దేశం గర్వించే క్రీడాకారులుగా ఎదగాలి
Published Sat, Sep 3 2016 10:56 PM | Last Updated on Mon, Sep 4 2017 12:09 PM
అంబాల (కమలాపూర్) : విద్యార్థులు క్రీడల్లో రాణించి దేశం గర్వించే స్థాయికి ఎదగాలని జెడ్పీటీసీ సభ్యుడు మారపెల్లి నవీన్‌కుమార్ అన్నారు. మండలంలోని అంబాల జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ఈనెల 1 నుంచి నిర్వహించనున్న మండల స్థాయి పాఠశాల క్రీడోత్సవాలు శనివారంతో ముగిశాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడా పోటీలు విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాలను వెలికి తీస్తాయన్నారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ రవి, ఎంపీటీసీ రమేశ్, క్రీడా సమాఖ్య చైర్మన్, ఎంఈవో రాంకిషన్‌రాజు, వైస్ చైర్మన్ రాంరెడ్డి, కన్వీనర్ రాజేందర్, హెచ్‌ఎంలు రాజయ్య, జయప్రకాశ్, పవన్‌కుమార్, టీఆర్‌ఎస్ నాయకులు పింగిలి ప్రదీప్‌రెడ్డి, సత్యం, వ్యాయామ ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement