తిరువనంతపురం: కాంగ్రెస్ ఎంపీ, రచయిత శశిథరూర్ నెటిజన్లకు మరో సవాలు విసిరారు. కొత్త పదాలతో ఎప్పుడూ విన్యాసం చేసే ఆయన ఈ సారి పలకడానికి కూడా కష్టంగా ఉన్న పదాన్ని ప్రయోగించారు. అదే.. హిప్పొపొటోమన్ స్ట్రోసెస్ క్విపెడేలి ఫోబియా. రెండు మూడు సార్లు చదివితే కానీ స్పష్టంగా పలకలేని ఈ పదానికి అర్థం ఏమిటా? అని అందరూ డిక్షనరీలు ముందేస్తున్నారు. వివరాల్లోకి వెళితే కమెడియన్ సలోనీ గౌర్ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసింది. ఇందులో ఆమె శశిథరూర్ గొంతును అనుకరిస్తూ నటి సుస్మితా సేన్ వెబ్ సిరీస్ 'ఆర్య' చిత్రం కోసం మాట్లాడింది. (శశి థరూర్‌పై కోర్టు ఆగ్రహం, జరిమానా)
అంతేకాక 'ఆర్య'లోని నటుడు చంద్రచూర్ సింగ్‌కు, శశిథరూర్‌కు మధ్య కొంత పోలిక ఉన్నట్లు తెలిపింది. ఈ వీడియోను దర్శకుడు హన్సల్ మెహతా తిరిగి పోస్ట్ చేస్తూ "శశిథరూర్ మీరిది చూశారా?" అని ప్రశ్నించారు. దీనికి శశిథరూర్ బదులిస్తూ "ఇమిటేషన్ బాగుంది. అయితే నేను అలాంటి పేద్ద పదాలను ఉపయోగించే మాటకారిని కాదు. కానీ తెరపై కనిపించే నటుడికి మాత్రం కచ్చితంగా హిప్పొపొటోమన్ స్ట్రోసెస్ క్విపెడేలి ఫోబియా ఉండదు" అని సమాధానమిచ్చారు. దీని గురించి తెగ గాలించిన నెటిజన్లు ఎట్టకేలకు దాని అర్థం "పెద్ద పదాలను పలకడానికి భయపడటం" అని కనుగొన్నారు. (ప్యాకేజి: అదే పాత సింహాలు ఇప్పుడు కొత్త పేరుతో)
Comments
Please login to add a commentAdd a comment