ఇంతవరకు తమకు నచ్చిన స్కూటీ, లేదా మంచి ఖరీదు చేసే బైక్ లేక కారు కొనుక్కునేందుకు చిల్లర నాణేలు పోగు చేసి మరీ కొనుకున్న సందర్భాలు చూశాం. అవన్నీ వారి ఆర్థిక పరిస్థితి దృష్ట్యా తమ కోరిక నెరవేర్చుకోవాలన్న తాపత్రయం వంటి కారణాల రీత్యా ఇలా కొనుగోలు చేసి వార్తల్లో నిలిచారు. కానీ ఇక్కడొక వ్యక్తి వారిలానే నాణేలను పోగుచూసి తన కలల కారుని కొనుకున్నాడు. కానీ అతను వారందరికీ భిన్నం. పైగా అతను ఎందుకు అలా చేశాడో వింటే కచ్చితంగా షాక్ అవుతారు.
వివరాల్లోకెళ్తే...తమిళనాడులోని వెట్రివేల్ అనే వ్యక్తి రూ. 10 నాణేలను సుమారు రూ. 6 లక్షలు పోగుచేసి వాటితో తనకు నచ్చిన కారుని కొనుకున్నాడు. ఐతే మొదటగా ఆ షాప్ డీలర్ ఈ రూ. 10 నాణేలతో కారు కొనుగోలు చేసేందుకు అంగీకరించ లేదు. వెట్రివేల్ ధృడ నిశ్చయం విని షాప్ డీలర్ ఈ విక్రయానికి అంగీకరించాడు.
ఇంతకీ అతను ఎందుకు ఏకంగా రూ. 6 లక్షల రూ. 10 నాణేలను పోగు చేశాడంటే...అతని తల్లి ఒక దుకాణం నడుపుతుంటుందని చెప్పాడు. ఐతే కస్టమర్లు రూ. 10 నాణేలు తీసుకోవడానికి నిరాకరించాడంతో చాలా పెద్ద మొత్తంలో రూ.10 నాణేలు ఉండిపోయాయి. పైగా పిల్లలు కూడా ఆ రూ. 10 నాణేలు విలువ లేనివని ఆడుకోవడం చూశానని చెప్పాడు. దీంతో తాను ఈ పది రూపాయల నాణేలతోనే కారు కొనుక్కుని చూపి.. ప్రజలకు అవగాహన కల్పించాలనుకున్నట్లు తెలిపాడు.
అయినా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ రూ. 10 నాణేలు విలువ లేనివి అని చెప్పనప్పుడూ ఎందుకు బ్యాంకులు స్వీకరించడంలేదంటూ ప్రశ్నించాడు. తాను ఎన్నిసార్లు ఈ విషయమై ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదని వాపోయాడు. దీంతో తాను ఈ పది రూపాయల నాణేలు విలువైనవేనని చెప్పాలనే కృతనిశ్చయంతో ఈ పని చేశానని చెప్పాడు. అందుకోసం తాను దాదాపు నెలరోజులకు పైగా పది రూపాయల నాణేలను రూ. 6 లక్షలు పోగుచేశానని చెప్పుకొచ్చాడు.
(చదవండి: సైకిల్ తొక్కుతూ జారిపడ్డ అమెరికా అధ్యక్షుడు: వీడియో వైరల్)
Comments
Please login to add a commentAdd a comment