![Shocking: US TV Channel Airs x rated Clip During Weather Report - Sakshi](/styles/webp/s3/article_images/2021/10/21/TV%20Channel.jpg.webp?itok=9SSuSfvK)
వాషింగ్టన్: ఉన్నట్టుండి అమెరికాలోని ఒక టీవీ చానల్ ప్రేక్షకులను షాక్‌కు గురి చేసింది. వాతావరణ వివరాలను ప్రసారం చేస్తున్న బులిటెన్‌లో ఏకంగా పోర్న్ కంటెంట్‌ను ప్రసారం చేసింది. దీంతో వీక్షకులు ఒక్కసారిగా బిత్తరపోయారు. ఈవినింగ్ న్యూస్‌కాస్ట్‌లో ఈ వీడియోను ప్రసారం చేసింది. ఆదివారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. (kidney transplantation: సంచలనం)
స్థానిక వార్తా ఛానెల్ అశ్లీల క్లిప్‌ను ప్రసారం చేయడం హాట్‌టాపిక్‌గా నిలిచింది. సాయంత్రం వార్తల బులిటెన్‌లో భాగంగా వాతావరణ నిపుణురాలు మిషెల్ బాస్ వాతావరణ అప్‌డేట్ ఇస్తున్నారు. ఇంతలో పోర్న్‌క్లిప్ టెలికాస్ట్ కావడం ప్రారంభమైంది. 13 సెకన్ల స్పష్టమైన వీడియో టెలికాస్ట్ అవుతోంటే..యాంకర్, కో యాంకర్, కోడి ప్రోక్టర్ గానీ దీన్ని గమనించనేలేదు. వివరాల అనంతరం బ్యాక్‌గ్రౌండ్‌లో గ్రాఫిక్ వీడియో వచ్చేదాకా ఇది ప్రసారమైంది.
అయితే దీనిపై సంబంధిత టీవీ ఛానెల్ స్పందించింది. పొరపాటు జరిగిందంటూ ఛానెల్ క్షమాపణలు తెలిపింది. ఇలాంటివి మళ్లీ జరగకుండా చూసుకుంటామని ప్రకటించింది. మరోవైపు ఈ ఘటనపై వీక్షకుల నుండి ఫిర్యాదులు రావడంతో సంబంధిత పోలీస్ డిపార్ట్‌మెంట్ దర్యాప్తు చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment