సాక్షి, ఢిల్లీ: లోక్ సభ ఎన్నికల్లో ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాలో ఆమ్ ఆద్మీ పార్టీ మంచి ఫలితాలు సాధించబోతోందని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ అన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్, ఆప్ క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఆయన బుధవారం సాక్షి టీవీతో మాట్లాడారు.
‘‘ప్రతిపక్ష నాయకులను జైల్లో పెట్టి బీజేపీ హింసిస్తోంది. ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి మేము జైలు అంశాన్ని ప్రచారం చేస్తున్నాం. ‘జైలు కా జవాబ్ ఓటు సే’అనే నినాదంతో ఎన్నికల్లో దిగాం. ఆప్‌కు ఓటేస్తే దేశవ్యాప్తంగా 200 యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇస్తాం. రైతులకు స్వామినాథన్ సిఫారసుల ప్రకారం గిట్టుబాటు ధర ఇస్తాం. పంజాబ్‌కు బీజేపీలో అవకాశం ఇవ్వకూడదని వ్యూహాత్మకంగా ఆప్, కాంగ్రెస్ విడివిడిగా పోటీ చేస్తుంది.
ఢిల్లీ మద్యం కుంభకోణం నుంచి బయటపడతాం. బీజేపీకి చందాలు ఇచ్చిన వ్యక్తులు ఈ కేసు నుంచి బయటపడ్డారు. ఈడీ బీజేపీ నాయకులపై ఎందుకు సోదాలు చేయడం లేదు. మమ్మల్ని బలవంతంగా జైల్లో పెట్టారు. ఇదే అంశాన్ని ప్రజల్లో ప్రచారం చేస్తే, సానుభూతి కోసమని ఎలా అంటారు?. కేజ్రీవాల్ దేశం కోసం పని చేస్తే, మోదీ తన దోస్తుల కోసం పనిచేస్తున్నారు. దేశంలో ఉన్న ఎయిర్‌పోర్టులు, పోర్టులు తన దోస్తులకు కట్టబెట్టారు’’ అని సంజయ సింగ్ మడ్డారు.
ఇక.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీలాండరింగ్ కేసులో తీహర్ జైలులో కస్టడీలో ఉన్న సంజయ్ సింగ్ ఇటీవల బెయిల్‌పై బయటకు వచ్చిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment