
సాక్షి, న్యూఢిల్లీ: రాజకీయ నాయకులు ఎక్కడున్నా, ఏం చేసినా కెమెరాలు వారిపై ఫోకస్ పెడుతూనే ఉంటాయి. సభ జరుగుతుండగా కొందరు నేతలు నిద్రపోవడం, ఇంకేదైనా చేయడం చూస్తుంటాం. తాజాగా కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ అలాంటి ఓ ఘటనతో సోషల్ మీడియా ట్రెండింగ్‌లో నిలిచారు. లోక్‌సభలో ఆయన ఎన్సీపీ ఎంపీ సుప్రియాసూలేతో మాట్లాడటమే ఇందుకు కారణం. దీనిపై సోషల్‌మీడియాలో సరదా మీమ్స్ చక్కర్లు కొడుతున్నాయి.
ఇంతకీ ఏం జరిగిందంటే.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై లోక్‌సభలో జమ్ము కశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా మాట్లాడుతుండగా.. శశిథరూర్ ఎన్సీపీ ఎంపీ సుప్రియాసూలేతో మాట్లాడుతూ కనిపించారు. ముందు సీటులో ఆమె కూర్చొని ఉండగా.. శశిథరూర్ వెనుక సీట్‌లో బల్లపై తల ఆనించి పడుకుని నవ్వుతూ కాసేపు ముచ్చటించారు. ఓ వైపు ఫరూక్ అబ్దుల్లా సీరియస్‌గా ప్రసంగిస్తుండగా శశిథరూర్ ఫన్నీగా ఆమెతో మాట్లాడారు.
It was a great speech by Farooq Abdullah. Must listen for everyone. @ShashiTharoor pic.twitter.com/STQe0yulxG
— Farrago Abdullah (@abdullah_0mar) April 6, 2022
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. ఫర్రగో అబ్దుల్లా అనే వ్యక్తి తన ట్విట్టర్‌లో అల్లు అర్జున్ పుష్ప సినిమాలోని శ్రీవల్లి పాట బీజీఎంతో శశిథరూర్ వీడియోను ఎడిట్ చేసి పోస్ట్ చేశాడు. మరో నెటిజన్.. శశిథరూర్ అంటే ఫైర్ కాదు.. ఫ్లవర్ అంటూ ఫన్నీ కామెంట్ చేశాడు.