ఎడారిలో చీతాతో చిన్నోడు.. | Unbelievable but true! Young boy filmed playing with Cheetah in desert | Sakshi
Sakshi News home page

ఎడారిలో చీతాతో చిన్నోడు..

Published Thu, Jun 16 2016 12:23 PM | Last Updated on Tue, Oct 2 2018 3:27 PM

ఎడారిలో చీతాతో చిన్నోడు.. - Sakshi

ఎడారిలో చీతాతో చిన్నోడు..

పెంపుడు జంతువులు పసిపిల్లలకు దగ్గర కావడం...పరస్పరం ప్రాణ  స్నేహితుల్లా సన్నిహితంగా ఉండడం అందరికీ తెలిసిన విషయమే. కానీ ఓ చిచ్చరపిడుగు  ఎడారి లో చిరుతతో చెలగాటాలాడాడు. .. సరదాగా నవ్వుతూ.. ఏదో ఓ బుజ్జి పప్పీతో ఆడుకుంటున్నంత ఈజీగా గేమ్స్ ఆడుకున్నాడు.  నమ్మ బుద్ధికాకపోయినా.. ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  గుర్తు తెలియని ప్రదేశంలో ఎడారినేలలో  చిత్రీకరించిన ఈ వీడియోలో  ఒకరినొకరు వెంటాడుకుంటూ...బెస్ట్ ఫ్రెండ్స్ లాగా మెలగడం పలువురిని ఆకట్టుకుంటోంది.

అమితమైన  చిరుతపులి వేగాన్ని చూసిన  పిల్లవాడి తండ్రి భయపడి  చటుక్కున ఆ అబ్బాయిని  చేతుల్లోకి తీసుకోగా... ఈ బుడతడు   నవ్వులు చిందిస్తూ దాన్ని వాటేసుకున్న ఆ అద్భుతమైన వీడియో మీకోసం...

 కాగా భూమి మీద వేగంగా  పరుగెట్టే జంతువుల్లో చిరుతపులి ఒకటి, గంటలకు 75 కి.మీ  వేగంతో దూసుకు పోవడం చీతా ప్రత్యేకత. పురాతన ఈజిప్షియన్లకు చిరుతపులి  మంచి పెంపుడు జంతువుగా ఉండేది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement