యూనియన్ బడ్జెట్ 2025-26 లిథియం బ్యాటరీలు.. సంబంధిత రంగాల ఉత్పత్తిని ప్రోత్సహించడానికి గణనీయమైన పన్ను మినహాయింపులను ప్రకటించింది. స్థానిక తయారీని మెరుగుపరచడం మాత్రమే కాకుండా.. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం పన్నులు తగ్గించింది. దీంతో ఎలక్ట్రిక్ వాహనాలు, ఎలక్ట్రానిక్స్ ధరలు తగ్గుముఖం పడతాయి.
కోబాల్ట్, లిథియం అయాన్ బ్యాటరీ స్క్రాప్, సీసం, జింక్, 12 ఇతర కీలకమైన ఖనిజాల వంటి అవసరమైన పదార్థాలపై కూడా కేంద్రం ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని (BCD) తొలగించింది. బ్యాటరీలు, సెమీకండక్టర్లు, పునరుత్పాదక శక్తి పరికరాల తయారీకి ఈ పదార్థాలు చాలా ముఖ్యమైనవి. కాబట్టి ఎలక్ట్రిక్ వాహనాలకు, క్లీన్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ తయారీలో ఈ పదార్థాలపై ఆధారపడే పరిశ్రమలకు ఖర్చులను తగ్గిస్తుంది.
ఈవీ బ్యాటరీ ఉత్పత్తిలో ఉపయోగించే 35 అదనపు వస్తువులు, మొబైల్ ఫోన్ బ్యాటరీ తయారీకి 28 వస్తువులపై ట్యాక్స్ తగ్గించడం వల్ల.. కంపెనీలు అదనపు పన్నులు లేకుండా బ్యాటరీ ఉత్పత్తికి అవసరమైన యంత్రాలను, సాధనాలను దిగుమతి చేసుకోవచ్చు. టాటా, ఓలా ఎలక్ట్రిక్, రిలయన్స్ వంటి కంపెనీలను భారతదేశంలో తమ కార్యకలాపాలను విస్తరించేందుకు ప్రోత్సహించడం లక్ష్యంగా దీనిని ప్రవేశపెట్టడం జరిగింది.
ఇదీ చదవండి: కేంద్ర బడ్జెట్ 2025 హైలైట్స్
కేంద్రప్రభుత్వ చర్య వల్ల.. ఈవీ బ్యాటరీలు కొంత తక్కువ ధరకే లభిస్తాయి. ఇది ఉత్పత్తి ఖర్చులను తగ్గించి.. దేశీయ తయారీని పెంచుతుంది. ఇది చైనా, ఇతర దేశాలపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. ఇవన్నీ క్లీన్ ఎనర్జీ వృద్ధికి.. భారతదేశ పునరుత్పాదక ఇంధన లక్ష్యాలకు సహాయపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment