న్యూఢిల్లీ : కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్.. చైనా యువతి చేసిన ఓ ఫేక్ ట్వీట్‌కు లైక్ కొట్టి అభాసుపాలయ్యారు. వివరాల్లోకి వెళితే.. శనివారం చైనాకు చెందిన ఈవా ఝంగ్ అనే యువతి తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసిన ఓ వీడియోను ఆయన లైక్ చేశారు. చైనా సైన్యం గల్వాన్ ఘర్షణల సందర్భంగా గాయపడ్డ భారత సైన్యానికి సహాయం చేసిందని, ఈ సంఘటనలో చైనా సైనికులెవ్వరూ మరణించలేదని సదరు యువతి ట్వీట్ చేసింది. ఘర్షణల్లో గాయపడి ఆక్సిజన్ అందక ఇబ్బంది పడుతున్న భారత సైనికులకు చైనా సైనిక స్థావరాల్లో సహాయం అందిందని ఆమె పేర్కొంది.
ఈవా ట్వీట్
అయితే అందులో నిజానిజాలు తెలుసుకోకుండా ఆయన దాన్ని చూసిన వెంటనే లైక్ కొట్టేశారు. ఆ వీడియో గల్వాన్ ఘర్షణలకు చెందినది కాదని, 2017 సంవత్సరానిదని కొందరు నెటిజన్లు గుర్తించడంతో కొద్దిసేపటి తర్వాత ఆ ట్వీట్‌ను ఈవా డిలేట్ చేసింది. దీంతో నెటిజన్లు శశిథరూర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
చదవండి : గల్వాన్ లోయ మాదే
Comments
Please login to add a commentAdd a comment