డెంగీపై అధికార యంత్రాంగం అప్రమత్తం
Published Tue, Sep 13 2016 12:49 AM | Last Updated on Mon, Sep 4 2017 1:13 PM
పెద్దాపురం :
సీజనల్ వ్యా««దlుల నేపథ్యంలో మున్సిపల్ యంత్రాంగం సోమవారం ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్‌ను నిర్వహించింది. పట్టణంలోని వివిధ వార్డుల్లో కాలువల్లో పూడికతీత, చెత్త తొలగింపు వంటి కార్యక్రమాలను చేపట్టింది. పట్టణంలోని ఒకటో వార్డులో డెంగీ లక్షణాలున్న కేసులపై మున్సిపల్, వైద్య శాఖ యంత్రాంగం స్పందించాయి. ఒకటో వార్డు కౌన్సిలర్ అరెళ్లి వెంకటలక్ష్మితో పాటు ఆమె కుమార్తె మేఘమాల, కొల్లి మానస డెంగీ లక్షణాలతో కాకినాడలో ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో ‘సాక్షి’లో వచ్చిన వార్తపై మున్సిపల్ కమిషనర్ అప్పాబత్తుల వెంకట్రావు, వైద్య శాఖ డీఎంఓ పీఎస్‌ఎస్ ప్రసాద్ పట్టణంలో పర్యటించి, పారిశుద్ధ్య, ప్రజల ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీశారు. పారిశుద్ధ్య పరిస్థితులు మెరుగుపర్చకుంటే చర్యలు తప్పవని కమిషనర్ పారిశుద్ధ్య అధికారులను హెచ్చరించారు. ఒకటో వార్డులో అపరిశుభ్రత వల్లే ప్రజలు రోగాల బారిన పడుతున్నారని కమిషనర్ విలేకరులకు చెప్పారు. కాగా డీఎంఓ పీఎస్‌ఎస్ ప్రసాద్ స్థానిక పీహెచ్‌సీ, పాత ఆస్పత్రి వీధుల్లో పర్యటించారు.
Advertisement