సంక్రాంతి పండుగ వస్తోందంటే గ్రామాలకు ప్రయాణం మొదలవుతుంది. సొంతూరికి వెళ్లే వాళ్ల ఆనందం అన్నింటికంటే మిన్న. అలాగే హైదరాబాద్‌వాసులు శిల్పారామంలో నిర్వహించే వేడుకలతో ఆనందిస్తారు. గాలిపటాలతో గాల్లో తేలినట్లు సంతోషిస్తారు. ఇది మన తెలుగు సంక్రాంతి. ఇక తమిళులు సంక్రాంతిని దేశానికే తలమానికం అన్నట్లు నిర్వహించుకుంటారు. కళారంగం ఉత్సాహంతో ఉరకలేస్తుంది. దేశంలో ఎక్కడెక్కడో స్థిరపడిన వాళ్లంతా సొంత రాష్ట్రానికి వస్తారు. మైలాపోర్ వేడుకల్లో పాల్గొని సంతోషాన్ని మది నిండా నింపుకుని తిరిగి వెళ్తారు.
మైలాపోర్ వేడుకలు
తెలుగువాళ్లలాగే తమిళనాడుకి సంక్రాంతి పెద్ద పండుగ. సంక్రాంతికి నెల రోజుల ముందు నుంచి వేడుకల వాతావరణం నెలకొంటుంది. ఆ రాష్ట్ర రాజధాని చెన్నైలో ఏటా ఆర్ట్ ఫెస్టివల్ జరుగుతుంది. మైలాపోర్‌లో జరుగుతుంది కాబట్టి దీనికి మైలా΄ోర్ ఫెస్టివల్ అనే పేరు వ్యవహారంలోకి వచ్చింది. ఏటా సంక్రాంతి ముందు జరిగే ఈ వేడుక వచ్చే ఏడాది జనవరి తొమ్మిది నుంచి పన్నెండవ తేదీ వరకు జరుగుతాయి. గడచిన 72 ఏళ్లుగా జరుగుతున్న ఈ వేడుకల్లో 30కి పైగా కళలను ప్రదర్శిస్తారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి మూడు వందలకు పైగా కళాకారులు పాల్గొంటారు. నాట్యప్రదర్శనలు, సంగీత కార్యక్రమాలు, సాము గారడీ నుంచి జానపద కళారూపాల ప్రదర్శనలతో నగరం కళకళలాడుతుంది. అన్నింటిలోకి ముగ్గుల పోటీ ప్రత్యేకం. ముగ్గును కోలామ్ అంటారు. ఇందులో మహిళలతోపాటుబాలికలు కూడా ఉత్సాహంగా పాల్గొంటారు.
ఇంకా ఏమేమి ఉంటాయి?
ప్రాచీన కపాలి ఆలయానికి హెరిటేజ్ వాక్, తె΄్పోత్సవం, మాడవీథుల్లో పర్యటనలు ఆహ్లాదకరంగా ఉంటాయి. సైక్లింగ్ టూర్‌లో టీనేజ్ నుంచి యువకులు ఉత్సాహంగా కనిపిస్తారు. బోట్ షికార్, ఫుడ్ వాక్, చిల్డ్రన్ టూర్... ఇలా థీమ్ ప్రకారం వేడుకలు సాగుతాయి. సంక్రాంతి సెలవుల్లో ఈ మైలాపోర్ ఫెస్టివల్ టూర్ ప్లాన్ చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment