ఎడారిలో చీతాతో చిన్నోడు..
పెంపుడు జంతువులు పసిపిల్లలకు దగ్గర కావడం...పరస్పరం ప్రాణ స్నేహితుల్లా సన్నిహితంగా ఉండడం అందరికీ తెలిసిన విషయమే. కానీ ఓ చిచ్చరపిడుగు ఎడారి లో చిరుతతో చెలగాటాలాడాడు. .. సరదాగా నవ్వుతూ.. ఏదో ఓ బుజ్జి పప్పీతో ఆడుకుంటున్నంత ఈజీగా గేమ్స్ ఆడుకున్నాడు. నమ్మ బుద్ధికాకపోయినా.. ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గుర్తు తెలియని ప్రదేశంలో ఎడారినేలలో చిత్రీకరించిన ఈ వీడియోలో ఒకరినొకరు వెంటాడుకుంటూ...బెస్ట్ ఫ్రెండ్స్ లాగా మెలగడం పలువురిని ఆకట్టుకుంటోంది.
అమితమైన చిరుతపులి వేగాన్ని చూసిన పిల్లవాడి తండ్రి భయపడి చటుక్కున ఆ అబ్బాయిని చేతుల్లోకి తీసుకోగా... ఈ బుడతడు నవ్వులు చిందిస్తూ దాన్ని వాటేసుకున్న ఆ అద్భుతమైన వీడియో మీకోసం...
కాగా భూమి మీద వేగంగా పరుగెట్టే జంతువుల్లో చిరుతపులి ఒకటి, గంటలకు 75 కి.మీ వేగంతో దూసుకు పోవడం చీతా ప్రత్యేకత. పురాతన ఈజిప్షియన్లకు చిరుతపులి మంచి పెంపుడు జంతువుగా ఉండేది.