playing
-
కాల్ గర్ల్‌గా నటించడం గౌరవంగా ఉందన్న శోభిత (ఫోటోలు)
-
అచ్చం బిచ్చగాడిలా నమ్మించి..
అతనో నటుడు.. చిన్నచిన్న వేషాలు వేస్తుంటే వచ్చే డబ్బుతో ఇల్లు గడవట్లేదు. ఎలాగా అని ఆలో చించి ఓ కొత్త వేషం వేశాడు. అది సినిమాల్లోనో, సీరి యళ్లలోనో కాదు.. బయట జనం మధ్యలో నటించడం మొదలుపెట్టాడు. ఈ వేషం సూపర్ సక్సెస్ అయింది. నెలకు ఎనిమిది లక్షల రూపాయలకుపైనే సంపాదించి పెట్టేస్తోంది. అది కూడా ఆదాయ పన్ను వంటివేమీ కట్టాల్సిన అవసరం లేని సంపాదన. మరి ఆ వేషమేంటో తెలుసా..? ‘బిచ్చగాడు’. చైనాలో ని హెనాన్ ప్రావిన్స్‌కు చెందిన లు జింగాంగ్ కథ ఇది. అతను సుమారు పన్నెండేళ్ల కింద ఓ రోజు ‘నటన’ మొదలుపెట్టాడు. అక్కడ ఎప్పుడూ కిటకిటలాడుతూ ఉండే పర్యాటక ప్రదేశం ‘కిన్మింగ్ షాంగే గార్డెన్’ను ఎంచుకున్నాడు. ముఖానికి కాస్త మసి, చిరుగులు– అతుకులతో ఉన్న బట్టలు వేసుకుని.. ఓ చేతి లో కర్ర, మరో చేతిలో చిప్ప పట్టుకుని.. చూడగానే జాలి కలి గేలా అమాయ కపు మొహం వేసుకుని అడుక్కోవడం మొదలుపెట్టాడు. మనోడి నటనా కౌశలానికి పర్యాట కులు పడిపోయి దండిగానే డబ్బులు వేయడం మొదలుపెట్టారు. అలా నెలకు రూ.8లక్షలకుపైనే సంపాదిస్తున్నాడట. జింగాంగ్ అడుక్కోవడం మొదలుపెట్టిన కొత్తలో అతడి కుటుంబ సభ్యులు ఛీకొట్టి వదిలేసి పోయారట. కానీ బాగా డబ్బులు వెనకేశాక.. మళ్లీ అంతా తిరిగొచ్చేశారట. అంతా ‘నటన’!? -
గోపాల మురిపాల బాల
కొన్ని వీడియోలు వైరల్ కావడానికి మాటలు, నిడివితో పనిలేదు. ‘హార్ట్‌వార్మింగ్ ఎలిమెంట్’తో మౌనంగానే వైరల్ అవుతాయి. ఈ వీడియో అలాంటి కోవకు చెందింది. ఆరుబయట మంచంపై కూర్చొని ఆడుకుంటున్న ఓ పాప దగ్గరికి ఆవు వచ్చి ‘ఎలా ఉన్నావు పాపా?’ అన్నట్లుగా ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. పాప ఆవు ముఖాన్ని చేతుల్లోకి తీసుకొని నిమురుతూ ‘నేను బాగానే ఉన్నాను. నీ సంగతి ఏమిటి?’ అన్నట్లుగా నవ్వుతుంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అయిన ఈ వీడియో లక్షలాది వ్యూస్‌తో దూసుకుపోతోంది. -
సంపూర్ణంగా కోలుకున్న లాలూ
న్యూఢిల్లీ: కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స తర్వాత ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ అనారోగ్యం నుంచి సంపూర్ణంగా కోలుకున్నారు. చాలా హుషారుగా బ్యాడ్మింటన్ ఆడుతూ కనిపించారు. లాలూ ఆడుతున్న వీడియోని ఆయన కుమారుడు, బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘‘దేనికీ భయపడరు. దేనికీ తలవంచరు. పోరాడారు. పోరాడుతూనే ఉంటారు. జైల్లో పెట్టినా బెదరలేదు. అంతిమంగా విజయమే సాధించారు’’ అని తేజస్వి యాదవ్ క్యాప్షన్ పెట్టారు. -
అలా కొట్టుకుపోయారు
-
ఆ అమ్మాయి ఫుట్‌బాల్ గేమ్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే
-
చీరకట్టులో.. చెంగు చెంగున గోల్స్
-
అమ్మలాంటి ఆవు..బుజ్జోడి నవ్వులు
-
బుడ్డోడి ధైర్యం సల్లగుండా.. భయం లేకుండా ఎలా కొండచిలువుతో ఆడుతున్నాడో చూడండి !
-
Video: ఆడుకుంటూ బోరుబావిలో పడిపోయిన నాలుగేళ్ల చిన్నారి
బోరు బావులు చిన్నారుల పాలిట మృత్యు పాశాలుగా మారుతున్నాయి. ఇప్పటికే అనేక చోట్ల తెరిచి ఉంచిన బోరు బావిలో పడి చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఎన్నో జరిగాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హాపూర్ జిల్లాలో అలాంటి ఘటనే ఒకటి వెలుగు చూసింది. స్థానికంగా నివసిస్తున్న మావియా అనే నాలుగేళ్ల బాలుడు ఆడుకుంటూ 60 అడుగుల బోరు బావిలో పడిపోయాడు. జిల్లా లోని కోట్ల సాదత్ ప్రాంతంలో మంగళవారం ఈ ఘటన జరిగింది. బావిలో నుంచి బాలుడి అరుపులు, కేకలు విన్న స్థానికులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. ప్రమాదంపై పోలీసులు అధికారులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ బలగాలు చిన్నారిని కాపాడేందుకుసహాయక చర్యలు ప్రారంభించాయి. ముందుగా ఆక్సిజన్‌ను బోరుబావిలోకి పంపించారు. 5 గంటలు తీవ్రంగా శ్రమించిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది.. చివరికి బాలుడిని క్షేమంగా బయటకు తీశారు. రెస్క్యూ ఆపరేషన్‌లో బాలుడికి స్వల్ప గాయాలు కాగా.. అతడు సురక్షితంగా బయట పడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా ఈ ఘటనతో స్థానికంగా ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. అయితే ఈ బోరు బావి హాపూర్ మున్సిపాలిటీకి చెందినదిగా స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో నీటిని సరఫరా చేసేందుకు ప్రభుత్వం దీనిని తవ్విందని, చాలాకాలంగా ఇది నిరుపయోగంగా ఉందని తెలిపారు. సుమారు 35 ఏళ్ళ క్రితం ఈ బోరు బావిని తవ్వారని పేర్కొన్నారు. చదవండి: Honey Trap: సోషల్ మీడియాలో పరిచయమైన మహిళ.. వలపు వలలో చిక్కి రూ.28 కోట్ల కొకైన్ స్మగ్లింగ్.. -
పేకాట ఆడుతూ పట్టుబడ్డ టీడీపీ నేతలు
-
వైరల్ వీడియో : బెలూన్ తో ఆటలాడుతున్న కుక్క
-
కంగారుతో ఆడుతున్న మంత్రి రోజా
-
మూడేళ్ల బాలిక.. ఏనుగంటే భయం లేకుండా ఎంత పనిచేసింది!
గువాహటి: సాధారణంగా చిన్నపిల్లలకు ఏనుగంటే మహ సరదా. మావటి వాడు ఏనుగును.. ఇంటి దగ్గరకు తీసుకొని వచ్చినప్పుడు దానిమీద ఎక్కడానికి ఇష్టపడుతుంటారు. ఏనుగుకు ఏదైన తినిపించి తెగ సంబరపడి పోతుంటారు. దాని తొండం చేత ఆశీర్వాదం కూడా తీసుకుంటారు. ఇలాంటివి మనం తరచుగా చూస్తూనే ఉంటాం. తాజాగా, అస్సాంలో ఒక బాలిక ఏనుగంటే ఏ మాత్రం భయం లేకుండా దానితోనే ఫుట్ బాల్ ఆడింది. అంతటితో ఆగకుండా దాని పాలను తాగడానికి ప్రయత్నిచింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాలు.. అస్సాంలోని గోలాఘడ్ జిల్లాలో ఒక కుటుంబం ఏనుగును పెంచుకుంటున్నారు. ఈ క్రమంలో అది వారితో ఒక అనుబంధాన్ని కల్గి ఉంది. వారు ప్రతి రోజు ఏనుగుకు మంచి ఆహరం ఇస్తారు. ఈ క్రమంలో.. ఏనుగు కూడా వారితో ప్రేమగా ఉంటుంది. ఆడుకోవడం కూడా చేస్తుంటుంది. ఈ క్రమంలో యజమానికి హర్షిత బోరా అనే మూడేళ్ల కూతురు ఉంది. ఆమె చిన్నప్పటి నుంచి ఏనుగును చూస్తూ పెరిగింది. ఆమెకు ఏనుగంటే ఎంతో ఇష్టం. ఏనుగు కూడా బాలిక దగ్గరకు వెళ్లి తొండంతో ప్రేమగా నిమురుతుంది. ఈ క్రమంలో మూడేళ్ల బాలిక ఏనుగుతో ఫుట్‌బాల్ ఆడుకుంటుంది. ఆమె ఏనుగువైపు బాల్‌ను విసరగానే.. ఏనుగు తన తొండంతో ఆ బాల్‌ను అందుకుంది. ఆ తర్వత తిరిగి బాలికవైపు విసిరింది. ఈ క్రమంలో... బాలిక మరోక అడుగు ముందుకు వేసింది. ఏనుగు మోకాలంతా పొడవులేని బాలిక.. అసలు భయం లేకుండా.. ఏనుగు కింది నుంచి అటూ ఇటూ దాటూకుంటూ ఆడుకుంది. ఆ తర్వాత.. దాని పొదుగు దగ్గరకు వెళ్లి దాని పాలను తాగడానికి కూడా ప్రయత్నించింది. ఏనుగు, బాలికతో సరదాగా ఆడుకుంటుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీన్ని చూసిన నెటిజన్లు.. ‘వావ్.. బాలికకు ఎంత ధైర్యం..’, ‘ ఏనుగు మోకాలంతా కూడా లేదు..’, ‘ అయినా.. అప్రమత్తంగా ఉండాలి..’, ‘భలే ఆడుకుంటుంది..’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. చదవండి: ఇంటి నుంచి కిడ్నాప్ చేసి.. అమానుషంగా ప్రవర్తించారు! -
‘బసవన్న’ ఆశలు సంక్రాంతి పైనే
సాక్షి, పాల్వంచ(ఖమ్మం): సంక్రాంతి పండుగ వస్తుందంటే చాలు మూడురోజుల ముందునుంచే ఎక్కడ ఉన్న డూడూ బసవన్నలు గ్రామాల్లో సందడి చేస్తాయి. ఈ పండుగ గంగిరెద్దులను ఆడించేవారి జీవితాల్లో కొంత కాంతిని నింపి మూడు రోజుల ముందే ప్రారంభం కావడంతో పల్లెల్లో పండగశోభ సంతరించుకుంటుంది. కరోనా ప్రభావంతో గంగిరేద్దుల జీవితాల్లో ప్రభావం చూపిందని చెప్పవచ్చు. వేకువజామున చలిలో గంగిరెద్దులతో ఇంటింట తిరిగడం కనపిస్తుంది. గంగిరెద్దులు ఆడిచేవారికి పండగే ఆధారపడి ఉంటాయి. పండగ సందర్భంగా ఊరూరా తిరిగి ప్రదర్శనలు ఇస్తారు. ఇలా పండగ పూర్తి అయ్యేనాటికి వచ్చిన ఆధాయంతో ఆరునెలలపాటు సంతోషంగా కుటుంబం అంతాగడుపుతారు. తర్వాత కూలీపనులు చేసుకుంటు జీవనం సాగిస్తుంటారు. చిన్నప్పటి నుంచే శిక్షణ గంగిరెద్దులు విన్యాసాలు చేసే విధంగా వారు చిన్నప్పటి నుంచే ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఈ గంగిరెద్దులను నమ్ముకుని అనేక కుటుంబాలు పాల్వంచ, కొత్తగూడెం, సుజాతనగర్ మండలంలో జీవనం సాగిస్తున్నాయి. తాత ముత్తాతల నుంచి గంగిరెద్దులను ఆడించుకుంటు జీవనం సాగిస్తున్నారు. ఎలాంటి వ్యవసాయ భూములు, ఇళ్లు, కనీసం రేషన్‌కార్డులు లేవని వాపోతున్నారు. సంక్రాంతి పండగ తోపాటు ఎవ్వరైన పెద్దవాళ్లు కాలం చేస్తే పదవ రోజున ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని గంగిరెద్దులతో విన్యాసాలు చేయించి పరుగులు పెట్టిస్తారు. ఇలా బసవన్నల ఆడించుకుంటుంటే దయగణాలు అంతో ఇంతో దానంచేస్తే వచ్చిన వాటితోనే జీవనంసాగిస్తున్నామని గంగిరెద్దులను ఆడించే వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ కుటుంబాలకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు, పింఛన్లు అందజేయాలని వారు వేడుకుంటున్నారు. చదవండి: ఉద్యోగంలోకి తీసుకోలేదని ఆత్మహత్యాయత్నం -
Harish Rao: బ్యాట్ పట్టి.. షాట్స్ కొట్టి..
సాక్షి, సిద్దిపేట(మెదక్): నెలరోజులుగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజీగా ఉంటూ.. కరోనా మూడో వేవ్ నేపథ్యంలో రాష్ట్ర వైద్యాధికారులతో సుదీర్ఘ సమీక్షలు జరుపుతూ హైదరాబాద్‌లో ప్రభుత్వ ఆస్పత్రుల్లో తనిఖీలతో తలమునకలైన రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు బుధవారం సరదాగా క్రికెట్ ఆడారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఓ ప్రైవేట్ఫుడ్, స్పోర్ట్స్ డ్రైవ్ ఇన్ హోటల్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న బాక్స్ క్రికెట్ నెట్లో కొద్దిసేపు బ్యాట్ పట్టి అందరినీ ఆకట్టుకున్నారు. చదవండి: బతుకునిచ్చే చెట్టుపైనే ఊపిరి పోయె -
భారీకొండ చిలువతో చిన్నారి ఆటలు, చూస్తే షాకవ్వాల్సిందే!
సాధారణంగా చాలామంది పాముని చూడగానే భయంతో వణికిపోతుంటారు. పాము ఉందంటే ఆ దరిదాపుల్లోకి వెళ్లటానికి కూడా ఇష్టపడరు. ఒక్కొసారి పాములు, కొండ చిలువలు దారితప్పి.. జనవాసాల మధ్యన, పరిసర ప్రాంతాల్లోని ఇళ్లలోనికి వస్తుంటాయి. లేదా చాలా తక్కువ మంది ఇళ్లలోనే పాములను పెంచుకుంటారు. అలాంటి వారు పాముకి బయపడకుండా వాటితో మంచి స్నేహాన్ని ఏర్పరుచుకుంటారు. తాజాగా ఓ చిన్నారి పెద్ద పాముతో ఎలాంటి బెరుకు లేకుండా ఆడుకుంటున్న షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇందులో అయిదారేళ్ల వయసున్న చిన్నారి రెడ్ కలర్ టీషర్టు ధరించి తన ఇంటి ఆవరణంలో ఆడుకుంటోంది. ఇంతలో అక్కడి భారీ కొండ చిలువ వచ్చింది. అయితే కొండచిలువను చూసిన చిన్నారి ఏమాత్రం భయపడలేదు. పైగా నవ్వుతూ పాము దగ్గరకు వెళ్తుంది. కొండ చిలువను పట్టుకొని దానితో ఆటలాడుతుంది. ప్రశాంతంగా పాము మీద పడుకుంటుంది. చిన్నారి పక్కన పాము పాకడం చూస్తుంటే ఒళ్ళు గగుర్పొడిచినట్లు అనిపిస్తుంది. చదవండి: ‘మేరా ఫౌజీ అమర్ రహే’.. పెళ్లినాటి దుస్తుల్లో భర్తకు తుది వీడ్కోలు ఇక చిన్నారి వీడియోను చూసిన నెటిజన్లు ఆశ్యర్యపోతున్నారు. కొండచిలువతో ఆడిన పసిపాప ధైర్య హృదయాన్ని ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతుండగా, లక్షలకు పైగా వ్యూవ్స్ వచ్చాయి. కాగా చిన్నారి ఆడుకుంటున్న పాము శిక్షణ పొందిన పెంపుడు జంతువు అని తెలిసింది. చదవండి: ప్రేయసికి వెరైటీగా ప్రపోజ్ చేసిన ఆసీస్ మహిళ.. ఎలాగో చూడండి..! View this post on Instagram A post shared by 🐍SNAKE WORLD🐍 (@snake._.world) -
విషాదం: ఆడుకుంటూ.. అనంతలోకాలకు
వేర్వేరు ఘటనల్లో నివారం ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని గోధూర్ కోళ్ల ఫారంలో మక్కల బస్తాలు మీద పడి ఒకరు, కోనరావుపేట మండలంలోని హన్మాజీపేటల్లో విద్యుదాఘాతంతో ఇద్దరు మృతిచెందారు. ఈ ముగ్గురూ ఆడుకుంటూనే అనంతలోకాలకు వెళ్లారు. బాధిత కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిల్చారు. సాక్షి,కోనరావుపేట(వేములవాడ): ఇంట్లో ఆడుకుంటున్న రెండేళ్ల చిన్నారి విద్యుదాఘాతంతో మృతిచెందింది. స్థానికుల కథనం ప్రకారం.. వేములవాడ మండలం హన్మాజీపేటకు చెందిన గొర్రె అనిత–సంజీవ్ దంపతులు తమ కూతురు వాంగ్మయి(2)తో కలిసి మండలంమరిమడ్ల(అహ్మద్ హుస్సేన్‌పల్లి)లోని బంధువులు ఇంటికి వెళ్లారు. శనివారం ఉదయం వాటర్ హీటర్ స్విచ్ ఆఫ్ చేసి, ఉన్నా చిన్నారి ఆడుకుంటూ వెళ్లి ముట్టుకోవడంతో విద్యుత్ షాక్ తగిలింది. అపస్మారక స్థితిలోకి వెళ్లిన పాపను జిల్లా ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. దీంతో బాధిత కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. మరో ఘటనలో.. మక్కల బస్తాలు మీద పడి.. ఇబ్రహీంపట్నం(కోరుట్ల): జగిత్యాల జిల్లా గోధూర్ గ్రామంలోని రాజరాజేశ్వర కోళ్లఫారంలో మక్కల బస్తాలు మీదపడి నందిని(4) మృతి చెందింది. ఏఎస్సై రవీందర్‌రెడ్డి కథనం ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన సంగీత–భీంరావు దంపతులు తమ కూతురు నందినితో కలిసి ఉపాధి కోసం పది రోజుల కిందట గోధూర్ వచ్చారు. స్థానిక రాజరాజేశ్వర కోళ్లఫారంలో కూలీలుగా పనికి కుదిరారు. శనివారం తల్లిదండ్రులు పనిలో నిమగ్నం కాగా కోళ్లఫారానికి సంబంధించిన గోదాములో నందినితోపాటు మరికొంత మంది కూలీల పిల్లలు ఆడుకుంటున్నారు. ఈ క్రమంలో మక్కల బస్తాలు నందినిపై పడ్డాయి. పిల్లలు అరవడంతో కూలీలందరూ అక్కడికి చేరుకున్నారు. బస్తాలు తీసి చూడగా ఆ చిన్నారి తలకు తీవ్ర గాయాలై, స్పృహ కోల్పోయింది. వెంటనే మెట్పల్లి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయింది. కోళ్ల ఫారం యజమాని మిట్టపెల్లి మహేశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై పేర్కొన్నారు. చదవండి: మాటిమాటికీ సెల్‌ఫోన్, బైక్ అడిగేవాడు.. కాదనడంతో క్షణికావేశంలో.. -
ప్లేయర్లతో కలిసి సరదాగా వాలీబాల్ ఆడిన రోజా
-
అయ్యయ్యో.. టీవీ చానెల్ ఎంత పనిచేసింది!
వాషింగ్టన్: ఉన్నట్టుండి అమెరికాలోని ఒక టీవీ చానల్ ప్రేక్షకులను షాక్‌కు గురి చేసింది. వాతావరణ వివరాలను ప్రసారం చేస్తున్న బులిటెన్‌లో ఏకంగా పోర్న్ కంటెంట్‌ను ప్రసారం చేసింది. దీంతో వీక్షకులు ఒక్కసారిగా బిత్తరపోయారు. ఈవినింగ్ న్యూస్కాస్ట్లో ఈ వీడియోను ప్రసారం చేసింది. ఆదివారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. (kidney transplantation: సంచలనం) స్థానిక వార్తా ఛానెల్ అశ్లీల క్లిప్‌ను ప్రసారం చేయడం హాట్‌టాపిక్‌గా నిలిచింది. సాయంత్రం వార్తల బులిటెన్‌లో భాగంగా వాతావరణ నిపుణురాలు మిషెల్ బాస్ వాతావరణ అప్డేట్ ఇస్తున్నారు. ఇంతలో పోర్న్క్లిప్ టెలికాస్ట్ కావడం ప్రారంభమైంది. 13 సెకన్ల స్పష్టమైన వీడియో టెలికాస్ట్ అవుతోంటే..యాంకర్, కో యాంకర్, కోడి ప్రోక్టర్ గానీ దీన్ని గమనించనేలేదు. వివరాల అనంతరం బ్యాక్‌గ్రౌండ్‌లో గ్రాఫిక్ వీడియో వచ్చేదాకా ఇది ప్రసారమైంది. అయితే దీనిపై సంబంధిత టీవీ ఛానెల్ స్పందించింది. పొరపాటు జరిగిందంటూ ఛానెల్ క్షమాపణలు తెలిపింది. ఇలాంటివి మళ్లీ జరగకుండా చూసుకుంటామని ప్రకటించింది. మరోవైపు ఈ ఘటనపై వీక్షకుల నుండి ఫిర్యాదులు రావడంతో సంబంధిత పోలీస్ డిపార్ట్మెంట్ దర్యాప్తు చేస్తోంది. -
ఇంత పారవశ్యమా, ఇలాంటి వీడియో మీరెపుడూ చూసి ఉండరు
దసరా పండుగ వేళ సోషల్ మీడియాలో ఓ ఆసక్తికరమైన వీడియో వైరల్‌గా మారింది. ఒక కోతి భక్తి పారవశ్యంలో మునిగిపోయింది. ఏకంగా ఒక సాధువు ఒడిలో కూర్చున్న వానరం లయబద్ధంగా కర్తల్ ప్లే చేసి అక్కడున్న వారినందరినీ ఆశ్యర్యంలో ముంచెత్తేసింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు కూడా స్వయంగా ఆ రాముడి కోసం దిగి వచ్చిన హనుమాన్ అంటూ ముగ్ధులవుతున్నారు. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు గానీ ఒక కోతి భజన చేస్తున్న సాధువుల చెంతకు చేరింది. వారితో పాటు భక్తి కీర్తనల్లో మునిగియంది. తాళానికి కనుగుణంగా భజనలో ఒక వాయిద్యాన్ని వాయిస్తూ ఆనందంలో మునిగిపోయింది. దీంతో సోషల్ మీడియా యూజర్లు ఫిదా అయితున్నారు. ఇది హనుమంతుడి రూపమే అంటూ మురిసి పోతున్నారు. ఇంత పారవశ్యామా ఇలాంటి కోతిని తాను ఎన్నడూ చూడలేదు అంటూ ఒక యూజర్ కామెంట్ చేశారు. చాలా ఆనందంగా ఉందంటూ మరో యూజర్ వ్యాఖ్యానించడం విశేషం. పంకజ్ పరాశర్ తన ఫేస్బుక్ ఖాతాలో ఈ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోను లక్షలాది మందికి వీక్షించగా, 30 వేల మంది షేర్ చేశారు. -
ఫుట్‌బాల్‌తో ఆడుకున్న ఎలుగుబంట్లు
-
అయ్యో చిట్టి తల్లి.. అప్పుడే నూరేళ్లు నిండాయా..
హయత్‌నగర్(హైదరాబాద్): ఇంటి ముందు తెరిచి ఉన్న నీటి సంపు ఓ చిన్నారి ప్రాణాన్ని బలిగొంది. ఆడుకుంటూ వెళ్లిన అభం శుభం తెలియని ఏడాదిన్నర పాప నీటి సంపులో పడి మృతి చెందిన విషాధ ఘటన శనివారం హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపూర్ మండలం రాచకొండ సమీపంలోని కడీలబాయి తండాకు చెందిన వాకుడోతు రా జు, సంతోషి దంపతులు బతుకుదెరువు కోసం నగరానికి వచ్చారు. హయత్‌నగర్‌లోని రంగనాయకుల గుట్ట సమీపంలో ఉంటున్నారు. ► రాజు లారీపై లేబర్ పని చేస్తుండగా ఆయన భార్య సంతోషి హోటల్లో పని చేస్తోంది. వీరికి ఒక కొడుకు, ఇద్దరు కూతుళ్లు. చిన్న కూతురు నిత్య(ఏడాదిన్నర) శనివారం ఇంటి ముందు ఆడుకుంటూ సమీపంలో ఉన్న మరో ఇంటివైపు వెళ్లింది. ఆ ఇంటి ముందు ఉన్న సంపు మూత తెరిచి ఉండటంతో నిత్య సంపులో పడిపోయింది. చాలా సేపు ఎవరూ గమనించలేదు. గంట తర్వాత నిత్య కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆమెను వెతకడం మొదలు పెట్టారు. చివరకు సంపులో తెలియాడటంతో నిత్యను బయటికి తీశారు. అప్పటికే పాప మృతి చెందింది. మురుగు వచ్చిందని.. సంపు మూత తెరిచి ఇటీవల కురుస్తున్న వర్షాలకు సమీపంలోని ఇంటి వద్ద ఉన్న సంపులో మురుగు చేరింది. దీంతో మురుగును బయటి పంపించేందుకు సంపు మూతను తెరి ఉంచినట్లు ఇంటి యజమాని తెలిపింది. సంపు మూతనుపెట్టకుండానే తాను పనికి వెళ్లింది. చుట్టూ ఎటువంటి రక్షణ లేకపోవడంతో అభం శుభం తెలియని చిన్నారి సంపులో పడి మునిగిపోయిందని స్థానికులు తెలిపారు. ► ఈ మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అప్పటి వరకు తమ కళ్ల ముందు ఆడుకున్న చిన్నారి విగతజీవిగా పడి ఉండటం చూసిన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. చదవండి: పెంచి పెద్ద చేస్తే.. ప్రాణం తీసింది -
కూలిన శబ్దం విని తల్లి పరుగున బయటకు.. తీరా అక్కడ చూస్తే..
సాక్షి, గచ్చిబౌలి( హైదరాబాద్): అప్పటిదాకా తమ కళ్ల ఎదుటే ఇంట్లో తిరిగిన చిన్నారి కాసేపటికే విగతజీవిగా మారడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఆడుకుంటుండగా దిమ్మె కూలి గేటు మీద పడటంతో దుర్ఘటనలో ఆరేళ్ల బాలుడు అసువులు బాశాడు. ఈ విషాదకర ఘటన గురువారం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ఐ నవీన్ రెడ్డి తెలిపిన ప్రకారం వివరాలు.. మహారాష్ట్రకు చెందిన దంపతులు రాహుల్ సూర్యవంశీ, మీనా సూర్యవంశీ గోపన్‌పల్లిలో జర్నలిస్ట్ కాలనీని ఆనుకొని ఉన్న వివేకానందనగర్ (60 గజాల సైట్)లో నివాసం ఉంటున్నారు. వీరికి నితేష్ (6), రూపేష్ కవల కుమారులతో పాటు కూతురు స్నేహ ఉన్నారు. రాహుల్ కన్సాలిడేటెడ్ కన్స్ట్రక్షన్ కంపెనీలో సీనియర్ అకౌంటెంట్‌గా పని చేస్తున్నాడు. గచ్చిబౌలి కేంద్రీయ విద్యాలయంలో రెండో తరగతి చదువుతున్న నితేష్ ఆన్లైన్ క్లాసులు ముగియడంతో గురువారం ఉదయం 11 గంటల సమయంలో ఇంటి ఎదురుగా ఉన్న ప్లాట్ నంబర్ 125 గేటుకు వేలాడుతూ ఆడుకుంటున్నాడు. దిమ్మె కూలడంతో ఒక్కసారిగా ఇనుప గేటు మీద పడింది. దీంతో బాలుడి తల, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. కూలిన శబ్దం విని తల్లి మీనా పరుగున వెళ్లి ఇరుగుపొరుగువారి సహాయంతో బయటకు తీశారు. వెంటనే ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. పరీక్షించిన వైద్యులు నితేష్ అప్పటికే మృతి చెందినట్లు చెప్పారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కరోనా ప్రతాపం: ఆట పాటలకు టాటా!
సాక్షి, సిటీబ్యూరో: మెరుపు మెరిస్తే.. వాన కురిస్తే.. ఆకాశంలో హరివిల్లు విరిస్తే.. అవి తమ కోసమేనని ఆనందించే పిల్లలు సెకండ్‌వేవ్ కరోనా విజృంభణ నేపథ్యంలో ఆటపాటలకు వీడ్కోలు పలికారు. ఉరకలెత్తే ఉత్సాహానికి ఫుల్స్టాప్ పెట్టారు. క్రీడా మైదానాలు బోసిపోయి కనిపిస్తున్నాయి. కాలనీలు, పార్కుల్లో సందడి లేకుండాపోయింది అపార్ట్మెంట్లు, విల్లాలు అప్రకటిత స్వీయ కర్ఫ్యూ విధించుకున్నాయి. ఆట పాటలతో, ఆనందోత్సాహాలతో గడిపే చిన్నారులు మరోసారి నాలుగు గోడల్లో బందీ అయ్యారు. కొద్దిరోజుల క్రితం బడులకు పరుగులు తీసిన పిల్లలు ఇప్పుడు తిరిగి ఇళ్లకే పరిమితమయ్యారు. కోవిడ్ మహమ్మారి ఈసారి పిల్లలను సైతం వదలడంలేదు. కరోనా ఈసారి పిల్లలపైనా ప్రతాపం చూపుతోంది. గత ఏడాది చిన్నారులపై కోవిడ్ ప్రభావం పెద్దగా కనిపించలేదు. స్కూళ్లు, కాలేజీలు లేకపోవడం, ఇళ్లకే పరిమితం కావడంతో పిల్లలు పెద్దగా వైరస్ బారిన పడలేదు. బయటకు వెళ్లి వచ్చే తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల నుంచే ఎక్కువగా పిల్లలకు వైరస్ వ్యాప్తి చెందింది. అదే సమయంలో తల్లిదండ్రులు చాలావరకు జాగ్రత్తలు తీసుకోవడంతో చిన్నారులు పెద్దగా వైరస్ బారిన పడలేదు. కానీ ఈసారి అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. పిల్లలు, పెద్దల రాకపోకలు బాగా పెరిగాయి. పెద్దవాళ్లతో కలిసి షాపింగ్‌కు వెళ్లడం, సినిమాలు, టూర్లు, పండగలు, వేడుకల్లో పాల్గొనడంతో చాలాచోట్ల పిల్లలు సైతం వైరస్ బారిన పడ్డారు. మూడు నెలలకుపైగా పిల్లలు స్కూళ్లకు వెళ్లారు. ఈ క్రమంలో మహమ్మారి చిన్నారులపై ప్రభావం చూపింది. గ్రేటర్ పరిధిలో గత ఏడాది డిసెంబర్ నాటికి 15 ఏళ్లలోపు పిల్లలు కేవలం 10 శాతం వైరస్‌కు గురి కాగా, ఈ నెలలో ఇప్పటి వరకు 27 శాతం మందికి వైరస్ సోకినట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఫిబ్రవరిలో తక్కువగా ఉన్న కోవిడ్ కేసులు మార్చిలో భారీగా పెరిగాయి. గత శనివారం ఒక్కరోజే 13 శాతం వరకు పిల్లల కేసులు నమోదయ్యాయి. 30 నుంచి 40 ఏళ్ల వయసువారు ఈసారి ఎక్కువగా వైరస్ బారిన పడుతుండగా ఆ తర్వాత స్థానంలో పిల్లలే ఉంటున్నట్లు సమాచారం. ఈ నెల 16న ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం 21 నుంచి 30 ఏళ్ల వారు, ఆ తర్వాత 30 నుంచి 40 ఏళ్లవారు 21.6 శాతం చొప్పున ఉంటే 11 నుంచి 20 ఏళ్లలోపువారు 10.3 శాతం వరకు వైరస్‌కు గురి కావడం గమనార్హం. 11 ఏళ్లలోపు పిల్లలు 2.7 శాతం వరకు ఉన్నారు. పెద్దవాళ్లతో పోల్చుకుంటే పిల్లల సంఖ్య చాలా తక్కువే అయినా గతేడాది కంటే ఎక్కువ కావడం గమనార్హం. ఇప్పటికే నగరంలో అనేక చోట్ల అపార్ట్మెంట్లు, విల్లాల్లోకి బయటి వారిని అనుమతించడంలేదు. కొన్ని చోట్ల ‘తమ ఇంటికి రావద్దని, తాము సై తం ఎవరి ఇళ్లకే వెళ్లబోమని’ మర్యాదపూర్వకమైన బోర్డులను ఏర్పాటు చేస్తున్నారు. పిల్లలను అపార్ట్మెంట్ కారిడార్లలోకి కూడా రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీంతో నిన్నా మొన్నటి దాకా స్నేహితులతో గడిపిన చిన్నారులు ఇప్పుడు ఒంటరిగా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. -
పనివాడితో పిల్ల ఏనుగు పోట్లాట..ఎవరు గెలిచారో?
జంతువులు చిన్న వయసులో ఉన్నప్పుడు ఎంత ముద్దొస్తాయో అవి చేసే చిలిపి పనులు కూడా అంతే ముద్దుగా ఉంటాయి. అవి పేరకే జంతువులు గానీ మనలో ఒకరిగి ఇమిడిపోయి జీవిస్తుంటాయి. మనతో పోట్లాడేందుకు, మనతో ఆడుతూ, మన ఆహారం లాక్కునేందుకు పోటీ పడుతూ.. ఇలా అవి చేసే ప్రతీ పని మనకు ఎంతో ఉల్లాసానిస్తుంటాయి. మన ఇళ్లలో పెంపుడు జంతువులను పెంచుకునే వాళ్లకు ఇదంతా అనుభవం ఉంటుంది. ఇలాంటి చిలిపి పనులు చేస్తున్న ఓ గున్న ఏనుగు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఎన్‌క్లోజర్‌లో పనిచేసే కార్మికుడిని ఓ గున్న ఏనుగు సరదాగా ఆటపట్టించింది. అతనితో మజాక్లు చేస్తూ, ఆ కార్మికుడిని పనిచేయనీకుండా అడ్డుకుంది. అన్ని చేస్తూ మళ్లీ తనకి ఏమీ తెలీదు నేను తల్లిచాటు పిల్లనంటూ పెద్ద ఎనుగు వెనకాలే నక్కింది. ఇలా ఆ పనివాడితో కాసేపే సరదాగా పోట్లాడుతూ, కిందపడేసి రెజ్లింగ్‌లో మాదిరిగా ఆతనిపై కాసేపు ఉండిపోయింది. చివరకు నేనే గెలిచానోచ్.. అంటూ పనివాడి పైనుంచి పైకి లేచింది. ఈ ముద్దొచ్చే వీడియోను గన్నుప్రేమ్ అనే వ్యక్తి ట్విట్టర్లో పోస్ట్ చేశారు.ఈ వీడియో పోస్ట్ చేసిన కొద్ది సేపటికే 93 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. 11 వేలకుపైగా లైక్స్ వచ్చాయి. ఈ వీడియోను చూసిన పలువురు నెటిజన్లు ‘సో క్యూట్ గన్నూ’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ( చదవండి: ‘వావ్.. నేను ఇంత అందంగా ఉంటానా’ ) Affectionate Gannu wants to play with Hooman, but he is busy working Who will win? 🤭😝 pic.twitter.com/OFkr72FGKc — Gannuprem (@Gannuuprem) April 8, 2021 -
ఒక తల్లి పాము..70 పిల్ల పాములు..
నెల్లికుదురు: మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మునిగలవీడు గ్రామం దొమ్మరిగడ్డ వాడలో ఆదివారం పాములు కలకలం రేపాయి. మహ్మద్ మైబెల్లి ఇంటి పక్కన కొంత మంది పిల్లలు ఆడుకుంటున్నారు. ఈక్రమంలో వారు, వారికి పక్కనే ఉన్న రాతి కట్టడం వద్ద ఒక పాము కనిపించింది. వెంటనే పిల్లలు భయంతో కేకలు వేశారు. వారి అరుపులు విని స్థానికులు అక్కడికి చేరుకున్నారు. వారు పాము కనిపించిన విషయాన్ని చెప్పారు. దీంతో , ఆ చుట్టుపక్కల గాలించారు. వారికి ముందుగా ఒక తల్లిపాము కనిపించింది. ఆ వెంటనే.. ఒకటి దాని వెనుక మరొకటి దాదాపు 70 పాములు బయటపడ్డాయి. భయపడిపోయిన గ్రామస్థులు వాటిని కట్టేలతో కొట్టి చంపేశారు. -
కట కట అని కొరికేశాడా...
-
వైరల్ : తల్లి వద్దనుకుంది.. డాక్టరే అన్నీ అయి
-
వైరల్ : రెండు ముఖాల పిల్లి.. తల్లి వద్దన్నా
రెండు ముఖాలతో పుట్టిన నాలుగు నెలల పిల్లి తన సోదరులతో కలిసి ఆడుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. కాలిఫోర్నియాకి చెందిన డాక్టర్ రాల్ఫ్ ట్రాన్ చెందిన క్లినిక్‌లో ఒక పిల్లి నాలుగు నెలల క్రితం పిల్లలకు జన్మనిచ్చింది. అందులో ఒక్కటి మాత్రం మిగతావాటి కంటే బిన్నంగా రెండు ముఖాలతో పుట్టడంతో తల్లి దానిని దగ్గరికి కూడా రానివ్వలేదు. ఈ నేపథ్యంలో డాక్టర్ దానిని పెంచుకోవాలనుకొని భావించి ఇంటికి తీసుకొచ్చాడు. దానికి డుయో అని పేరు పెట్టాడు. కాగా, ఆ పిల్లి డిప్రోసోపస్, క్రానియోఫేషియల్ డూప్లికేషన్ అనే అరుదైన లోపం ఉన్నట్లు డాక్టర్ తెలిపారు. ఇది పుట్టుకతోనే వచ్చే లోపం అని శరీర అవయవాలు అన్నీ ఒకటిగా ఉన్నా ముఖాలు మాత్రం రెండుగా ఉంటాయి. అయితే ముక్కు,నోరు మాత్రం యధావిధిగా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. తాజాగా రాల్ఫ్ ట్రాన్ ... డుయో తన సోదరులైన టైనీ టూనా, డాబీలతో కలిసి ఆడుకుంటున్న ఫోటోలతో పాటు వీడియోనూ ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేశారు. అంతే అది చూసిన ప్రతీ ఒక్కరూ డాక్టర్ చేసిన పనికి మెచ్చుకుంటున్నారు. 'వికృత రూపంతో పుట్టిన ఆ పిల్లిని తల్లి కాదన్న మీరు దానిని చేరదీసి ఆరోగ్యవంతంగా తయారు చేశారంటూ' పలువురు నెటిజన్లు ప్రశంసించారు. 'డుయో పుట్టినప్పుడు బరువు తక్కువగా ఉండడంతో అది ఎక్కువ రోజులు బతకదేమో అనుకున్నా. జన్మనిచ్చిన తల్లి కాదన్న ఎలాగైనా బతకాలన్న ఆ పిల్లి పట్టుదల, మనోస్థైర్యమే ఈరోజు దానిని ఆరోగ్యవంతంగా మార్చిందని' డాక్టర్ రాల్ఫ్ ట్రాన్ పేర్కొన్నారు. -
ఆడుకుంటూ.. అనంతలోకాలకు..
సాక్షి, పెందుర్తి: పాఠశాల ఆవరణలో ఆడుకుంటున్న విద్యార్థి అకస్మాత్తుగా అపస్మారక స్థితికి వెళ్లిపోయి మృతి చెందిన ఘటన పెందుర్తి సమీపంలోని పాపయ్యరాజుపాలెంలో చోటుచేసుకుంది. ఫిట్స్ కారణంగా విద్యార్థి మరణించినట్లు వైద్యులు నిర్థారించారు. అయితే అనారోగ్యానికి గురైన తమ బిడ్డను ఆసుప్రతికి తరలించడంతో పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం వహించిందని ఆరోపించగా... తాము సకాలంలోనే స్పందించి తల్లిదండ్రులకు సమాచారం అందించామని పాఠశాల యాజమన్యం చెబుతుంది. ఈ విషాద ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వారణాసి జిల్లాకు చెందిన పంచం సతీష్, సుమిత్ర దంపతులు 2002లో విశాఖ వచ్చి పాపయ్యరాజుపాలెంలో స్థిరపడి అక్కడే టైల్స్ వ్యాపారం చేసుకుంటున్నారు. వీరికి హితేష్(13), శుభం అనే ఇద్దరు కుమారులు. పిల్లలిద్దరూ ఇంటికి సమీపంలో ఉన్న ఆక్స్ఫర్డ్ పాఠశాలలో చదువుతున్నారు. ప్రస్తుతం హితేష్ 8వ తరగతికి వచ్చాడు. కాగా సోమవారం ఆటల సమయంలో పాఠశాల ఆవరణలో హితేష్ తోటి పిల్లలతో క్రికెట్ ఆడుతున్నాడు. కాసేపటికే తీవ్ర అస్వస్థతకు గురై కుప్పకూలిపోయాడు. విషయాన్ని గమనించిన తోటి విద్యార్థులు పాఠశాల ఉపాధ్యాయులకు చెప్పగా వారు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. బాలుడిని గోపాలపట్నంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే హితేష్ మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. రాజుకున్న వివాదం మరోవైపు హితేష్ మరణంపై వివాదం రాజుకుంది. పాఠశాల యాజమాన్యం సకాలంలో స్పందించి ఉంటే తమ బిడ్డ బతికేవాడని తల్లిదండ్రులు ఆరోపించారు. పాఠశాల వద్దకు విద్యార్థి మృతదేహాన్ని తీసుకొచ్చి ఆందోళన చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో పెందుర్తి సీఐ వెంకునాయుడు ఆధ్వర్యంలో పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దారు. ఈ ఘటనపై పాఠశాల కరస్పాండెంట్ చంద్రశేఖర్‌రెడ్డి స్పందిస్తూ విద్యార్థి మృతికి తమ నిర్లక్ష్యం కారణం కాదని స్పష్టం చేశారు. విషయం తెలిసిన వెంటనే ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. -
ఆతిథ్య జట్టుతో ఆడటం సవాలే
స్పష్టమైన ఫేవరెట్ లేకుండా నాకౌట్ పోరు మొదలైంది. ఈ దశలో ఆట ఎప్పటికప్పుడు మారుతుంది. అయితే ఇక్కడ కొన్ని మ్యాచ్‌ల్లో విజేతలెవరో అంచనాకు రావొచ్చు. రష్యా కంటే స్పెయిన్, డెన్మార్క్ కంటే క్రొయేషియా మెరుగైన జట్లు కాబట్టి ఆ రెండు జట్లకు గెలిచే అవకాశాలుంటాయి. ఈసారి జర్మనీలాగే... 2010 చాంపియన్ స్పెయిన్ కూడా నాలుగేళ్ల క్రితం లీగ్ దశలోనే కంగుతింది. దీనికి కారణాలు కూడా ఒకలాగే ఉన్నాయి. విజేతలుగా నిలిచిన సమయంలో అనుభవజ్ఞులు బాగా ఆడారు. ఇప్పటి స్పెయిన్‌లో కొత్తగా వచ్చిన వాళ్లు చాలా ప్రతిభావంతులు. తాజా ఆలోచనలు... భిన్నమైన గేమ్ప్లాన్లతో దేనికైనా సిద్ధంగా ఉన్నారు. ఇదే స్పెయిన్ జట్టును టాప్ గేర్‌లో దూసుకెళ్లెలా చేయొచ్చు. అలాగే... అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగిన రష్యా ఆట కూడా చూడముచ్చటగా ఉంది. ఈ జట్టు తమదైన రోజు మేటి జట్లను ఘోరంగా దెబ్బతీస్తుంది. ప్రతిభపరంగా రష్యా మేటి జట్లకు దీటుగానే ఉంది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలిచి నాకౌట్ బెర్తును ఖాయం చేసుకుంది. చివరి మ్యాచ్‌లో ఉరుగ్వేతో ఎదురైన పరాజయం రష్యాను నిరాశపరిచి ఉండొచ్చు... కానీ లుజ్నికి స్టేడియంలో ఆతిథ్య జట్టుతో మ్యాచ్ ఎలాంటి ప్రత్యర్థికైనా క్లిష్టమే! మరో మ్యాచ్ విషయానికొస్తే క్రొయేషియా పటిష్టమైన జట్టు. మోడ్రిక్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అనుభవం, నైపుణ్యంతో ఈ జట్టు అదరగొడుతోంది. డెన్మార్క్‌ను ఓడించే సత్తా క్రొయేషియాకు ఉంది. -
చెయ్యి తిరిగింది
ఒక బాలుడు నది సమీపంలో ఆడుకుంటున్నాడు. ఆ ఇసుక ప్రదేశంలో పొడవాటి గెడ్డం ఉన్న ఒక వృద్ధుడు కూర్చొని ఉన్నాడు. బాలుడు ఆ వృద్ధుడి దగ్గరకు వెళ్లాడు. వెళ్లేటప్పటికి, వృద్ధుడు ఇసుకలో ఒక పెద్ద వలయాన్ని గీస్తూ కనిపించాడు. బాలుడు ఆశ్చర్యపోయాడు. అంత పెద్ద వలయాన్ని వంకర్లు లేకుండా, చక్కగా, గుండ్రంగా భలే గీశాడు వృద్ధుడు. ‘‘ఓ పెద్దాయనా.. ఇంత చక్కగా ఎలా గీశావు’’ అని బుగ్గ మీద వేలు పెట్టుకుని అడిగాడు బాలుడు. వృద్ధుడు బాలుడి వైపు చూశాడు. ‘‘ఎలా గీశానో నాకూ తెలీదు. గీస్తూ, గీస్తూ, గీస్తే ఉంటే చివరికి ఇలా వచ్చింది’’ అని చెప్పాడు. ‘నువ్వూ గియ్యొచ్చు.. ఇంత చక్కగా’’ అని చెప్పి, చేతిలోని కర్రపుల్లను ఆ బాలుడికి ఇచ్చి వృద్ధుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. బాలుడు ఆ కర్రపుల్లతో ఇసుకలో వలయం గియ్యడం మొదలుపెట్టాడు. వంకర టింకరగా వచ్చింది. మళ్లీ గీశాడు. మళ్లీ అంతే. అలా గీస్తూనే ఉన్నాడు. ఎన్నిసార్లు గీసినా వృద్ధుడు గీసినంత కచ్చితంగా వృత్తాకారం రావడం లేదు. ఏళ్లు గడుస్తున్నాయి. ఓ రోజు ఉదయం నదికి వచ్చి ఎప్పటిలా వృత్తం గీశాడు. సరిగ్గా వచ్చింది! ఎక్కడా వంకర లేదు. వంపు లేదు. ఎక్కువ తక్కువ లేదు. అప్పుడే వెనుక నుంచి ఓ గొంతు వినిపించింది. ‘‘ఓ పెద్దాయనా! ఇంత కచ్చితంగా వలయాన్ని ఎలా గీశావు?’’ అని. మానవ సృష్టిలో కొన్ని అద్భుతాలు ఉంటాయి. అవన్నీ కూడా ఏళ్ల సాధనతో సాధ్యం అయినవే. అదేవిధంగా, దీర్ఘకాల సాధన అనేది.. ఏమీ తెలియని మనిషిని కూడా నిష్ణాతుడిని చేస్తుంది. కొత్త తరాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతుంది. అనుకరణకు ప్రేరేపిస్తుంది. ఇదొక సాధన వలయం. -
దేశం గర్వించే క్రీడాకారులుగా ఎదగాలి
అంబాల (కమలాపూర్) : విద్యార్థులు క్రీడల్లో రాణించి దేశం గర్వించే స్థాయికి ఎదగాలని జెడ్పీటీసీ సభ్యుడు మారపెల్లి నవీన్‌కుమార్ అన్నారు. మండలంలోని అంబాల జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ఈనెల 1 నుంచి నిర్వహించనున్న మండల స్థాయి పాఠశాల క్రీడోత్సవాలు శనివారంతో ముగిశాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడా పోటీలు విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాలను వెలికి తీస్తాయన్నారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ రవి, ఎంపీటీసీ రమేశ్, క్రీడా సమాఖ్య చైర్మన్, ఎంఈవో రాంకిషన్‌రాజు, వైస్ చైర్మన్ రాంరెడ్డి, కన్వీనర్ రాజేందర్, హెచ్ఎంలు రాజయ్య, జయప్రకాశ్, పవన్‌కుమార్, టీఆర్ఎస్ నాయకులు పింగిలి ప్రదీప్‌రెడ్డి, సత్యం, వ్యాయామ ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
తలలుపట్టుకున్న మలేషియా అధికారులు!
కౌలాలంపూర్: మొబైల్ గేమ్ 'పోకిమన్ గో' ఫివర్‌తో ఇప్పుడు మలేషియా ఊగిపోతోంది. అక్కడ రెండు రోజుల క్రితమే ఈ గేమ్‌ను లాంచ్ చేశారు. అయితే.. అప్పటికే ఆశగా ఎదురుచూస్తున్న మలేషియా వాసులు పెద్ద సంఖ్యలో తమ ఫోన్లలో ఈ గేమ్ డౌన్లోడ్ చేసుకొని రోడ్లమీద పడ్డారు. దీంతో.. పలు దేశాలు ఇప్పటికే ఈ గేమ్ విషయంలో ఆందోళన చెందుతుండగా.. ఇప్పుడు మలేషియా అధికారులు సైతం తలలుపట్టుకుంటున్నారు. ఫోన్లలో తలదూర్చి రోడ్లమీద ఈ గేమ్ ఆడుతూ..ప్రజలు కోరి ప్రమాదాలు తెచ్చుకుంటున్నారని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, వాహనాలు నడుపుతున్న సమయంలో డ్రైవర్లు కూడా ఈ గేమ్ ఆడుతుండటం పట్ల ఆందోళన వ్యక్తమౌతోంది. పోకిమన్ గో ఆడుతూ కారు నడుపుతున్న ఓ వ్యక్తికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ గేమ్ ఆడుతూ డ్రైవింగ్ చేయొద్దంటూ సోమవారం స్వయంగా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ తియోంగ్ లై ప్రజలను కోరారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ముస్లిం మతపెద్దలు సైతం ఈ గేమ్ విషయంలో అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేశారు. -
రైతుల జీవితాలతో సర్కారు చెలగాటం
జీఓ నంబర్ 271ని రద్దు చేయాలి రెతుల రౌండ్‌టేబుల్ సమావేశం డిమాండ్ భూ యాజమాన్య హక్కులకు చేటని ఆందోళన అమలాపురం రూరల్ : ‘భూమి మీద యాజమాన్య హక్కులను కాలరాసే జీఓ: 271ని నిలుపుదల చేయాలి. పట్టాదారు పాస్‌పుస్తకాలు, టైటిల్ డీడ్ల విధానం కొనసాగించి, 1బి రికార్డుల్లో తప్పులు సవరించాకే అమలు చేయాలి’ అని అఖిలపక్షాలు, రైతు సంఘాల ప్రతినిధులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈదరపల్లి జనహిత కార్యాలయంలో భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా అధ్యక్షుడు దొంగ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో గురువారం జీఓ :271పై జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో అధికార టీడీపీ, బీజేపీ, వైఎస్సార్ కాంగ్రెస్, సీపీఐ, కాంగ్రెస్ పార్టీలతోపాటు బీకేఎస్, కోనసీమ రైతు పరిరక్షణ సమితి, అఖిలభారత రైతు కూలీ సంఘం, పలు రైతు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. పట్టాదారుపాస్ పుస్తకాలను, టైటిల్ డీడ్ విధానాన్ని రద్దు చేసి, కొత్తగా ఇచ్చిన జీఓ :271 ప్రకారం వెబ్‌ల్యాండ్‌లో ఉంచిన 1బి ఆధారంగా మాత్రమే భూమిహక్కుల బదలాయింపు చేయడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతారని ముక్తకంఠంతో చెప్పారు. వెబ్‌ల్యాండ్ రికార్డుల్లో రైతుల పేర్లు, సర్వే నంబర్లు తప్పుగా ఉన్నాయని, దీని వల్ల బ్యాంకు రుణాలతోపాటు తనఖాల్లో ఇబ్బందుల పాలవుతారని అన్నారు. కొత్త భూ వివాదాలకు ఆస్కారం.. నీటి వినియోగదారుల సంఘం రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి కొవ్వూరి త్రినాథ్‌రెడ్డి మాట్లాడుతూ వెబ్‌ల్యాండ్ ఆధారంగా రిజిస్ట్రేషను చేస్తే భూమి యజమానికి తెలియకుండా అమ్మకాలు జరిగే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. వెబ్‌ల్యాండ్‌లో ఉన్న తప్పులను ఆధారాలతో సహా చూపించారు. బీకేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెల్లాపు సూర్యనారాయణ మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతోందన్నారు. ఈ జీఓల వల్ల రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మాత్రమే లాభం జరుగుతుందని ఆరోపించారు. పార్టీలకు అతీతంగా పోరాడాలి.. వైఎస్సార్ సీపీ జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు జున్నూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రైతులు పార్టీలకు అతీతంగా ఈ సమస్యలపై పోరాడాలన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు ఆర్.వి.నాయుడు మాట్లాడుతూ శాంతి యుతంగా సమావేశాలు పెట్టుకుంటే అడ్డుకోవడం దారుణమన్నారు. పీసీసీ సభ్యుడు కల్వకొలను తాతాజీ ప్రభుత్వం స్వప్రయోజనాల కోసమే రోజుకో జీఓ తెచ్చిందన్నారు. బీకేఎస్ రాష్ట్ర కార్యదర్శి ముత్యాల జమ్మి భూ రికార్డులు సర్వే చేశాకే 1బి అమలు చేయాలని డిమాండ్ చేశా రు. బీకేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉప్పుగంటి భాస్కరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి యాళ్ల వెంకటానందం, కోనసీమ రైతు పరిరక్షణ సమితి అధ్యక్షుడు యాళ్ల బ్రహ్మానందం, మాజీ అధ్యక్షుడు రంబాల బోసు, రైతు సంఘం ప్రతిని ధులు అడ్డాల గోపాలకృష్ణ, తిక్కిరెడ్డి గోపాలకృష్ణ, వివిధ పార్టీలకు చెందిన పెయ్యిల శ్యామ్‌ప్రసాద్, చెల్లుబోయిన కేశవశెట్టి, చిక్కం బాలయ్య, పత్తి దత్తుడు పాల్గొన్నారు. -
సాధన.. శోధన.. వికాసం... విజ్ఞానం
తైత్తిరీయోపనిషత్తు కృష్ణయజుర్వేదం తైత్తరీయ ఆరణ్యకానికి చెందినదే ఈ ఉపనిషత్తు. ఆరణ్యకంలోని చివరి మూడు ఖండాలను (ఏడు, ఎనిమిది, తొమ్మిది) ైతె త్తరీయోపనిషత్తు అంటారు. ఇది శిక్షావల్లి, ఆనందవల్లి, భృగువల్లి అనే మూడు అధ్యాయాలుగా ఉంది. మొదటి అధ్యాయం శిక్షావల్లిలో పన్నెండు అనువాకాలు ఉన్నాయి. ఇది గురుశిష్య సంబంధానికి, పఠనానికీ, బోధనకూ, వ్యక్తిత్వ వికాసానికీ, సాధనకూ, శోధనకూ పనికి వచ్చే ఎన్నో సూచనలు చేసే సుప్రసిద్ధమైన ఉపనిషత్తు. ఓం సహనావవతు! సహనౌ భునక్తు! సహవీర్యం కరవావహై తేజస్వినావ ధీతమస్తు మా విద్విషావహౌ ఓం శాంతిశ్శాంతిశ్శాంతిః (గురుశిష్యులమైన మా ఇద్దరినీ పరమాత్మ రక్షించుగాక! కలిసి భుజింతుము గాక! కలిసి వీరోత్సాహంతో అధ్యయనం చేయుదుముగాక! ఇద్దరమూ తేజోవంతులు అగుదుముగాక! మా ఇద్దరికీ ద్వేషం లేకుండుగాక !) ఈ అనువాకం ప్రార్థనగా పిల్లలూ, పెద్దలూ అందరూ చేస్తూ ఉంటారు. దీనిలో శిక్షావల్లి ప్రారంభం అవుతోంది. శిక్షను వైదిక సంస్కృతంలో ‘శీక్షా’ అంటారు. శిక్ష అంటే విద్యాభ్యాసం. అక్షరం, స్వరం, హ్రస్వదీర్ఘఫ్లుతాలు, స్పష్టమైన ఉచ్చారణ ఎలా ఉండాలో దీనిలో వివరిస్తారు. ఇది ప్రాథమిక విద్య. శరీరంతో సాధించేది. మానవుడు తనకు ఉన్న అయిదు అనుబంధాలను గురించి తెలుసుకోవాలి. అవి అధిలోకం (ప్రపంచజ్ఞానం) అధి జ్యోతిష్యం (విశ్వతేజస్సు), అధివిద్యామ్ (విద్యాభ్యాసం) అధిప్రజమ్ (సంతానాన్ని కనటం) అధ్యాత్మమ్ (వేదోపనిషత్తులతో ఆత్మజ్ఞానాన్ని పొందటం) ఇది వ్యక్తిత్వ వికాసంతో కూడిన సంపూర్ణ విద్య. భూమి, ఆకాశాలను కలిపే అంతరిక్షాన్ని, వాయువును గూర్చి తెలుసుకుని ప్రపంచజ్ఞానాన్ని పొందాలి. అగ్ని, సూర్యుడు, వారిని కలిపే నీరు, మెరుపులను గమనించి విశ్వతేజస్సును తెలుసుకోవాలి. గురువు, శిష్యుడు విద్యలను కలిపే ప్రవచనం ద్వారా విద్యావంతులు కావాలి. తల్లి, తండ్రి, సంతానం ఏర్పడే సంయోగం ద్వారా పునరుత్పత్తి జరుగుతోందని తెలుసుకోవాలి. కింది దవడ, పై దవడ, నాలుక కదలికల వల్ల వాక్కు పుడుతోందని తెలుసుకుని ఈ శరీరం ద్వారా ఆత్మను గురించి తెలుసుకోవాలి. ఈ విధంగా తెలుసుకున్నవాడు మంచి సంతానాన్ని, పశుసంపదను, బ్రహ్మవర్ఛస్సును, అన్నోదకాలను, స్వర్గాది ఉత్తమ లోకాలను పొందుతాడు. ఆచార్యుని ఆకాంక్ష, మనోభావాలు ఇలా ఉన్నాయి. పరమాత్మ జీవుల హృదయాకాశంలో ఉంటాడు. ఆత్మనాశనం లేకుండా ప్రకాశిస్తూ ఉంటుంది. నోటిలోని కొండనాలుక ద్వారా పరమాత్మను తెలుసుకోవచ్చు. దాని నుండి ఒకనాడి కపాలంలోకి పోతోంది. ఓం భూః, భువః, సువః, మహః అనే నాలుగు వ్యాహృతులనూ (పేర్లు) ఏకాగ్రతతో ధ్యానించడం వల్ల అగ్ని, వాయువు, సూర్యుడు, పరమాత్మలతో లీనమై పరబ్రహ్మమౌతాడు. ఆకాశం శరీరంగా, సత్యం ఆత్మగా, ఆనందం మనస్సుగా, శాంతితో అమృతమూర్తిగా పరిపూర్ణుడు అవుతాడు. ధ్యానమే సరైన మార్గం. సమస్త శబ్దజాలానికీ ప్రథమం ఓంకారం. అది మేధనూ, బ్రహ్మజ్ఞానాన్నీ, ఆరోగ్యాన్నీ, ప్రసాదించుగాక! నాలుక మధురంగా మాట్లాడుగాక! చెవులు మంచిమాటలే వినుగాక! కూడు, గూడు, గుడ్డ, నీరు, పశుసంపద నాకు లభించుగాక! సత్ప్రవర్తన గల విద్యార్థులు అన్ని దిక్కుల నుండి నా దగ్గరకు వత్తురు గాక! శమదమాది క్రమశిక్షణగల శిష్యులు నాకు లభింతురుగాక! ప్రణవరూపుడైన పరమాత్మా! నేను నీలో లీనమై పాఠాలను బోధిస్తాను. నీరు పల్లానికి పారినట్లు ఉత్తములైన బ్రహ్మచారులు నన్ను చేరుదురుగాక! భూః భువఃసువః అనే మూడు భూమి, ఆకాశం, పరలోకం. వీటిని అందరూ తలచుకుంటారు. ‘మహా చమస్యుడు’ అనే రుషి ‘మహః’ అనే నాలుగోదాన్ని కనుక్కున్నాడు. మహః అంటే పరబ్రహ్మమైన వెలుగు. భూః అంటే అగ్ని. భువః అంటే వాయువు. సువః అంటే సూర్యుడు. మహః అంటే చంద్రుడు అని ఒక నిర్వచనం చెబుతారు. చంద్రకాంతిలోని ఓషధులవల్ల జీవులు బతుకుతున్నాయి. మరోనిర్వచనం భూః= ఋగ్వేదం, భువః=సామవేదం, సువః= యజుర్వేదం. మహః= ఓంకారం. ఓంకారమే వేదాలకు మూలం. ఇంకో నిర్వచనం భూః= ప్రాణం. భువః= అపానం. సువః= వ్యానం, మహః= అన్నం. అన్నంతోనే అన్ని ప్రాణులూ జీవిస్తున్నాయి. ఆ నాలుగు నిర్వచనాలను తెలుసుకున్నవాడు పదహారు విధాలుగా జ్ఞానాన్ని పొందుతాడు. దేవతలు అతనికి ఎన్నో కానుకలు ఇస్తారు. భూమి, ఆకాశం, ఖగోళం, దిక్కులు, విదిక్కులు, ఒక విభాగం, అగ్ని, వాయువు, సూర్యచంద్రులు, నక్షత్రాలు ఒక విభాగం. నీరు, ఔషధులు, చెట్లు, ఆకాశం, ప్రపంచం ఒక విభాగంగా ఇవన్నీ బాహ్య వస్తువులు. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన వాయువులు, కన్ను, చెవి, మనస్సు, వాక్కు, స్పర్శజ్ఞానం, లోపలి చర్మం, మాంసం, నరాలు, ఎముక, మజ్జ, లోపల ఉండేవి. అయిదుగా ఉండే అంతర్బాహ్యాలు కలిపి ఒకటి అవుతాయి. సమ్మతికీ, అసమ్మతికీ, ఆరంభానికీ, ముగింపుకీ, వేదాలకు, యజ్ఞమంత్రాలకూ అన్నింటికీ ఓంకారమే ముఖ్యం. ఓంకారజపంతో పరబ్రహ్మాన్ని చేరుకుంటాడు. మానవ జీవితంలో తప్పనిసరిగా ఉండవలసినవి ఏమిటనే విషయంలో నాకమహర్షి ఏం చెప్పాడో వచ్చేవారం చూద్దాం.. - డా.పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ -
ఎడారిలో చీతాతో చిన్నోడు..
పెంపుడు జంతువులు పసిపిల్లలకు దగ్గర కావడం...పరస్పరం ప్రాణ స్నేహితుల్లా సన్నిహితంగా ఉండడం అందరికీ తెలిసిన విషయమే. కానీ ఓ చిచ్చరపిడుగు ఎడారి లో చిరుతతో చెలగాటాలాడాడు. .. సరదాగా నవ్వుతూ.. ఏదో ఓ బుజ్జి పప్పీతో ఆడుకుంటున్నంత ఈజీగా గేమ్స్ ఆడుకున్నాడు. నమ్మ బుద్ధికాకపోయినా.. ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గుర్తు తెలియని ప్రదేశంలో ఎడారినేలలో చిత్రీకరించిన ఈ వీడియోలో ఒకరినొకరు వెంటాడుకుంటూ...బెస్ట్ ఫ్రెండ్స్ లాగా మెలగడం పలువురిని ఆకట్టుకుంటోంది. అమితమైన చిరుతపులి వేగాన్ని చూసిన పిల్లవాడి తండ్రి భయపడి చటుక్కున ఆ అబ్బాయిని చేతుల్లోకి తీసుకోగా... ఈ బుడతడు నవ్వులు చిందిస్తూ దాన్ని వాటేసుకున్న ఆ అద్భుతమైన వీడియో మీకోసం... కాగా భూమి మీద వేగంగా పరుగెట్టే జంతువుల్లో చిరుతపులి ఒకటి, గంటలకు 75 కి.మీ వేగంతో దూసుకు పోవడం చీతా ప్రత్యేకత. పురాతన ఈజిప్షియన్లకు చిరుతపులి మంచి పెంపుడు జంతువుగా ఉండేది. -
మనసుశిక్షణ
ఏ ఆసనం కూడా శక్తినంతా ఉపయోగించి బలవంతంగా చేయకూడదు. మనస్సులో ఏ మాత్రం ఒత్తిడి లేకుండా మనస్సును ఫ్రీ చేసినప్పుడే శరీరం కూడా ఫ్రీ అవుతుంది. లేకపోతే శరీరం అంతా స్టిఫ్నెస్ ఉంటుంది. దీంతో శరీరంలో ఏ భాగమూ సహకరించదు. అందువల్లనే మనం శరీరంతో పనిచేస్తున్నప్పటికీ మనస్సే ప్రధానం. యోగసాధకులందరూ ఈ సత్యాన్ని గ్రహించాలి. ఏకపాద శిరాసన కాళ్లు రెండూ ముందుకు స్ట్రెచ్ చేయాలి. మోకాళ్లు భూమి నుంచి కొంచెం పైకి, మళ్లీ క్రిందకి చేస్తూ రిలాక్స్ అవ్వాలి. కాళ్లు రెండూ మడిచి ఒక అరిపాదానికి రెండవ అరిపాదాన్ని తాకించి బటర్‌ఫ్లై (సీతాకోకచిలుక) వలె మోకాళ్ళను పైకి కిందకు చేస్తూ తొంటికీలు భాగాల్ని రిలాక్స్ చేయాలి. కుడికాలుని ముందుకు స్ట్రెచ్ చేసి, ఎడమ కాలుని పైకి లేపి, ఎడమ చేతిని ఎడమ కాలు క్రిందకు తీసుకువెళ్లాలి. నెమ్మది నెమ్మదిగా కాలుని భుజం మీదకి తీసుకువెళ్తూ ఇంకా పైకి మెడ మీదకు వీలైతే ఇంకా వీపుపై భాగానికి దగ్గరగా తీసుకువెళ్లాలి. చేతులు రెండూ నమస్కార ముద్రలో జోడించాలి. ఈ స్థితిలో ఎడమతొడ వెనుక భాగం ఎడమ భుజం వెనుక భాగాన్ని తాకుతూ ఉంటుంది. తలపైకి ఎత్తి ఉంచినట్లయితే కాలు భుజం మీద నుంచి ఎట్టి పరిస్థితిలోనూ క్రిందకు జారదు. 3 లేదా 5 సాధారణ శ్వాసల తరువాత ఎడమ కాలును తిరిగి అదే క్రమంలో వెనుకకు తీసుకువచ్చి పూర్తిగా రిలాక్స్ అయి మళ్లీ రెండవవైపు కూడా చేయాలి. పై విధంగా చేయలేనివారు కాలును వీలైనంతపైకి తీసుకువెళ్లి పాదం ముందు భాగాన్ని నుదురుకి దగ్గరగా లేదా యింకా కొంచెంపైకి తీసుకువెళ్ళి మడమను తలపైన ఆనించే ప్రయత్నం చేయవచ్చు. ఒక నిర్ధిష్టమైన ఆసనంలో పురోగతి మనం చేసే సాధనను బట్టి, తీసుకునే ఆహారాన్ని బట్టి ఉంటుంది. నోట్: ఈ ఆసనం తర్వాత రెండు కాళ్లను రెండు భుజాల మీద పెట్టుకున్నట్లయితే దానిని ద్విపాద శిరాసనమని, ఆ రెండు కాళ్లని బాగా పక్కలకు స్ట్రెచ్ చేసి ఉంచినట్లయితే త్రిభాసనమని అంటారు. ఆ ఆసనాలు అందరూ చేయలేరు కనుక వాటి గురించి పూర్తి వివరణ ఇవ్వడం లేదు. ఉపయోగాలు: తొడలు, పిక్కలు బాగా సాగదీయబడతాయి. మెడ వీపు భాగాలు బలంగా తయారవుతాయి. పొట్ట భాగంలో ఉన్న కండరాలు బాగా సంకోచింపబడతాయి కనుక జీర్ణశక్తి పెరుగుతుంది. ప్రసారిత ఉభయ పాదాంగుష్టాసన ఈ ఆసనం సాధన చేయడానికి ముందు వీపు మీద ముందుకు పశ్చిమోత్తనాసనం మాదిరి వెనుకకు, హలాసనం లాగా రోల్ అవ్వాలి. దీని వలన వెన్నెముకకు మంచి టోనింగ్ జరిగి ప్రిపరేటరీగా పనిచేస్తుంది. ఆ తరువాత రెండు చేతులతో రెండు కాలి బొటనవేళ్లను పట్టుకుని (ముందు మోకాళ్లు వంచే ఉంటాయి) పాదాలు రెంటినీ నెమ్మదిగా కలిపి ఉంచి మోకాళ్లు క్రమంగా నిటారుగా చేసుకుని పిరుదులు (హిప్స్) మీద బ్యాలెన్స్ చేస్తూ కూర్చోవాలి. దీనిని ఉభయ పాదాంగుష్టానాసమని పిలుస్తారు. అదే బ్యాలెన్స్ మెయింటెయిన్ చేస్తూ క్రమంగా రెండు కాళ్లను పక్కలకు విడదీస్తూ అదే స్ట్రెచ్ మెయింటెయిన్ చేయడానికి ప్రయత్నించాలి. కాళ్లు పక్కకు స్ప్లిట్ చే సి, స్ట్రెచ్ చేయడం వల్ల ఇది ప్రసారిత ఉభయ పాదాంగుష్టాసనమని పిలుస్తారు. అలా కూర్చొని బ్యాలెన్స్ చేయలేని ప్రారంభ సాధకులు గోడకి ఆనుకొని కూర్చొని సాధన చేయవచ్చు. ఉపయోగాలు తొడ కీలు భాగాలు ఓపెన్ అవ్వడానికి, పెల్విక్ ప్రాంతం ఓపెన్ అవ్వడానికి మంచిది. ప్రీ నేటల్ యోగాలో ఇది ఒక ముఖ్యమైన ఆసనం. సమన్వయం ఎస్. సత్యబాబు సాక్షి ప్రతినిధి బకాసన బకము అనగా కొంగ (ఛిట్చ్ఛ). నేల మీద గొంతుకి కూర్చుని అరచేతులు ముందువైపు భూమి మీద పూర్తిగా ఆనించి, మోకాళ్ళు రెండు పక్కలకు రెండు తొడల ముందు భాగంలో పక్క భాగాలకు నొక్కుతూ రెండు మోకాళ్లు, రెండు చంక భాగాలలోకి సపోర్ట్‌గా ఉంచి శ్వాస వదులుతూ తలను ముందుకు దించుతూ రెండు కాళ్లను కలిపి ఉంచి క్రమ క్రమంగా పైకి లేపు బ్యాలెన్స్ చేస్తూ పూర్తి స్థితికి రావాలి. 3-5 సాధారణ శ్వాసల తరువాత తిరిగి వెనక్కి రావాలి. కొత్త సాధకులు ఒక స్టూలుని కాళ్ల కింద ఉంచుకుని లేదా కుర్చీ ఆధారంగా చేసుకొని ప్రయత్నం చేయవచ్చు. శరీరాన్ని బ్యాలెన్స్ చేయడం మీద పట్టు సాధించడమే ఈ ఆసంలోని విశేషత. ఉపయోగాలు: డెల్టాయిడ్, ట్రెపీజియస్ కండరాలు, బెసైప్స్ ట్రైసెప్స్ బలంగా అవడానికి ఉపయోగపడుతుంది. శరీరాన్ని బ్యాలెన్స్ చేయడం ద్వారా మనస్సుకి ఏకాగ్రతా శిక్షణ ఇవ్వబడుతుంది. ఎ.ఎల్.వి కుమార్ ట్రెడిషనల్ యోగా ఫౌండేషన్ -
గట్టిగా... చెట్టులా...
వృక్షం ఎంత భారీగా ఉన్నా కాండం మీదనే నిలబడి ఉంటుంది. అదే విధంగా మనిషి కూడా శరీరాన్ని ఒకే కాలు మీద స్థిరంగా నిలిపి సాధన చేయడం ద్వారా అలాంటి స్థిరత్వాన్ని అద్భుత శక్తిని సంతరించుకోవచ్చు. అందుకే దీనిని వృక్షాసనం అంటారు. ఉపయోగాలు: వెన్నెముక తీరుకు ఉపకరిస్తుంది. ఎడమకాలి మీద చేసినప్పుడు హై బీపీకి, కుడికాలి మీద చేసినప్పుడు లోబీపీకి పరిష్కారంగా పనికివస్తుంది. పించ్ నర్వ్, సయాటికా సమస్యలను నివారిస్తుంది. వృద్ధాప్యంలో జారిపడే ఇబ్బందులను పరిహరించడానికి ఒకే కాలు మీద బ్యాలెన్స్ చేయడం చాలా ఉపకరిస్తుంది. కాలి కండరాలకు, భుజాలకు బలం చేకూరుస్తుంది. ఏకాగ్రత, సమతుల్యతకి మంచిది. గర్భవతులు తొలి ఆర్నెల్ల సమయంలో సాధన చేస్తే పెల్విక్ ప్రాంతంలో కండరాలకు వ్యాకోచం పెరిగి సుఖ ప్రసవానికి సహకరిస్తుంది. వృక్షాసనాన్ని మూడు విధాలుగా సాధన చేయవచ్చు. వృక్షాసన 1: శరీరాన్ని సమస్థితిలో నుంచి ఎడమ కాలి మీద నిలబడాలి. కుడికాలిని ముందుకు మడచి పాదాన్ని పూర్తిగా ఎడమ తొడకి పై భాగంలో కంద (జననేంద్రియానికి, గుదముకి మధ్య ఉండే ప్రాంతం)కి దిగువన ఆనించాలి. శ్వాస తీసుకుంటూ రెండు అరచేతులనూ ఆకాశంవైపు చూపిస్తూ స్ట్రెచ్ చేస్తూ పైకి తీసుకెళ్లాలి. అక్కడ అరచేతులను నమస్కార ముద్ర తరహాలో జోడించాలి. ఏదైనా శారీరక సమస్య వల్ల జోడించడం కుదరకపోతే చేతుల్ని దూరంగానే ఉంచవచ్చు. రెండు, మూడు సాధారణ శ్వాసల తర్వాత నెమ్మదిగా శ్వాస వదులుతూ అరచేతులు భూమికి అభిముఖంగా కిందకి తీసుకురావాలి. ఇదే విధంగా రెండోవైపు కూడా అంటే కుడికాలి మీద కూడా నిలబడి చేయాలి. ఒక కాలు మీద బ్యాలెన్స్ చేయలేని పక్షంలో వీపుని గోడకి సమంగా ఆన్చి నిలబడి గాని లేదా కుర్చీ ఆధారంగా చేయవచ్చు. వృక్షాసన 2 సమస్థితిలో ఉండి ఎడమకాలి మీద నిల్చోవాలి. కుడికాలిని వెనుకకు మడిచి కుడి చేతితో కుడికాలి చీలమండను పట్టుకుని శ్వాస తీసుకుంటూ ఎడమచేతిని ముందు నుంచి పైకి తీసుకువెళ్లి, పైన స్ట్రెచ్ చేస్తూ కొంచెం సేపు నిలబడాలి. రెండు మూడు సాధారణ శ్వాసలు తీసుకుని నెమ్మదిగా శ్వాస వదులుతూ ఎడమచేతిని ముందు నుంచి అలాగే కిందకు శరీరం పక్కకు తీసుకురావాలి. ఇదే తరహా రెండో వైపు కూడా చేయాలి. వృక్షాసన 3 ఎడమకాలి మీద నిలబడి, కుడికాలిని మడిచి కుడిపాదం నడుముకి ఎడమవైపు దగ్గరగా ఉంచాలి. వీలైనంతగా కటి ఎముక (పెల్విక్ బోన్)దగ్గరగా లాగాలి. శ్వాస తీసుకుంటూ కుడిచేతిని నడుం వెనుక నుండి తీసుకుని కుడిపాదాన్ని పట్టుకుని ఎడమ చేతిని నడుము నుంచి పైకి స్ట్రెచ్ చేసి రెండు మూడు సాధారణ శ్వాసలు తీసుకుని వదులుతూ ఎడమ అరచేతిని నేలవైపు చూపుతూ శరీరం పక్కగా తీసుకురావాలి. అదే విధంగా రెండోవైపుకి కూడా చేయాలి. యోగావగాహన ఆసనాలు వేసేటప్పుడు శక్తి ప్రవాహం స్థూలం నుంచి సూక్ష్మంవైపుగా పయనించాలి. అంటే మూలాధారం నుంచి సహస్రారం వైపు మన ప్రయాణం ఉండాలి. (శరీరంలో ఉన్న విభిన్న నాడీ కేంద్రాలను చక్రాలుగా ఋషులు పేర్కొన్నారు. ఆధునిక శాస్త్రం నెర్వ్ సెంటర్స్ లేదా నాడీ కేంద్రాలు అంటోంది).ఈ మూల సూత్రాన్ని అనుసరించి ఆసనాలు ఐదు రకాలుగా విభజించబడ్డాయి. అవి 1.నిలబడి చేసేవి 2.కూర్చుని చేసేవి 3.పొట్ట మీద పడుకుని చేసేవి, 4.వీపు మీద పడుకుని చేసేవి. 5) తలకిందులుగా చేసేవి. నిలబడిన స్థితిలో ఆసనాలు వేసేటప్పుడు స్పైన్ అలైన్మెంట్, కుడి ఎడమల మధ్య సమతౌల్యం, తొడ కండరాలు, పిక్కల కండరాలు బలోపేతం అవుతాయి. శరీరానికి నిలకడను, దారుఢ్యాన్ని అందిస్తుంది. మన శరీరపు బరువులో ప్రతి కిలోగ్రాముకు కనీసం 40 మి.లీ నీటిని తాగాలి. అంటే ఉదాహరణకు శరీరం బరువు 60 కిలోలు ఉన్నట్లయితే దాదాపు 2.5 లీటర్ల నీరు తాగడం అవసరం. ఆహారం తీసువడానికి ముందు, తరువాత కనీసం అరగంట వ్యవధి ఇచ్చి నీరు తాగాలి. అలా కాకపోతే ఆహారం తీసుకునే సమయంలో పొట్టలో ఉత్పత్తి అయ్యే హైడ్రోక్లోరిక్ ఆమ్లం, పెప్సిన్ వంటి గ్యాస్ట్రిక్ జ్యూసెస్ నీటితో కలిసి డైల్యూట్ అవడం వల్ల వాటిలో సాంద్రత తగ్గి జీర్ణశక్తి లోపిస్తుంది. ఆహారం తీసుకున్న అనంతరం ప్రతిసారీ కనీసం 300 మి.లీ నీరు తాగడం మంచిది.యోగ సాధన అంతిమ లక్ష్యం ఆత్మ దర్శనం. బ్రహ్మజ్ఞానం పొందడం, కైవల్యం, నిర్వాణ/నిబ్బాన, పరిశుద్ధాత్మ (హోలీ స్పిరిట్), తౌహీద్ (అల్లా)ని చేరటమే. ఎ.ఎల్.వి కుమార్ ట్రెడిషనల్ యోగా ఫౌండేషన్ -
మౌనం
ధ్యానమార్గం యోగసాధనలో ధ్యానానికి తిరుగులేని ప్రాధాన్యం ఉంది. ధ్యానం అంటే ఒకరకంగా మానసికంగా మౌనావస్థకు చేరుకోవడమే. అంటే, ధ్యానానికి మౌనమే పునాది. బహిర్గతంగానే కాదు, అంతర్గతంగా కూడా మౌనం పాటించనిదే ధ్యానం చేయడం సాధ్యం కాదు. నిరంతర యోగసాధకులైన మహర్షులు మౌనంగా ధ్యానం కొనసాగిస్తారు. మౌనం పాటించడం వల్లనే వారిని మునులు అంటారు. రోజుల తరబడి మౌనం పాటించడం లౌకిక జీవితం గడిపే సామాన్యులకు సాధ్యం కాదు. వారానికోసారి లేదా పర్వదినాల్లో, ప్రత్యేక సందర్భాల్లో సామాన్యులు కూడా మౌనవ్రతం పాటించడం మంచిదని పెద్దలు చెబుతారు. పెద్దల మాట మేరకు కొందరు లౌకిక జీవితం గడుపుతూనే, అప్పుడప్పుడు మౌనవ్రతం పాటిస్తూ ఉంటారు. ఇంతకీ మౌనవ్రతం ఎందుకు పాటిస్తారు? మౌనం వల్ల ప్రయోజనాలు ఏమిటి? అంటారా..? మౌనం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది. చిరాకు, కోపం, వేదన వంటి ప్రతికూల భావోద్వేగాలు క్రమంగా సద్దుమణిగి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ధ్యానానికి అలాంటి ప్రశాంత పరిస్థితే అవసరం. అందుకే, ధ్యాన సాధనకు ఉపక్రమించేవారు తొలుత మౌనాన్ని ఆశ్రయించాలి. -
చంద్రబాబుది రెండుకళ్ల సిద్ధాంతం
మేదరమెట్ల, న్యూస్‌లైన్ :టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుది రెండుకళ్ల సిద్ధాంతమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ నూకసాని బాలాజీ విమర్శించారు. రాష్ట్ర విభజన అంశానికి సంబంధించి తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల్లోని ఆ పార్టీ నాయకులతో రెండు రకాలుగా ఆయన మాట్లాడిస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి జైల్లో చేపట్టిన దీక్షకు మద్దతుగా మేదరమెట్ల సెంటర్లో ఆ పార్టీ నాయకులు నిర్వహిస్తున్న రిలే నిరాహారదీక్షలను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడుతూ తెలంగాణకు అనుకూలంగా టీడీపీ లేఖ ఇచ్చిందని, ఆ విషయంపై ఆ పార్టీ నాయకులు ఎవరైనా తమతో బహిరంగ చర్చకు రావచ్చని సవాల్ విసిరారు. యూపీఏ ప్రభుత్వం రాష్ట్రాన్ని విభజించాలనుకుంటే ముందుగా ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవాలన్నారు. అలాకాకుండా టీడీపీ వంటి రాజకీయ పార్టీల నాయకులతో చీకటి ఒప్పందాలు కుదుర్చుకుని ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం సరికాదన్నారు. విభజన ప్రకటన చేసే సమయంలో శ్రీకృష్ణ కమిటీ సిఫార్సులను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని బాలాజీ ప్రశ్నించారు. రాష్ట్రాన్ని విభజిస్తే రెండు ప్రాంతాల ప్రజలకు న్యాయం చేయాలని, అలా చేయలేకుంటే సమైక్యంగానే ఉంచాలని డిమాండ్ చేస్తూ గుంటూరులో వైఎస్ఆర్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ దీక్ష చేయడం గొప్ప విషయమన్నారు. జైల్లో ఉన్నప్పటికీ వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా అదే ఉద్దేశంతో దీక్ష చేపట్టడాన్ని ఆయన కొనియాడారు. సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు అందరికంటే ముందుగానే రాజీనామాలు చేశారని గుర్తుచేశారు. కాంగ్రెస్ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర విభజన ప్రకటనకు ముందే జలాలు, విద్యుత్ పంపిణీ, ఉద్యోగుల సమస్యలపై ఎందుకు చర్చించలేదని ప్రశ్నించారు. చంద్రబాబునాయుడు రాష్ట్ర విభజన అంశంపై తన వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే సీమాంధ్ర ప్రజల ఆగ్రహానికి బలికావాల్సి ఉంటుందని హెచ్చరించారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోకుంటే సోనియాగాంధీతో పాటు కాంగ్రెస్ నాయకులంతా తగినమూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. దీక్షలో వైఎస్ఆర్ సీపీ మండల కన్వీనర్ జజ్జర ఆనందరావు, మేదరమెట్ల సర్పంచ్ పేరం నాగలక్ష్మి, ఆరుమళ్ల సామ్యేలు, బొనిగల ఎలిసమ్మ, మస్తాన్, డేవిడ్సన్ కూర్చోగా, ఏఎంసీ వైస్ చైర్మన్ కోయి అంకారావు, శింగమనేని శ్రీనివాసరావు, అన్నెం అంజి రెడ్డి, రంపతోటి సాంబయ్య, కర్నాటి వెంకట్రావు పాల్గొని మద్దతు తెలిపారు. -
జాతీయ రహదారిపై విద్యార్థుల క్రికెట్
సమైక్యాంధ్రకు మద్దతుగా కశింకోటలో మంగళవారం విద్యార్థినీ విద్యార్థులు జాతీయ రహదారిపై క్రికెట్ ఆడుతూ వినూత్న నిరసన తెలిపారు. బయ్యవరం, నరసింగబిల్లి, జి.భీమవరం గ్రామాల్లో మానవహారాలు, బంద్, ర్యాలీలు జరిగాయి. కశింకోటలో ఆర్ఈసీఎస్ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. సమైకాంధ్ర వర్ధిల్లాలి, కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. విద్యార్థినులు మానవహారంగా ఏర్పడ్డారు. అనంతరం రోడ్డుపై క్రికెట్ ఆడారు. ఉపాధ్యాయ జూనియర్ కళాశాల విద్యార్థులు పడమటమ్మ ముఖద్వారం వద్ద మానవహారం నిర్వహించారు. కార్యక్రమానికి శరగడం సుదర్శనం నాయకత్వం వహించారు. నరసింగబిల్లిలో బంద్, మానవహారం నరసింగబిల్లిలో సమైక్యాంధ్రకు మద్దతుగా అఖిలపక్షం ఆధ్వర్యంలో బంద్, రాస్తారోకో, మానవహారం నిర్వహించి కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. కోన వీర వెంకట సత్యనారాయణ, జెర్రిపోతుల నూకునాయుడు, కోన సోమేష్, కోన నాగ వెంకట సురేష్‌ల ఆధ్వర్యంలో గ్రామంలో ర్యాలీ జరిపారు. కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. జి.భీమవరం గ్రామంలో విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు. అనకాపల్లి-నర్సీపట్నం మార్గంలో ఈ కార్యక్రమం జరిగింది. బయ్యవరంలో విద్యార్థులు రాస్తారోకో నిర్వహించి మానవహారంగా ఏర్పడ్డారు. -
కాంగ్రెస్ అధిష్టానం కొత్త ఎత్తుగడలు