Anchor Devi Nagavalli Files Complaint Against Vishwak Sen To Talasani, Viral - Sakshi
Sakshi News home page

Vishwak Sen: విశ్వక్‌సేన్‌ అభ్యంతకర పదంపై తీవ్ర విమర్శలు

Published Tue, May 3 2022 5:07 PM | Last Updated on Tue, May 3 2022 5:52 PM

Anchor Devi Nagavalli Files Complaint Aganist Vishwan Sen To Talasani - Sakshi

యంగ్‌ హీరో విశ్వక్‌సేన్‌- టీవీ యాంకర్‌కు మధ్య జరిగిన మాటల యుద్దంపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరగుతుంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా విశ్వక్‌ సేన్‌, ఆయన టీం చేసిన ప్రాంక్‌ వీడియో విమర్శల పాలైన సంగతి తెలిసిందే. ఇదే అంశంపై ఓ టీవీ ఛానెల్‌లో జరిగిన డిబెట్‌లో విశ్వక్​ సేన్​, సదరు యాంకర్‌కి మధ్య వాడివాడి చర్చ జరిగింది. స్టూడియో నుంచి 'గెట్​ అవుట్'​ అంటూ యాంకర్ గట్టిగా అరవడం, దానికి విశ్వక్‌ సేన్‌ అభ్యంతరకర ఎఫ్‌.. పదాన్ని వాడటం నెట్టింట హాట్‌ టాపిక్‌గా మారింది.

తాజాగా ఇదే అంశంపై మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌కి యాంకర్‌ దేవి నాగవల్లి ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన మంత్రి ప్రభుత్వపరంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'విశ్వక్‌ సేన్‌ ప్రవర్తన బాగాలేదు. కశ్చితంగా చర్యలు ఉంటాయి. రోడ్డుపై న్యూసెన్స్‌ చేస్తా.. ప్రశ్నిస్తే ఇష్టమొచ్చినట్లు మాట్లాడతానంటే ఎవరూ ఊరుకోరు. ఆయన సారీ చెప్పిన పద్దతి కూడా సరిగా లేదు.ఈ విషయాన్ని మా అసోసియేషన్‌ దృష్టికి కూడా తీసుకెళ్తాం' అని పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement