Ram Gopal Varma Shocking Reaction To Vishwak Sen And News TV Anchor Video - Sakshi
Sakshi News home page

Ram Gopal Varma: విశ్వక్ సేన్-టీవీ యాంకర్​ గొడవ.. రామ్ గోపాల్ వర్మ షాకింగ్​ కామెంట్స్​..

Published Mon, May 2 2022 5:27 PM | Last Updated on Mon, May 2 2022 6:29 PM

Ram Gopal Varma Reacts To Vishwak Sen TV Anchor Video - Sakshi

Ram Gopal Varma Reacts To Vishwak Sen TV Anchor Video: మాస్​ కా దాస్​ విశ్వక్​ సేన్​ హీరోగా రుక్సార్​ దిల్లాన్​ హీరోయిన్​గా నటించిన చిత్రం అశోకవనంలో అర్జున కల్యాణం. విద్యాసాగర్ చింత దర్శకత్వం వహించిన ఈ మూవీ మే 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో సినిమా ప్రమోషన్స్​ స్పీడ్​ చేసిన చిత్ర బృందం ఓ ప్రాంక్ వీడియోతో విమర్శల పాలైంది. ఈ క్రమంలోనే విశ్వక్​ సేన్​, చిత్ర పరిశ్రమకు  చెందిన త్రిపురనేని చిట్టితో డిబెట్ నిర్వహించింది ప్రముఖ టీవీ ఛానెల్. 

అయితే ఈ డిబెట్​లో యాంకర్​కు విశ్వక్​ సేన్​ మధ్య మాటల యుద్ధం జరిగింది. విశ్వక్​ సేన్​ను స్టూడియో నుంచి 'గెట్​ అవుట్'​ అంటూ యాంకర్ గట్టిగా అరిచిన వీడియో ప్రస్తుతం నెట్టింట షేక్ చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా హాట్​ టాపిక్​గా మారింది. ఈ వీడియోపై తాజాగా సంచలన డైరెక్టర్​ రామ్​ గోపాల్​ ట్విటర్ వేదికగా స్పందించారు. 

'ఒక పురుషుడి కన్నా పవర్​ఫుల్​గా ఒక మహిళ కనిపించడం నేను ఇంతవరకు చూల్లేదు. ఆమె సర్కార్​ కన్నా తక్కువేం కాదు​' అంటూ ఆ యాంకర్​ను ట్యాగ్​ చేశాడు ఆర్జీవీ. కాగా ప్రాంక్ వీడియో కారణంగా ఇప్పటికే హీరో విశ్వక్​ సేన్​పై అరుణ్ కుమార్ అనే లాయర్ హ్యుమన్​ రైట్స్​ కౌన్సిల్​లో (హెచ్​ఆర్సీ) ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. 

చదవండి: ‘గెట్‌ అవుట్‌’ అంటూ విశ్వక్‌ సేన్‌పై టీవీ యాంకర్‌ ఫైర్‌
హీరో విశ్వక్‌ సేన్‌పై హెచ్‌ఆర్‌సీలో ఫిర్యాదు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement