్ ప్లేట్ మీద రిజస్టేషన్ నెంబర్ని విచిత్రంగా హిందీలో తండ్రిని పిలిచే విధంగా 'పాపా' అనే అర్థం వచ్చేలా పెట్టుకున్నాడు. ఈ నెంబర్ ప్లేట్‌తోనే కారులో దర్జాగా తిరిగేస్తున్నాడు సదరు వ్యక్తి. దీంతో ఉత్తరాఖండ్ పోలీసులు సదరు కారు యజమానిని అదుపులోకి తీసుకోవడమే కాకుండా రిజిస్ట్రేషన్ నెంబర్ స్థానంలో ఇలా పేర్లు ఉండకూడదంటూ సదరు యజమానికి జరిమాన విధించారు. ఈ మేరకు పోలీసులు ట్విట్టర్లో ...1987 చిత్రం "ఖయామత్ సే ఖయామత్ తక్"లోని నాన్న మీద ప్రేమతో కూడిన ప్రసిద్ధ పాట "పాపా కెహతే హై"ఉంటుందని చెప్పారు. అందులో మాదరి మా నాన్న పేరు కారు మీద రాస్తాను అంటే కుదరదన్నారు. అలాంటి రిజిస్ట్రేషన్ ప్లేట్లకు జరిమాన విధించబడుతుందని కూడా ఎవరికీ తెలియదని చెప్పారు. సదరు వాహన యజమానికి జరిమాన విధించడంతో రిజస్ట్రేషన్ నెంబర్ సరిచేసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు పోలీసులు రిజిస్ట్రేషన్ నెంబర్ సరిచేయక ముందు, సరిచేసుకున్నాక కారు నెంబర్ ప్లేట్‌కి సంబంధించిన ఫోటోలను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ విషయం ఆన్లైన్లో వైరల్ అవుతోంది. पापा कहते हैं बड़ा नाम करेगा, गाड़ी के प्लेट पर पापा लिखेगा, मगर ये तो कोई न जाने, कि ऐसी प्लेट पर होता है चालान.. ट्वीट पर शिकायत प्राप्त करने के बाद #UttarakhandPolice ने गाड़ी मालिक को यातायात ऑफिस बुलाकर नम्बर प्लेट बदलवाई और चालान किया। pic.twitter.com/oL4E3jJFAV — Uttarakhand Police (@uttarakhandcops) July 12, 2022 (చదవండి: జస్ట్ మిస్.. చిన్నారికి తప్పిన ఘోర ప్రమాదం.. ‘స్టుపిడ్ ఫెల్ అంటూ’.. ) -
ఆ విషయంపై 'సారీ' చెప్పిన విశ్వక్ సేన్
Vishwak Sen Says Apology On Objectionable Word: హీరో విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’. విద్యాసాగర్ చింత దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే6న విడుదల కానుంది. దీంతో ప్రమోషన్స్ స్పీడు పెంచిన చిత్ర బృందం ఓ ప్రాంక్ వీడియో చేసి విమర్శల పాలైన విషయం తెలిసిందే. ఈ కాంట్రవర్సీపై ప్రముఖ టీవీ ఛానెల్ డిబెట్లో యాంకర్‌కు విశ్వక్ సేన్ మధ్య మాటల యుద్ధం కూడా జరిగింది. ఈ క్రమంలో విశ్వక్ సేన్ అభ్యంతరకర (ఎఫ్.. అనే పదం) పదాన్ని వాడాడు. ప్రస్తుతం ఈ పదాన్ని వాడటంపై కూడా పలు విమర్శలు వస్తున్నాయి. మే 2న నిర్వహించిన మూవీ ప్రమోషన్లో ఓ విలేఖరి విశ్వక్ సేన్‌ను ఈ పదం వాడటంపై ప్రశ్నించారు. దీనికి విశ్వక్ స్పందిస్తూ 'దెబ్బ తగిలినప్పుడు అమ్మా అన్నట్టే.. ఆ పదం అలా వచ్చింది. నిజంగానే అలాగే వచ్చింది. ఇప్పట్లో చిన్న పిల్లలకు, 16 ఏళ్ల వయసున్న యూత్‌కు వద్దన్నా ఆ పదం వచ్చేస్తోంది. కానీ మీడియాలో ఆ పదం వాడినందుకు సారీ. దీనిపై రేపు (మే 3) క్లారిటీగా నోట్ రిలీజ్ చేస్తాను' అని తెలిపాడు. చదవండి: ‘గెట్ అవుట్’ అంటూ విశ్వక్ సేన్‌పై టీవీ యాంకర్ ఫైర్ విశ్వక్ సేన్-టీవీ యాంకర్ వీడియోపై ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్.. -
ఈ పదాన్ని 645 విధాలుగా ఉపయోగిస్తారు!
Run అనే ఆంగ్లపదంలో ఉన్నవి మూడు అక్షరాలే. కాని ఇది మోస్ట్ కాంప్లికేటెడ్, మల్టీ ఫేస్డ్ వర్డ్‌గా పేరు మోసింది. ఆక్స్ఫర్డ్ ఇంగ్లిష్ డిక్షనరీ ఎడిటర్స్ చెబుతున్నదాని ప్రకారం ‘రన్’ను రకరకాల సందర్భాలను బట్టి 645 విధాలుగా ఉపయోగిస్తున్నారు. ‘కాంటెక్ట్స్ ఈజ్ ఎవ్రీ థింగ్’ కదా మరి! 'రన్' అనే పదానికి తెలుగులో పరుగు అనే అర్థం ఉంది. ‘రన్’కు క్రియాపదం అయిన ‘రన్నింగ్’కు మాత్రం సందర్భానుసారం అనేక అర్థాలు ఉన్నాయి. కాబట్టి ‘రన్’ ఇంగ్లీషు భాషను నడిపిస్తుందంటే అతిశయోక్తి కాదని భాషా నిపుణులు అంటున్నారు. (Fenty's Fortune: మీకేమైనా తెలుసా... వాట్స్ మై నేమ్?) -
Karimnagar: కీచకుడిగా మారిన ప్రభుత్వాసుపత్రి కాంట్రాక్టు ఉద్యోగి
సాక్షి, కరీంనగర్: జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళా ఉద్యోగులకు రక్షణ లేకుండా పోతోంది. కీచకుడిగా మారిన ఓ కాంట్రాక్టు ఉద్యోగి వారితో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. గత ఏప్రిల్‌లో ఓ వార్డు బాయ్ నర్సుపై అత్యాచారయత్నం ఘటన మరువకముందే మరో కామాంధుడి లీలలు వెలుగు చూశాయి. ఆసుపత్రిలోని మొదటి ఫ్లోర్లో గల ఆసుపత్రి అనుబంధ విభాగంలో పనిచేసే ఓ కాంట్రాక్ట్ ఉద్యోగి గత కొద్ది నెలలుగా మహిళా ఉద్యోగులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. వారిని లోబర్చుకునేందుకు వెకిలి చేష్టలతో వేధిస్తున్నట్లు తెలిసింది. ఇటీవల హద్దులు దాటి లైంగిక వేధింపులకు గురిచేయడంతో సహనం కోల్పోయిన బాధితులు దీటుగానే ఎదిరించినట్లు సమాచారం. అయినప్పటికీ అతని ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో ఆసుపత్రి ఉన్నతాధికారికి ఫిర్యాదు చేయగా తూతూమంత్రంగా చర్యలు చేపట్టినట్లు తెలిసింది. ప్రధాన ఆసుపత్రి నుంచి ఎంసీహెచ్‌కు స్థాన చలనం కల్పించగా అక్కడా విధులు నిర్వహించకుండా తనకు కోవిడ్ పాజిటివ్ అని చెప్పి, విధులకు ఎగనామం పెట్టినట్లు విశ్వసనీయ సమాచారం. కీచకుడిగా మారిన సదరు ఉద్యోగిపై కఠిన చర్యలు తీసుకోకుండా స్థానచలనం కల్పించి, చేతులు దులుపుకోవడం పట్ల బాధితులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆ కీచకుడిని విధుల నుంచి తొలగించాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. ఈ విషయమై బాధితులు హెచ్ఆర్సీని కూడా ఆశ్రయించినట్లు, హెచ్ఆర్సీ బాధ్యులు నాలుగు రో జుల క్రితం ఆసుపత్రికి వచ్చినట్లు తెలిసింది. చదవండి: దొంగతనం ఆరోపణతో ఆదివాసి హత్య -
వార్డు మెంబర్ బాగోతం.. 72 గుంటల స్థలాన్ని ఆన్లైన్ చేయిస్తానని..
సాక్షి, కోరుట్ల(ఆదిలాబాద్): నమ్మితే.. వృద్ధుడిని మోసగించిన ఓ వార్డు మెంబర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. కోరుట్ల సీఐ రాజశేఖర్‌రాజు కథనం ప్రకారం.. కోరుట్ల మండలం అయిలాపూర్‌కు చెందిన అగ్గ ఆశన్న(60)కు 3.24 ఎకరాల భూమి ఉంది. ఇందులో కేవలం 72 గుంటలకు మాత్రమే అతని పేరిట ధరణిలో ఆన్లైన్ అయ్యింది. దీంతో మిగతా భూమిని ఆన్లైన్ చేసేందుకు అదే గ్రామానికి చెందిన వార్డు మెంబర్ పాశం విజయ్‌కుమార్‌ను కలిశాడు. ధరణిపై ఆశన్నకు అవగాహన లేని విషయాన్ని గ్రహించిన అతను తాను సాదాబైనామా కింద 72 గుంటల స్థలాన్ని ఆన్లైన్ చేయిస్తానని నమ్మించాడు. ఆ తర్వాత రెవెన్యూ సిబ్బందికి, తహసీల్దార్‌కు లంచాలు ఇవ్వాలని పలు దఫాలుగా రూ.4.30 లక్షలు వసూలు చేశాడు. గత ఫిబ్రవరి 18న సాదాబైనామాతో 72 గుంటల భూమిని ఆన్లైన్ చేస్తారని తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి సంతకాలు పెట్టాలని ఆశన్నకు చెప్పాడు. విజయ్‌కుమార్ మాటలు నమ్మిన ఆయన అడిగిన చోట సంతకాలు పెట్టి, అప్పటినుంచి తన భూమి ఆన్లైన్లో వస్తుందని ఎదురుచూశాడు. కానీ ఆన్లైన్లో భూమి వివరాలు రాకపోగా ఇదివరకే పట్టా ఉండి, ఆన్లైన్లో ఉన్న 72 గుంటల భూమిని ఆశన్న నుంచి పాశం విజయ్‌కుమార్ కొనుగోలు చేసినట్లుగా నమోదవడంతో ఆందోళనకు గురయ్యాడు. తనకు జరిగిన మోసాన్ని గుర్తించి, వెంటనే తహసీల్దార్ సత్యనారాయణకు, కోరుట్ల రాజశేఖర్‌రాజుకు ఫిర్యాదు చేశాడు. దీంతో సీఐ దర్యాప్తు చేయాలని ఎస్సై రాజప్రమీలకు ఆదేశించారు. పోలీసుల విచారణలో విజయ్‌కుమార్ రెవెన్యూ అధికారుల పేరిట డబ్బులు దండుకోవడమే కాకుండా ఆశన్న భూమిని తన పేరిట మార్చుకున్నట్లు తేలింది. విజయ్‌కుమార్ గతంలో పైడిమడుగులో జరిగిన ఓ హత్య కేసులో నిందితుడని సీఐ తెలిపారు. ఆశన్న ఫిర్యాదు మేరకు అతనిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కొంతమంది దళారులు భూములను ఆన్లైన్ చేయిస్తామని డబ్బులు దండుకుంటూ మోసాలకు పాల్పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. నిజమని తేలితే నిందితులపై పీడీ యాక్టు నమోదు చేస్తామని హెచ్చరించారు. అయితే కలెక్టర్ స్పందించి, భూమిని మళ్లీ తన పేరిట మార్పించి, ఆదుకోవాలని బాధితుడు ఆశన్న వేడుకుంటున్నాడు. -
‘పేద్ద’ పదం.. జుట్టు పీక్కున్న నెటిజన్లు
తిరువనంతపురం: కాంగ్రెస్ ఎంపీ, రచయిత శశిథరూర్ నెటిజన్లకు మరో సవాలు విసిరారు. కొత్త పదాలతో ఎప్పుడూ విన్యాసం చేసే ఆయన ఈ సారి పలకడానికి కూడా కష్టంగా ఉన్న పదాన్ని ప్రయోగించారు. అదే.. హిప్పొపొటోమన్ స్ట్రోసెస్ క్విపెడేలి ఫోబియా. రెండు మూడు సార్లు చదివితే కానీ స్పష్టంగా పలకలేని ఈ పదానికి అర్థం ఏమిటా? అని అందరూ డిక్షనరీలు ముందేస్తున్నారు. వివరాల్లోకి వెళితే కమెడియన్ సలోనీ గౌర్ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసింది. ఇందులో ఆమె శశిథరూర్ గొంతును అనుకరిస్తూ నటి సుస్మితా సేన్ వెబ్ సిరీస్ 'ఆర్య' చిత్రం కోసం మాట్లాడింది. (శశి థరూర్‌పై కోర్టు ఆగ్రహం, జరిమానా) అంతేకాక 'ఆర్య'లోని నటుడు చంద్రచూర్ సింగ్‌కు, శశిథరూర్‌కు మధ్య కొంత పోలిక ఉన్నట్లు తెలిపింది. ఈ వీడియోను దర్శకుడు హన్సల్ మెహతా తిరిగి పోస్ట్ చేస్తూ "శశిథరూర్ మీరిది చూశారా?" అని ప్రశ్నించారు. దీనికి శశిథరూర్ బదులిస్తూ "ఇమిటేషన్ బాగుంది. అయితే నేను అలాంటి పేద్ద పదాలను ఉపయోగించే మాటకారిని కాదు. కానీ తెరపై కనిపించే నటుడికి మాత్రం కచ్చితంగా హిప్పొపొటోమన్ స్ట్రోసెస్ క్విపెడేలి ఫోబియా ఉండదు" అని సమాధానమిచ్చారు. దీని గురించి తెగ గాలించిన నెటిజన్లు ఎట్టకేలకు దాని అర్థం "పెద్ద పదాలను పలకడానికి భయపడటం" అని కనుగొన్నారు. (ప్యాకేజి: అదే పాత సింహాలు ఇప్పుడు కొత్త పేరుతో) -
డెంగీపై అధికార యంత్రాంగం అప్రమత్తం
పెద్దాపురం : సీజనల్ వ్యా««దlుల నేపథ్యంలో మున్సిపల్ యంత్రాంగం సోమవారం ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్‌ను నిర్వహించింది. పట్టణంలోని వివిధ వార్డుల్లో కాలువల్లో పూడికతీత, చెత్త తొలగింపు వంటి కార్యక్రమాలను చేపట్టింది. పట్టణంలోని ఒకటో వార్డులో డెంగీ లక్షణాలున్న కేసులపై మున్సిపల్, వైద్య శాఖ యంత్రాంగం స్పందించాయి. ఒకటో వార్డు కౌన్సిలర్ అరెళ్లి వెంకటలక్ష్మితో పాటు ఆమె కుమార్తె మేఘమాల, కొల్లి మానస డెంగీ లక్షణాలతో కాకినాడలో ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో ‘సాక్షి’లో వచ్చిన వార్తపై మున్సిపల్ కమిషనర్ అప్పాబత్తుల వెంకట్రావు, వైద్య శాఖ డీఎంఓ పీఎస్ఎస్ ప్రసాద్ పట్టణంలో పర్యటించి, పారిశుద్ధ్య, ప్రజల ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీశారు. పారిశుద్ధ్య పరిస్థితులు మెరుగుపర్చకుంటే చర్యలు తప్పవని కమిషనర్ పారిశుద్ధ్య అధికారులను హెచ్చరించారు. ఒకటో వార్డులో అపరిశుభ్రత వల్లే ప్రజలు రోగాల బారిన పడుతున్నారని కమిషనర్ విలేకరులకు చెప్పారు. కాగా డీఎంఓ పీఎస్ఎస్ ప్రసాద్ స్థానిక పీహెచ్సీ, పాత ఆస్పత్రి వీధుల్లో పర్యటించారు. -
మాట మరియు మరణము
ప్రోజ్ పొయెమ్ అపుడు కదా, చీకటి గుహలో ఒంటిగా ఉన్నపుడు పూలరెక్కలతో ఎగిరివచ్చి మదిలో కొన్ని మిణుగురులను పొదుగుతావు. ఇన్ని యుగాలు ఏమైపోయావ్- బ్రహ్మనడిగి నీ చిరునామా కనుక్కొన్నా తెలుసా అంటో కొన్ని మంత్రపుష్పాలు చల్లి ఎడారిని సరస్సుగా మారుస్తావు. పిల్లలమై పిల్లులమై కిచకిచలాడుకుంటున్నవేళ పొత్తిళ్లలో కొన్ని కలల్ని వదులుతావు. ఎద ఆన్చి అద్వైతం అంటే ఇదే, ఇదొక్కటే, ఇది మాత్రమే నిత్యమూ సత్యమూ శాశ్వతమూ అని కొత్త భాష నేర్పుతావు. అర్ధనారీశ్వరులమై ఏకదేహమున శివసాయుజ్యం పొందెదమని ఆన పెడతావు. చేయి వదిలితివా నా ప్రాణమేనని బేలకళ్లతో కువకువమంటావు. మాటలను వెలిగించి చలి కాచుకుంటూ ఉంటానా, కాగితప్పడవలు చేసి జలపాతాల్లో ఆటలాడుకుంటూ ఉంటానా, గాలిబుడగలు చేసి ఆకాశపు అంచుల్లో విహరిస్తూ ఉంటానా! అపుడు కదా, గాలిదుమారంలాగా వచ్చి పిచ్చీ అవి బుడగలు కావు, కండోమ్స్ అంటావు- కొత్తనైన చూపుతో. - నవదీప్ -
ఆటకంటే మాటకే విలువ ఎక్కువ!
ముంబై: అద్భుతమైన షాట్లు, బౌండరీలతో క్రికెట్ మజాను అందించేది వారు... ఆట విలువ పెరగాలన్నా, అభిమానులకు చేరువై బోర్డుకు అంతులేని ఆదాయం రావాలన్నా అది క్రికెటర్లతోనే. ప్రేక్షకులు క్రికెట్‌ను ఈ స్థాయిలో ఆదరించేది ఆటగాళ్లను చూసే కానీ వ్యాఖ్యాతలు చెప్పే వ్యాఖ్యానాలు విని కాదు! కానీ బీసీసీఐ మాత్రం అలా భావిస్తున్నట్లు లేదు. ప్రతీ ఏటా ఆటగాళ్లతో ఇచ్చే మొత్తంకంటే అధికారిక కామెంటేటర్లు సునీల్ గవాస్కర్, రవిశాస్త్రిలకు బోర్డు చాలా ఎక్కువ చెల్లిస్తోండటం విశేషం. భారత జట్టుకు తిరుగులేని నాయకుడిగా గుర్తింపు ఉన్న ధోని, స్టార్ బ్యాట్స్‌మన్ కోహ్లిలకు ఇచ్చేదానికంటే కూడా ఇది అధికంగా ఉంది. బీసీసీఐ కామెంటేటర్లుగా భారత్ ఆడే ప్రతీ అంతర్జాతీయ మ్యాచ్‌కు వ్యాఖ్యానం అందిస్తున్నందుకు సన్నీ, శాస్త్రిలకు బోర్డు ఏటా రూ. 4 కోట్లు చెల్లిస్తోంది. దీనికి అదనంగా ఈ సీజన్లో ఐపీఎల్ వ్యవహారాలు నిర్వహించినందుకు గవాస్కర్‌కు మరో 2.37 కోట్లు... టీమ్ డెరైక్టర్‌గా రవిశాస్త్రికి కూడా దాదాపు ఇదే మొత్తం ఇస్తున్నట్లు బోర్డు అధికారి ఒకరు చెప్పారు. అంటే వీరిద్దరికి ఏడాదికి చెరో రూ. 6.37 కోట్లు దక్కుతోంది. అదే భారత జట్టు తరఫున గత ఏడాది కాలంలో 35 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన ధోని బీసీసీఐ నుంచి రూ. 2.59 కోట్లు అందుకోగా, 39 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి రూ. 2.75 కోట్లు తీసుకున్నాడు. ఇందులో మ్యాచ్ ఫీజుతో పాటు ‘ఎ’ గ్రేడ్ కాంట్రాక్ట్‌లో కొనసాగిస్తున్నందుకు ఇస్తున్న రూ. కోటి కూడా ఉన్నాయి. క్రికెటర్లు ఎండార్స్మెంట్ల ద్వారా భారీ మొత్తం సంపాదిస్తుండవచ్చు గాక... కానీ తమ ఆటగాళ్లకంటే కామెంటేటర్లకే బోర్డు ఎక్కువ విలువ కట్టడం ఆశ్చర్యం కలిగించే విషయమే. -
విద్వేషంపై కొరడా!
సంపాదకీయం: మాటనేది ఒక వ్యక్తి సంస్కారాన్ని, పరిపక్వతను పట్టి ఇస్తుంది. వ్యక్తులుగా తాత్కాలిక ఆవేశానికో, ఆగ్రహానికో లోనై మాట్లాడే మాటలు అలాంటివారికే అంతిమంగా నష్టం కలిగిస్తాయి. కానీ, బాధ్యతాయుత స్థానాల్లో ఉన్నవారు వివేకం మరిచి విద్వేషం కలిగించే మాటలు మాట్లాడితే అది మొత్తం సమాజాన్నే ఇబ్బందుల్లోకి నెడుతుంది. అమాయకుల ప్రాణాలకు ముప్పుతెస్తుంది. కుల, మత, ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టేలా నాయకులు చేసే ప్రసంగాలవల్ల అల్లర్లు, ఘర్షణలు చోటుచేసుకునే ప్రమాదం ఉంటుంది. ఎన్నికలు వస్తున్నా యంటే అందరూ భయపడేది ఇలాంటి ప్రసంగాల గురించే. సాధారణ పరిస్థితుల్లో సవ్యంగా ఉన్నట్టు కనబడేవారు ఎన్నికల సమయంలో పరిధులు మరచి ప్రవర్తిస్తుంటారు. ఎవరినైనా ఏమైనా అనే హక్కు తమ సొంతమని భావిస్తుంటారు. అందుకు దీటుగా సమాధానమివ్వడం కోసం ప్రత్యర్థులు కూడా తమ నోటికి పనిచెబుతారు. ఈ ధోరణులను అరికట్టడానికి ఏంచేయాలో సూచించమంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం లా కమిషన్‌ను బుధవారం కోరింది. అంతేకాదు... నేతలు విద్వేషపూరిత ప్రసంగాలు చేసినప్పుడు వారి ఆధ్వర్యంలో ఉండే సంస్థల, పార్టీల గుర్తింపును రద్దుచేయాలా అనే అంశాన్ని కూడా పరిశీలించి చెప్పాలని ఆదేశించింది. ఇలాంటి ప్రసంగాలు ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బ తీస్తున్నాయని, రాజ్యాంగ సూత్రాలను ఉల్లంఘించేలా ఉంటున్నాయని ఒక స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యంపై సుప్రీంకోర్టు ఈ సూచన చేసింది. అంతేకాదు... ఆ బాపతు నాయకులపై వెనువెంటనే చట్టప్రకారం చ ర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాజకీయ నాయకులైనా, సంఘాలకు నాయకత్వంవహిస్తున్నవారైనా, మత సంస్థలకు చెందినవారైనా ఈ తరహా ప్రసంగాలు చేసినప్పుడు చర్యకు వెనకాడవద్దని కోరింది. మన రాజ్యాంగం భావప్రకటనా స్వేచ్ఛను ప్రసాదించింది. ఏ పౌరుడైనా తన భావాలను ప్రచారం చేసుకునే హక్కును ఇచ్చింది. అయితే, దీనికి తగిన హద్దులనూ నిర్ణయించింది. ఆ కట్టుదాటినప్పుడు ఏంచేయాలో సీఆర్పీసీలోని వివిధ సెక్షన్లు చెబుతున్నాయి. వివిధ కులాలు, మతాలు, జాతులు, ప్రాంతాలమధ్య చిచ్చుపెట్టేలా ఉండే మాటలు మౌఖికంగా లేదా రాతపూర్వకంగా ఉన్నప్పుడు చర్యలు తీసుకోవచ్చునని అంటున్నాయి. అయితే, ఏది హద్దుమీరిన మాటో, ఎలాంటి రచన విద్వేషపూరితమైనదవుతుందో సీఆర్పీసీ కూడా స్పష్టంగా చెప్పలేదు. ఏదైనా సమస్య ఎదురైనప్పుడు లేదా అలాంటి పరిస్థితులు ఎదురవుతాయని భావించినప్పుడు పోలీసులు రంగప్రవేశం చేసి బాధ్యులుగా భావించినవారిపై కేసులు పెడుతుంటారు. అయితే, నిజంగా ఉద్రేకాలను రెచ్చగొట్టే, విద్వేషాన్ని నూరిపోసే రచనలు, ప్రసంగాలు ఇలాంటి సెక్షన్ల కారణంగా ఆగుతున్నాయా? లేదనే చెప్పాలి. ఆ వంకన భిన్నాభిప్రాయాలనూ, విమర్శలనూ అణచివేసేందుకు పాలకులు ప్రయత్నిస్తున్నారు. ఏది రెచ్చగొట్టే ప్రసంగం... ఏది రెచ్చగొట్టే రచన అనేది న్యాయస్థానాల విచక్షణే నిర్ణయిస్తున్నది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తాజాగా చేసిన సూచనలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. దేశంలో ఎన్నికల వేడి పెరిగాక నాయకుల పరస్పర దూషణల పర్వం పెరిగింది. ఏ ఛానెల్ పెడితే ఎలాంటి మాటలు వినవలసి వస్తుందోనని హడలెత్తిపోయే పరిస్థితులు కూడా నెలకొన్నాయి. బాధ్యతాయుత స్థానాల్లో ఉన్నవారే స్థాయి మరిచి మాట్లాడుతున్నారు. విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ ఈమధ్య బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీని ఉద్దేశించి ‘నపుంసకుడు’ అనే పదాన్ని వినియోగించి అల్లరిపడ్డారు. ఇలాంటి నాయకులపై చర్యలు తీసుకునేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ పదిరోజులక్రితం దాఖలైన పిటిషన్‌పై ఆదేశాలివ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే, ఇప్పుడు లా కమిషన్‌కిచ్చిన ఆదేశాల ఉద్దేశం వేరు. విద్వేషాలను రెచ్చగొట్టే ప్రసంగం లక్షణాన్ని చెప్పి, ఎలాంటి అంశాలు దాని పరిధిలోకి వస్తాయో నిర్ణయించడంవల్ల, దానికి అనుగుణంగా చట్టం రూపొం దించడంవల్ల భవిష్యత్తులో ఆ చట్టాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉండదు. స్వప్రయోజనాలను ఆశించి, రాజకీయ లబ్ధిపొందడానికి చిత్తంవచ్చినట్టు మాట్లాడే... రెచ్చగొట్టే నాయకులను ఇప్పుడున్న సీఆర్పీసీ నిబంధనలు ఏమీ చేయలేకపోతున్నాయి. ప్రజాసమూహాలను మతం పేరుతో, కులంపేరుతో విడగొట్టి, విద్వేషాలను నూరిపోసేవారు సురక్షితంగా,దర్జాగా ఉంటుంటే ఆ మారణహోమాల్లో సామాన్యులే సమిధలవుతున్నారు. పార్టీ కావొచ్చు...మతంపేరిట వెలసిన మరేదైనా సంస్థ కావొచ్చు...బాహాటంగా ప్రజలమధ్య చిచ్చుపెడుతున్నా పోలీసులు నిస్సహాయులుగా మిగులుతున్నారు. అధికారంలో ఉన్నవారు తమ ప్రయోజనాలను ఆశించి ఇలాంటివారిని చూసీచూడనట్టు వదిలేస్తున్నారు. భిన్న జాతులు, మతాలు, ప్రాంతాలు, భాషలు ఉన్న మన దేశంలో ఉద్రేకపూరిత ప్రసంగాలు చేస్తే ఏమవుతుందో దేశ విభజన కాలంనాటినుంచి నిన్నమొన్నటి ముజఫర్‌నగర్ అల్లర్ల వరకూ చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన సూచనల ప్రకారం అలాంటి వ్యక్తులపైనా, నాయకులపైనా చర్యలు తీసుకోవడంతోపాటు పార్టీలనూ, సంస్థలనూ నిషేధించే అవకాశం ఉంటుంది. పైగా విద్వేషపూరిత ప్రసంగంమంటే ఏమిటో చెప్పాలనడంవల్ల చట్టానికి స్పష్టత ఉంటుంది. అది దోషులను నేరుగా తాకుతుంది. అలాంటపుడు చర్యలు తీసుకోవడం, నేరాన్ని నిరూపించడం సులభమవుతుంది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల పర్యవసానంగా నిర్దిష్టమైన, స్పష్టమైన చట్టం రూపొంది... స్వార్ధ రాజకీయనేతలను అదుపు చేయగలిగితే అంతకన్నా కావల్సిందేముంది?