
సాక్షి,సిటీబ్యూరో: రవాణాశాఖ ఖైతరాబాద్ కార్యాలయంలో బుధవారం ప్రత్యేక నంబర్లకు నిర్వహించిన వేలంలో పలువురు వాహనదారులు తమ క్రేజ్‌ను చాటుకున్నారు. నచ్చిన నంబర్‌ను రూ.లక్షలు పోసి దక్కించుకున్నారు. ఇలా ఫ్యాన్సీ నంబర్ల వేలం ద్వారా బుధవారం ఒక్కరోజే సంస్థకు రూ.27,44,157 ఆదాయం వచ్చింది. రేంజ్ రోవర్ 3.0 ఎల్‌డబ్ల్యూబీ వాహనానికి టీఎస్09 ఎఫ్‌హెచ్ 9999 నంబర్‌కు రూ.10.35 లక్షలకు బిడ్ వేసి ట్రాక్స్ అండ్ టవర్స్ ఇన్‌ఫ్రా లిమిటెడ్ దక్కించుకుంది. అలాగే మసరట్టి లవెంటి వాహనం కోసం టీఎస్09 ఎఫ్‌జే 0009 నంబర్‌కు గంగవరం పోర్ట్ లిమిటెడ్ కంపెనీ రూ.4.01 లక్షలు వెచ్చించింది. స్కోడా సూపర్బ్ ఎల్ అండ్ కే వాహనానికి టీఎస్09 ఎఫ్‌జే 0099 నంబర్‌కు రూ.2.97 లక్షలకు బిడ్ వేసి ఈటీఏ స్టూడియో ప్రైవేట్ లిమిటెడ్ దక్కించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment