భారత్ (BH) సిరీస్ నంబర్ ప్లేట్‌లను ఎంచుకునే వ్యక్తులపై రవాణా శాఖ గణనీయంగా పన్ను భారాన్ని మోపింది. ఇంతకు ముందు రెండు సంవత్సరాలకు ఒకసారి పన్ను చెల్లించాల్సి ఉండేది. అయితే ఇప్పుడు 14 ఏళ్లకు ఒకేసారి పన్ను చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.
భారత్ సిరీస్ నెంబర్ ప్లేట్‌లను ప్రవేశపెట్టడంతో భారత ప్రభుత్వం వాహన రిజిస్ట్రేషన్ ప్రక్రియలో విప్లవాత్మక మార్పులు చేసింది. రహదారి, రవాణా & రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) ద్వారా 2021 నుంచి రవాణాశాఖ బీహెచ్ సిరీస్ నెంబర్ ప్లేట్స్ జారీ చేస్తోంది. ఉద్యోగరీత్యా రాష్ట్రాలు మారే వ్యక్తులు ఈ సిరీస్ నెంబర్స్ కొనుగోలు చేశారు. ఈ నెంబర్ ప్లేట్స్ కోసం వాహనదారులు కేంద్ర రోడ్డు రవాణా శాఖకు చెందిన పరివాహన్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి బీహెచ్ నంబర్ ప్లేటు కోసం అప్లై చేసుకోవచ్చు.
దేశంలో ఇప్పటి వరకు బీహెచ్ సిరీస్ నెంబర్ ప్లేట్స్ కలిగిన వాహనాలు 731 ఉన్నట్లు సమాచారం. ఈ వాహనదారులు ఇప్పుడు ఒకేసారి 14 సంవత్సరాలకు ట్యాక్స్ చెల్లించాల్సి ఉంది. ఈ చెల్లింపుల కోసం 60 రోజుల వ్యవధి కూడా ఇవ్వనున్నట్లు సమాచారం.
ఏ వాహనానికి ఎంత ట్యాక్స్
రూ.10 లక్షల కంటే తక్కువ ధర కలిగిన వాహనాలకు 8 శాతం, రూ. 10 లక్షల నుంచి రూ. 20 లక్షల మధ్య ధర కలిగిన వాహనాలకు 10 శాతం, రూ. 20 లక్షల కంటే ఎక్కువ ధర కలిగిన వాహనాలకు 12 శాతం ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment