
చంద్రబాబు వద్దకు కర్నూలు పంచాయితీ
అమరావతి: కర్నూలు పంచాయతీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి వద్దకు చేరినట్లు తెలుస్తోంది. మంత్రి అఖిలప్రియపై ఏవీ సుబ్బారెడ్డి తిరుగుబాటుచేసిన విషయం తెలిసిందే. అఖిలప్రియ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ సుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
నంద్యాలలోని కౌన్సిలర్లతో ఆయన ఇప్పటికే సుబ్బారెడ్డి సమావేశమయ్యారు. ఎవరివైపు ఉంటారో తేల్చుకోవాలంటూ సుబ్బారెడ్డి వారిని కోరారు. ఈ విబేధాల నేపథ్యంలో జిల్లా నేతలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలిపించారు. శనివారం ఆయన సమక్షంలోనే ఈ కర్నూలు పంచాయితీని పరిష్కారించనున్నారు.