చంఢీగడ్: పంజాబ్ ఆప్ మంత్రి బాల్కర్ సింగ్‌కు సంబంధించిన ఓ అభ్యంతర వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఆయనపై బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పిస్తానని చెప్పి ఓ మహిళతో మంత్రి బాల్కర్ సింగ్ అసభ్యంగా ప్రవర్తించారని బీజేపీ ఆరోపణలు చేసింది. అయితే దీనిపై మంత్రి స్పందించారు. ఆ వీడియో గురించి తనుకు తెలియదని, అది తనది కాదని స్పష్టం చేశారు. బాల్కర్ పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కేబినెట్‌లో స్థానిక ప్రభుత్వం, అసెంబ్లీ వ్యవహారాల మంత్రిగా పనిచేస్తున్నారు.
ఉదోగ్యం కోసం తన వద్దకు వచ్చిన ఓ మహిళ పట్ల మంత్రి అసభ్యంగా ప్రవర్తించిన వీడియోను సోమవారం బీజేపీ నేతలు సోషల్‌మీడియాలో షేర్ చేయటంతో వైరల్‌గా మారింది. వీడియో కాల్‌లో సదరు మహిళను దుస్తులు తొలగించాలని మంత్రి బలవంతం చేశారని బీజేపీ నేతలు ఆరోపించారు.
బీజేపీ ఆరోపణల నేపథ్యంలో జాతీయ మహిళా కమిషన్ స్పందించింది. ఈ వ్యవహారంపై పూర్తి దర్యాప్తు చేపట్టి.. మూడు రోజుల్లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి ఓ నివేదిక ఇవ్వాలని పంజాబ్ పోలీసులను ఆదేశించింది. ఆరోపణలు నిజమని తేలితే మంత్రిని అరెస్ట్ చేయాలని ఆదేశించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా రాజకీయంగా దుమారం రేపటంతో మంత్రి బాల్కర్ సింగ్ స్పందించారు. ‘‘ఆ వీడియో ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. నాకు ఆ వీడియో గురించి తెలియదు. నేను ఏం వ్యాఖ్యలు చేయలేను’’ అని తెలిపారు.
21 ఏళ్ల మహిళకు వీడియో కాల్ చేసి.. అభ్యంరంగా ప్రవర్తించిన మంత్రి బాల్కర్ సింగ్ వెంటనే పదవి నుంచి తొలగించాలని బీజేపీ నేత తాజిందర్ బగ్గా సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను డిమాండ్ చేశారు. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా స్పందిస్తూ.. ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడిని ఉదహరిస్తూ ఆప్ (AAP)అంటే ఒక స్త్రీ ద్వేషి పార్టీ అని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment