Vishwak Sen Says Apology On Objectionable Word: హీరో విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’. విద్యాసాగర్ చింత దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే6న విడుదల కానుంది. దీంతో ప్రమోషన్స్ స్పీడు పెంచిన చిత్ర బృందం ఓ ప్రాంక్ వీడియో చేసి విమర్శల పాలైన విషయం తెలిసిందే. ఈ కాంట్రవర్సీపై ప్రముఖ టీవీ ఛానెల్ డిబెట్లో యాంకర్‌కు విశ్వక్ సేన్ మధ్య మాటల యుద్ధం కూడా జరిగింది. ఈ క్రమంలో విశ్వక్ సేన్ అభ్యంతరకర (ఎఫ్.. అనే పదం) పదాన్ని వాడాడు.
ప్రస్తుతం ఈ పదాన్ని వాడటంపై కూడా పలు విమర్శలు వస్తున్నాయి. మే 2న నిర్వహించిన మూవీ ప్రమోషన్లో ఓ విలేఖరి విశ్వక్ సేన్‌ను ఈ పదం వాడటంపై ప్రశ్నించారు. దీనికి విశ్వక్ స్పందిస్తూ 'దెబ్బ తగిలినప్పుడు అమ్మా అన్నట్టే.. ఆ పదం అలా వచ్చింది. నిజంగానే అలాగే వచ్చింది. ఇప్పట్లో చిన్న పిల్లలకు, 16 ఏళ్ల వయసున్న యూత్‌కు వద్దన్నా ఆ పదం వచ్చేస్తోంది. కానీ మీడియాలో ఆ పదం వాడినందుకు సారీ. దీనిపై రేపు (మే 3) క్లారిటీగా నోట్ రిలీజ్ చేస్తాను' అని తెలిపాడు.
చదవండి: ‘గెట్ అవుట్’ అంటూ విశ్వక్ సేన్‌పై టీవీ యాంకర్ ఫైర్
విశ్వక్ సేన్-టీవీ యాంకర్ వీడియోపై ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్..
Vishwak Sen: దిగొచ్చిన విశ్వక్ సేన్.. ఆ విషయంపై క్షమాపణలు
Published Tue, May 3 2022 8:54 AM | Last Updated on Tue, May 3 2022 12:17 PM
Comments
Please login to add a commentAdd a comment