కారు ధర అంటే లక్షల్లో ఉంటుందని, ఇంకా ఖరీదైన లగ్జరీ కార్లు అయితే కోట్ల రూపాయల వరకు ఉంటాయని అందరూ వినే ఉంటారు. అయితే ఇటీవల ఒక నెంబర్ ప్లేట్ ఏకంగా రూ. 122 కోట్లకు అమ్ముడైంది. వినటానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజం. ఇంతకీ ఈ సంఘటన ఎక్కడ జరిగింది, దాని పూర్తి వివరాలేంటి అనేది ఈ కథనంలో చూసేద్దాం..
నివేదికల ప్రకారం, దుబాయ్‌లో మోస్ట్ నోబుల్ నంబర్స్ చారిటీ వేలంలో ‘పీ 7' (P 7) అనే ఓ వీఐపీ కారు నంబర్ ప్లేట్ 55 మిలియన్ దిర్హామ్‌లకు అమ్ముడుపోయింది. అంటే ఇది భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 122. 6 కోట్లు. ఇంత ధరకు అమ్ముడుపోవడంతో ఇది ప్రపంచంలోనే ఖరీదైన నంబర్ ప్లేట్‍గా గిన్నిస్ రికార్డులో చోటు సంపాదించుకుంది.
ఇంత డబ్బు చెల్లించి ఈ నెంబర్ ప్లేట్ ఎవరు సొంతం చేసుకున్నారనే విషయం వెల్లడి కాలేదు. అయితే ఈ వేలం ద్వారా వచ్చిన డబ్బుని 'వంద కోట్ల భోజనాల వితరణ నిధి' (1 Billion Meals Endowment) కార్యక్రమానికి అందించనున్నట్లు సమాచారం. రంజాన్ సందర్భంగా ఆహార సాయం కోసం భారీ దాతృత్వ నిధిని సేకరించేందుకు ఈ బిలియన్ మీల్ ఎండోమెంట్ కార్యక్రమం జరుగుతున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
(ఇదీ చదవండి: కృతి కర్బందా కొత్త కారు.. ధర తెలిస్తే అవాక్కవుతారు!)
ప్రపంచంలోని చాల దేశాల్లో ప్రకృతి వైపరిత్యాలు, ఇతరత్రా కారణాల వల్ల మరణించే వారికంటే రోజూ ఆకలి బాధతో చనిపోయే వారి సంఖ్య ఎక్కువవుతున్న సమయంలో ఆకలిపై యుద్ధం చేయడానికి ఈ కార్యక్రమాన్ని యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాని మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమిరేట్ ఆక్షన్స్, మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ గ్లోబల్ ఇనిషియేటివ్స్ సంయుక్తంగా ఈ వేలాన్ని నిర్వహించాయి.
(ఇదీ చదవండి: మరణం తర్వాత కూడా భారీగా సంపాదిస్తున్న యూట్యూబర్.. ఇతడే!)
వేలంలో పీ7 మాత్రమే కాకుండా ఏఏ19, ఏఏ22, ఏఏ80, ఓ71, ఎక్స్36, డబ్ల్యూ78, హెచ్31, జెడ్37, జే57, ఎన్41 వంటి 10 నెంబర్ ప్లేట్స్ విక్రయించారు. ఇందులో వై900, క్యూ22222, వై6666 లాంటి స్పెషల్ నెంబర్స్ కూడా ఉన్నాయి. ఏఏ19 నంబర్ ప్లేట్ ఈ వేలంలో 4.9 మిలియన్ దిర్హామ్‍లకు అమ్ముడుపోగా.. ఓ71 నంబర్ ప్లేట్ 1.50 మిలియన్ దిర్హామ్‍లకు విక్రయించారు.
Comments
Please login to add a commentAdd a comment