Objectionable
-
ఆప్ మంత్రి డర్టీ పిక్చర్
చంఢీగడ్: పంజాబ్ ఆప్ మంత్రి బాల్కర్ సింగ్‌కు సంబంధించిన ఓ అభ్యంతర వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఆయనపై బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పిస్తానని చెప్పి ఓ మహిళతో మంత్రి బాల్కర్ సింగ్ అసభ్యంగా ప్రవర్తించారని బీజేపీ ఆరోపణలు చేసింది. అయితే దీనిపై మంత్రి స్పందించారు. ఆ వీడియో గురించి తనుకు తెలియదని, అది తనది కాదని స్పష్టం చేశారు. బాల్కర్ పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కేబినెట్లో స్థానిక ప్రభుత్వం, అసెంబ్లీ వ్యవహారాల మంత్రిగా పనిచేస్తున్నారు.ఉదోగ్యం కోసం తన వద్దకు వచ్చిన ఓ మహిళ పట్ల మంత్రి అసభ్యంగా ప్రవర్తించిన వీడియోను సోమవారం బీజేపీ నేతలు సోషల్‌మీడియాలో షేర్ చేయటంతో వైరల్‌గా మారింది. వీడియో కాల్లో సదరు మహిళను దుస్తులు తొలగించాలని మంత్రి బలవంతం చేశారని బీజేపీ నేతలు ఆరోపించారు.బీజేపీ ఆరోపణల నేపథ్యంలో జాతీయ మహిళా కమిషన్ స్పందించింది. ఈ వ్యవహారంపై పూర్తి దర్యాప్తు చేపట్టి.. మూడు రోజుల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఓ నివేదిక ఇవ్వాలని పంజాబ్ పోలీసులను ఆదేశించింది. ఆరోపణలు నిజమని తేలితే మంత్రిని అరెస్ట్ చేయాలని ఆదేశించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా రాజకీయంగా దుమారం రేపటంతో మంత్రి బాల్కర్ సింగ్ స్పందించారు. ‘‘ఆ వీడియో ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. నాకు ఆ వీడియో గురించి తెలియదు. నేను ఏం వ్యాఖ్యలు చేయలేను’’ అని తెలిపారు.21 ఏళ్ల మహిళకు వీడియో కాల్ చేసి.. అభ్యంరంగా ప్రవర్తించిన మంత్రి బాల్కర్ సింగ్ వెంటనే పదవి నుంచి తొలగించాలని బీజేపీ నేత తాజిందర్ బగ్గా సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను డిమాండ్ చేశారు. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా స్పందిస్తూ.. ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడిని ఉదహరిస్తూ ఆప్ (AAP)అంటే ఒక స్త్రీ ద్వేషి పార్టీ అని మండిపడ్డారు. -
బిల్ గేట్స్ ప్రైవేట్ ఆఫీసులో ఉద్యోగం: ఇంటర్వ్యూలో షాకింగ్ ప్రశ్నల దుమారం
ప్రపంచ కుబేరుల్లో ఒకరు, మైక్రోసాఫ్ట్ సహ-వ్యవస్థాపకుడు బిల్ గేట్స్మరోసారి వార్తల్లో నిలిచారు. బిల్‌గేట్స్ ఆఫీసులో ఉద్యోగం కోసం పిలిచి ఇంటర్వ్యూలో అభ్యంతరకర ప్రశ్నలు అడిగారన్న ఆరోపణలు దుమారం రేపుతున్నాయి. ఈ మేరకు వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం వైరల్‌గా మారింది. (వంటలతో షురూ చేసి రూ. 750 కోట్లకు అధిపతిగా, ఊహించని నెట్‌వర్త్) ఈ నివేదిక ప్రకారం బిల్ గేట్స్ ప్రైవేట్ ఆఫీసు ఇంటర్వ్యూను థర్డ్ పార్టీ కంపెనీ నిర్వహిస్తోంది. ఈ క్రమంలో బిల్ గేట్స్ ప్రైవేట్ కార్యాలయంలో ఉద్యోగాలు కోరుతున్న మహిళలను లైంగికంగా అసభ్యకరమైన ప్రశ్నలు అడిగారు. గేట్స్ వెంచర్స్ కోసం ఇంటర్వ్యూ చేసే ఎక్సటర్న్ సెక్యూరిటీ వారి లైంగిక చరిత్ర, మీకు నచ్చే పోర్న్ చిత్రాలు, చిత్రాలు, వారి ఫోన్లో నగ్న ఫోటోలేమైనా ఉన్నాయా, ఇంతకు ముందు వివాహేతర సంబంధాలున్నాయా అని మహిళల్ని ప్రశ్నించారు. అంతేకాదు డ్రగ్స్ తీసుకుంటారా వంటి ఇతర ప్రశ్నల్ని కేడా అడిగారు. అయితే అదే స్థానాలకు పురుష దరఖాస్తుదారులు అలాంటి వ్యక్తిగత వివరాల గురించి అడగలేదని కూడా నివేదించింది. కొంతమంది మహిళలు తాము ఇంతకుముందు "డాలర్ల కోసం డ్యాన్స్ చేసారా" అని అడిగారని తెలపారని, లైంగికంగా సంక్రమించే వ్యాధికి మీకు సోకిందా అని కూడా ప్రశ్నించారని తెలిపారని వాల్ స్ట్రీట్ పేర్కొంది. అయితే ఈ కథనంపై కాన్సెంట్రిక్ అడ్వైజర్స్ స్పందించింది. కాన్సెంట్రిక్ అడ్వైజర్స్ సీఈవో మైక్ లెఫెవర్ ఈ ఆరోపణలను తిరస్కరించారు. చట్టాలకు లోబడి మాత్రమే ప్రవర్తించామన్నారు. ఇదీ చదవండి: Bhuvan Bam Net Worth 2023: తొలి జీతం 5వేలే.. ఇపుడు రిచెస్ట్ యూట్యూబర్‌గా కోట్లు, ఎలా? మరోవైపు గేట్స్ వెంచర్స్ ప్రతినిధి మాట్లాడుతూ కాన్సెంట్రిక్ అడ్వైజర్స్ లైంగికంగా అసభ్యకరమైన ప్రశ్నలు అడగడం గురించి తమకు తెలియదనీ, అయితే ఇది ఈ విధానం ఆమోదయోగ్యం కాదు, తమ ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని ఆమె పేర్కొన్నారు. కానీ. పదిహేనేళ్ల స్క్రీనింగ్ ప్రక్రియలో ఇలాంటి సమాచారం ఎపుడూ తమకు అందలేదని ఆమె ఒక ప్రకటనలో తెలిపారు. కానీ ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నామన్నది స్పష్టం చేయలేదు. (బిజినెస్ టైకూన్ల తొలి జాబ్ ఏదో తెలుసా? మెగా స్టార్ల సక్సెస్ జర్నీ తెలుసా?) కాగా 27 ఏళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతూ బిల్ గేట్స్ మిలిండా దంపతులు విడాకులు తీసుకోవడం పెద్ద సంచలనం రేపింది. 2021 ఆగస్టులో వీరికి విడాకులు మంజూరయ్యాయి. ఆ తరువాత ప్రియురాలితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడనే వార్తలొచ్చాయి. దీంతోపాటు బిల్ గేట్స్ పలువురు మహిళా ఉద్యోగులతో సంబంధాలున్నాయని ఆరోపణలు కూడా జోరుగానే ఉండటం గమనార్హం. -
ఆ వీడియోని చూసి...కన్నీళ్లు పెట్టుకున్న పాక్ నాయకుడు
పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ సెనెటర్ ఆజం ఖాన్ స్వాతి ఒక అభ్యంతరకర వీడియో గురించి చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆజం ఖాన్ గతనెలలో ట్విట్టర్లో జనరల్ కమర్ జావేద్ బజ్వాను విమర్శించడంతో ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎఫ్ఐఏ) ఆయన్ను అరెస్టు చేసింది. ఆ తర్వాత బెయిల్‌పై విడుదల అయ్యారు. ఈ మేరకు ఆయన విలేకరులు సమావేశంలో ప్రసంగిస్తూ...తన భార్యకు గత రాత్రి ఒక గుర్తు తెలియని నెంబర్ నుంచి అభ్యంతరకర వీడియో వచ్చిందని చెప్పారు. ఐతే నా దేశంలో కూతుళ్లు, మనవరాళ్లు ఉన్నారు కాబట్టి ఆ వీడియో గురించి ఏమి ప్రస్తావించలేను అంటూ కన్నీరు పెట్టుకున్నారు. తాను తన భార్య క్వెట్టాను సందర్శించినప్పుడూ ఈ వీడియోని తీశారని, దీంతో తనను ఇబ్బందులకు గురిచేయాలని చూస్తున్నారంటూ ఆవేదన చెందారు. అంతేగాదు తనను కస్టడీలో ఉంచి బట్టలు విప్పి ఎగతాళి చేస్తూ.. టార్చర్ చేసినట్లు తెలిపారు. ఐతే ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అది ఫేక్ వీడియో అని, ఫోటోషాప్తో సృష్టించిన నకిలీ వీడియో అని ప్రకటించింది. ఐతే సెనెటర్ ఈ విషయమై ఒత్తిడి చేస్తున్నారు కాటట్టి అధికారికంగా దరఖాస్తు దాఖలు చేస్తే విచారణ చేస్తామని ఫెడరల్ ఏజెన్సీ స్పష్టం చేసింది. ఈ మేరకు పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ...ఆజం ఖాన్ స్వాతిని చిత్రహింసలకు గురిచేయడాన్ని ఖండించారు. అలాగే ఆయన భార్య అనుభవిస్తున్న అవమానకరమైన బాధ, ఆవేదనకు పాకిస్తాన్ తరుఫున తాను క్షమాపణలు చెబుతున్నాను అని అన్నారు. Shocking details of what happened last night to Azam Swati and his family being stated by @AzamKhanSwatiPk himself 1/2 pic.twitter.com/gdLpAW30qe — PTI (@PTIofficial) November 5, 2022 (చదవండి: వారెవ్వా.. సరికొత్త గిన్నిస్ రికార్డ్.. ‘కీహోల్’లోంచి ఏడు బాణాలు!) -
ఆ విషయంపై 'సారీ' చెప్పిన విశ్వక్ సేన్
Vishwak Sen Says Apology On Objectionable Word: హీరో విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’. విద్యాసాగర్ చింత దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే6న విడుదల కానుంది. దీంతో ప్రమోషన్స్ స్పీడు పెంచిన చిత్ర బృందం ఓ ప్రాంక్ వీడియో చేసి విమర్శల పాలైన విషయం తెలిసిందే. ఈ కాంట్రవర్సీపై ప్రముఖ టీవీ ఛానెల్ డిబెట్లో యాంకర్‌కు విశ్వక్ సేన్ మధ్య మాటల యుద్ధం కూడా జరిగింది. ఈ క్రమంలో విశ్వక్ సేన్ అభ్యంతరకర (ఎఫ్.. అనే పదం) పదాన్ని వాడాడు. ప్రస్తుతం ఈ పదాన్ని వాడటంపై కూడా పలు విమర్శలు వస్తున్నాయి. మే 2న నిర్వహించిన మూవీ ప్రమోషన్లో ఓ విలేఖరి విశ్వక్ సేన్‌ను ఈ పదం వాడటంపై ప్రశ్నించారు. దీనికి విశ్వక్ స్పందిస్తూ 'దెబ్బ తగిలినప్పుడు అమ్మా అన్నట్టే.. ఆ పదం అలా వచ్చింది. నిజంగానే అలాగే వచ్చింది. ఇప్పట్లో చిన్న పిల్లలకు, 16 ఏళ్ల వయసున్న యూత్‌కు వద్దన్నా ఆ పదం వచ్చేస్తోంది. కానీ మీడియాలో ఆ పదం వాడినందుకు సారీ. దీనిపై రేపు (మే 3) క్లారిటీగా నోట్ రిలీజ్ చేస్తాను' అని తెలిపాడు. చదవండి: ‘గెట్ అవుట్’ అంటూ విశ్వక్ సేన్‌పై టీవీ యాంకర్ ఫైర్ విశ్వక్ సేన్-టీవీ యాంకర్ వీడియోపై ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్.. -
ఆన్లైన్ క్లాస్‌లో అశ్లీల వీడియో
మైసూరు: గూగుల్ మీట్ ద్వారా ఉపాధ్యాయురాలు విద్యార్థులకు ఆన్లైన్లో పాఠాలను బోధిస్తున్న సమయంలో అశ్లీల వీడియో ప్రసారమైన సంఘటన మైసూరులో చోటు చేసుకుంది. ఒక ప్రైవేటు స్కూల్ క్లాస్ జరుగుతున్న సమయంలో లింక్‌లోకి గుర్తు తెలియని యువకుడు చొరబడి అశ్లీల వీడియో పెట్టాడు. గమనించిన టీచర్ క్లాస్‌ను బంద్ చేసింది. ఎవరు ఈ నేరానికి పాల్పడ్డారో గుర్తించి శిక్షించాలని సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేపట్టారు. -
అయ్యయ్యో.. టీవీ చానెల్ ఎంత పనిచేసింది!
వాషింగ్టన్: ఉన్నట్టుండి అమెరికాలోని ఒక టీవీ చానల్ ప్రేక్షకులను షాక్‌కు గురి చేసింది. వాతావరణ వివరాలను ప్రసారం చేస్తున్న బులిటెన్‌లో ఏకంగా పోర్న్ కంటెంట్‌ను ప్రసారం చేసింది. దీంతో వీక్షకులు ఒక్కసారిగా బిత్తరపోయారు. ఈవినింగ్ న్యూస్కాస్ట్లో ఈ వీడియోను ప్రసారం చేసింది. ఆదివారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. (kidney transplantation: సంచలనం) స్థానిక వార్తా ఛానెల్ అశ్లీల క్లిప్‌ను ప్రసారం చేయడం హాట్‌టాపిక్‌గా నిలిచింది. సాయంత్రం వార్తల బులిటెన్‌లో భాగంగా వాతావరణ నిపుణురాలు మిషెల్ బాస్ వాతావరణ అప్డేట్ ఇస్తున్నారు. ఇంతలో పోర్న్క్లిప్ టెలికాస్ట్ కావడం ప్రారంభమైంది. 13 సెకన్ల స్పష్టమైన వీడియో టెలికాస్ట్ అవుతోంటే..యాంకర్, కో యాంకర్, కోడి ప్రోక్టర్ గానీ దీన్ని గమనించనేలేదు. వివరాల అనంతరం బ్యాక్‌గ్రౌండ్‌లో గ్రాఫిక్ వీడియో వచ్చేదాకా ఇది ప్రసారమైంది. అయితే దీనిపై సంబంధిత టీవీ ఛానెల్ స్పందించింది. పొరపాటు జరిగిందంటూ ఛానెల్ క్షమాపణలు తెలిపింది. ఇలాంటివి మళ్లీ జరగకుండా చూసుకుంటామని ప్రకటించింది. మరోవైపు ఈ ఘటనపై వీక్షకుల నుండి ఫిర్యాదులు రావడంతో సంబంధిత పోలీస్ డిపార్ట్మెంట్ దర్యాప్తు చేస్తోంది. -
నగ్నంగా బైక్‌పై హల్చల్ : పోలీసుల వేట!
-
నగ్నంగా బైక్‌పై హల్చల్ : పోలీసుల వేట!
సాక్షి, సిటీబ్యూరో: అతడో బైక్‌ను చోరీ చేశాడు... దానిపై నగ్నంగా రెండు కమిషనరేట్ల పరిధిలో సంచరించాడు... పోలీసులు అడ్డుకోవడానికి ప్రయత్నించడంతో వాహనం వదిలి పారిపోయాడు. ఆ ‘నగ్న చోరుడి’ కోసం ఇప్పుడు హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులు గాలిస్తున్నారు. చిక్కితే ఓ చోరీ కేసు ఇప్పటికే సిద్ధంగా ఉండగా, మెంటల్ హెల్త్ యాక్ట్ ప్రకారం మరో కేసు నమోదు చేయడానికి సిద్ధమవుతున్నారు. వివరాల్లోకి వెళితే..ఓ గుర్తుతెలియని యువకుడు గత వారం లంగర్‌హౌస్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ద్విచక్ర వాహనాన్ని చోరీ చేశాడు. దీనిపై స్థానిక పీఎస్‌లో కేసు నమోదైంది. ఆ చోరుడు మూడు రోజుల క్రితం పట్టపగలు ఆ వాహనాన్ని తీసుకుని నగ్నంగా షికారుకు బయలుదేరాడు. తొలుత హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లోని బోయిన్పల్లి పరిధిలోకి వచ్చే కంటోన్మెంట్ ఏరియాలో హల్చల్ చేశాడు. ఆపై బొల్లారంలోని మిలటరీ ప్రాంతంలో సంచరించాడు. అక్కడి నుంచి బేగంపేట వచ్చిన ఈ ‘న్యూడ్ రైడర్’ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ పక్కన నాలాపై ఉన్న వంతెన మీదుగా బల్కంపేటకు, అట్నుంచి సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోకి వచ్చే సనత్‌నగర్ ప్రాంతానికి చేరుకున్నాడు. ఈ ఠాణా పరిధిలోనే ఎక్కువసేపు సంచరించాడు. దీనిని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన గస్తీ బృందాలు సనత్‌నగర్ ఎస్ఆర్టీ ప్రాంతంలోని నెహ్రు పార్క్ వద్ద ఆ నగ్న యువకుడిని గుర్తించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు, స్థానికులు అతడిని పట్టుకోవడానికి ప్రయత్నించారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన సదరు యువకుడు వాహనాన్ని అక్కడే పడేసి వారిపై రాళ్ల దాడికి దిగాడు. అదను చూసుకుని పార్క్ లోపలికి వెళ్లిన అతను అక్కడి నుంచి తప్పించుకున్నాడు. సతన్‌నగర్ పోలీసులు ఆ ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అది రిజిస్టరై ఉన్న చిరునామా, ఫోన్ నంబర్ ఆధారంగా అతడిని గుర్తించాలని ప్రయత్నించారు. అయితే ఆ వాహనం చోరీపై లంగర్‌హౌస్ ఠాణాలో కేసు నమోదై ఉన్నట్లు తేలింది. దీంతో సనత్‌నగర్ పోలీసులు వాహనాన్ని బుధవారం ఆ పోలీస్ స్టేషన్ అధికారులకు అప్పగించారు. సదరు యువకుడి కోసం చోరీ కేసు ఉండటంతో లంగర్‌హౌస్ అధికారులు, న్యూసెన్స్ చేసినందుకుగాను మెంటల్ హెల్త్ యాక్ట్ కింద కేసు పెట్టాలని సనత్‌నగర్ పోలీసులు గాలిస్తున్నారు. మూడు కమిషనరేట్ల పరిధిలోనూ ఈ గాలింపు కొనసాగుతోంది. ప్రధానంగా లంగర్‌హౌస్ సహా వివిధ ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లో నమోదైన ఫీడ్‌ను పరిశీలిస్తున్నారు. ఆ యువకుడు నగ్నంగా బైక్ నడుపుతుండగా మిలటరీ ఏరియాలో వెనుక నుంచి వెళ్తూ కొందరు వాహన చోదకులు వీడియో తీశారు. ఆ ప్రయత్నంలో అతడిని పిలుస్తున్నా పలకకుండా, తల కూడా తిప్పకుండా వేగంగా వెళ్లిపోయాడు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. అతగాడు మతిస్థిమితం లేక ఇలా చేశాడా? స్నేహితులు లేదా పరిచయస్తులతో పందాలు కాసి అలా ప్రవర్తించాడా? అనేదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. -
ఆప్‌ను పీడిస్తున్న సందీప్ 'అశ్లీలం'
పనాజి: ఆమ్ఆద్మీ పార్టీని సందీప్ వీడియో వ్యవహారం ఇబ్బందులకు గురిచేస్తోంది. ఆప్‌ను దెబ్బతీయడానికి ప్రత్యర్థులు సందీప్ అశ్లీల వీడియో దృశ్యాలను అస్త్రంగా వాడుతున్నారు. ఇప్పటికే పలువురు కళంకిత నేతలతో పరువుపోగొట్టుకున్న ఆప్.. సందీప్ వ్యవహారంతో పూర్తిగా ఇరుకునపడినట్లైంది. 'ఆప్ 18 డైమండ్స్' అంటూ ఆప్ కళంకిత నేతల చిత్రాలు, వారి చర్యలతో కూడిన పోస్టర్లను పంజాబ్‌లో ప్రచారం చేయాలని బీజేపీ-అకాళీదళ్ ఇప్పటికే నిర్ణయించిన విషయం తెలిసిందే. తాజాగా గోవా అంతటా సందీప్ నగ్న వీడియోకు సంబంధించిన పోస్టర్లు కనిపించడంతో స్థానిక ఆప్ నేతలు బిత్తరపోయారు. సందీప్ పోస్టర్లపై ఆప్ ఎన్నికల గుర్తును కూడా ముద్రించడం పట్ల గోవా ఆప్ కన్వినర్ వాల్మికి నాయక్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలిపిన ఆయన.. ఇది బీజేపీ నాయకుల చర్యగా అనుమానం వ్యక్తంచేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గోవాలో 40 సీట్లలో పోటీచేయడానికి ఆప్ కసరత్తులు పూర్తిచేసుకుంది. అయితే ఆ పార్టీ నేతల కళంకిత వ్యవహారం ఆప్‌కు పెద్ద ఎదురుదెబ్బగా విశ్లేషకులు భావిస్తున్నారు. -
హింసకు దారి తీసిన (వాట్సాప్) సోనియాగాంధీ ఫోటో..
జబల్పూర్ః కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అభ్యంతరకర ఫోటో వాట్సాప్ లో కనిపించడం హింసాత్మకంగా మారింది. పోలీస్టేషన్ కు చేరిన ఇరు వర్గాల మధ్య ఘర్షణ చినికి చినికి గాలివానై ఒకరి మృతికి కారణమవ్వడంతోపాటు ఆరుగురు తీవ్రంగా గాయపడేట్టు చేసింది. జబల్పూర్ లో రెండు వాట్సాప్ వర్గాల మధ్య తలెత్తిన వివాదంలో ఒకరు చనిపోగా, ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. కాంగ్రెస్ ప్రెసిడెంట్ సోనియా గాంధీకి చెందిన ఓ అభ్యంతర కర ఫోటోను వాట్సాప్ మెసెంజెర్ గ్రూప్ లో పోస్టు చేయడంతో అసలు వివాదం ప్రారంభమైనట్లు పోలీసులు చెప్తున్నారు. ఇరువర్గాల మధ్య తలెత్తిన వివాదంలో 33 ఏళ్ళ వ్యక్తి చనిపోగా, తీవ్ర గాయాలైన ఉమేష్ వర్మ అనే వ్యక్తి స్థానిక ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నట్లు ఏరియా సిటీ ఎస్పీ ఇంద్రజీత్ బల్సావర్ తెలిపారు. తాము ఫిర్యాదు చేసేందుకు విజయనగర్ పోలీస్ స్టేషన్ కు వెళ్ళేసమయానికి ప్రత్యర్థి బృందం తమపై కత్తులతో దాడి చేయడంతో పరిస్థితి హింసాత్మకంగా మారినట్లు కాంగ్రెస్ కార్పొరేటర్ జతిన్ రాజ్ ఆరోపించారు. విజయ నగర్ ఫ్రెండ్స్ పేరిట రాజ్.. తమ ప్రాంతంలోని వారితో కలిసేందుకు వీలుగా ఓ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాడు. కాగా ప్రశాంత్ నాయక్ అనే వ్యక్తి ఆ గ్రూప్ లో సోనియా గాంధీ పాత్రలు తోముతున్నట్లుగా ఉన్న ఓ వ్యంగ్య చిత్రాన్ని పోస్టు చేయడంతోపాటు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీయే సోనియాకు ఆ పరిస్థితి రావడానికి కారణమన్నట్లుగా అర్థం వచ్చే ఓ క్యాప్షన్ కూడ పెట్టడం అసలు వివాదానికి తెరలేపింది. గత రాత్రి అహింసా చౌక్ లో ఇరువర్గాల సభ్యులు కలుసుకొని ఫోటో పోస్టు చేయడంపై తీవ్రంగా వాదించుకోవడం కూడ జరిగింది. అదే సమయంలో అక్కడికి చేరిన పోలీసులు వివాదాన్ని ఓ కొలిక్కి తెచ్చేందుకు ఇరువర్గాల సభ్యులను పోలీస్ స్టేషన్ కు రమ్మని పిలిచారు. దీంతో పోలీస్ స్టేషన్ కు చేరిన వర్గాల మధ్య తీవ్ర వాగ్యుద్ధం చోటు చేసుకోవడంతోపాటు, దాడులకు దిగడంతో ఉమేష్ వర్మకు తీవ్ర గాయాలయ్యాయని, అతడ్ని ఆసుపత్రికి తరలించినట్లు కాంగ్రెస్ కార్పొరేటర్ బృందంలోని సభ్యుడైన అనిమేష్ ఆరోపిస్తున్నాడు. అయితే ప్రస్తుతం అక్కడి పరిస్థితి ప్రశాంతంగానే ఉందని, ఆ గొడవ పోలీస్ స్టేషన్ లో జరగలేదని, ఇరువర్గాలు పోలీస్ స్టేషన్ కు వచ్చే దారిలోనే గొడవ జరిగిందని సీఎస్పీ బల్సావర్ చెప్తుండగా... పోలీస్ స్టేషన్ లోని సీసీటీవీ ఫుటేజ్ ను బయట పెడితే అసలు నిజం బయట పడుతుందని అనిమేష్ డిమాండ్ చేస్తున్నాడు. ఇరు వర్గాలపైనా కేసు నమోదు చేశారని, తదుపరి దర్యాప్తు జరుగుతున్నట్లు కొద్దిపాటి గాయాలతో బయటపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న న్యాయవాది నాయక్ తెలిపారు. -
అసభ్యకర ఫొటోలు తీసిన వ్యక్తి అరెస్ట్!
న్యూఢిల్లీ: తోటి ప్రయాణీకురాలిపై వేధింపులకు పాల్పడిన వ్యక్తిని ఢిల్లీ ఎయిర్ పోర్ట్ పోలీసులు అరెస్టు చేశారు. విమాన ప్రయాణంలో మహిళను అసభ్యకర ఫొటోలు తీసిన వ్యక్తి కటకటాలపాలయ్యాడు. అహ్మదాబాద్ నుంచి ఢిల్లీ బయల్దేరిన విమానంలో తనతోపాటు ప్రయాణిస్తున్న మహిళను కెమెరాలో అసభ్యంగా చిత్రీకరించి వివాదంలో ఇరుక్కున్నాడు. విమానం ఢిల్లీ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న తర్వాత మహిళ ఫిర్యాదు మేరకు నిందితుడు గౌరవ్ శర్మను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహిళను అసభ్యంగా ఫొటోలు తీసిన గౌరవ్ శర్మ చిక్కుల్లో పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు అహ్మదాబాద్ నుంచి విమానం ఢిల్లీకి చేరుకున్న తర్వాత నిందితుడు గౌరవ్ శర్మను అదుపులోకి తీసుకున్న పోలీసులు... అతడిపై ఐపీసీ సెక్షన్ 354C కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు డీసీపీ డికె. గుప్తా తెలిపారు. బాధిత మహిళ స్వస్థలం అహ్మదాబాద్ కాగా, నిందితుడు ఉత్తర ప్రదేశ్ లోని సంభాల్ వాసిగా తెలుస్తోంది. గత రెండు మూడురోజుల్లోనే విమాన ప్రయాణంలో మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడటం ఇది రెండోసారి. రెండ్రోజుల క్రితం కోల్ కత్తా నుంచి ముంబై వెడుతున్న ఇండిగో 6E 326 విమానంలో బంగ్లాదేశ్ కు చెందిన వ్యక్తి... ఎయిర్ హోస్టెస్ పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో అతడ్ని అరెస్టు చేశారు. బంగ్లాదేశ్ కు చెందిన 38 ఏళ్ళ అషిమ్ భూమిక్ ను అరెస్టు చేసినట్లు ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ డీసీపీ వీరేంద్ర మిశ్రా తెలిపారు. -
జాగ్రత్త, ఫేసు బుక్కయిపోతారు..!