
చరణ్, శ్రావణి
‘ఆకాశంలో ఆశల హరివిల్లు.. ఆనందాలే పూసిన పొదరిల్లు’ అంటూ ‘స్వర్ణకమలం’ చిత్రంలో భానుప్రియ చేసిన నృత్యాన్ని అంత సులువుగా మరచిపోలేం. ఆ పాట కూడా పాపులర్ అయింది. తాజాగా ‘ఆకాశంలో ఆశల హరివిల్లు’ పేరుతో ఓ సినిమా తెరకెక్కింది. సత్యశ్రీ, సుబ్బారెడ్డి, చరణ్, శ్రావణి ముఖేష్, నరేష్ ముఖ్య తారలుగా క్రాంతి కిరణ్ దర్శకత్వంలో బి. సత్యశ్రీ నిర్మించారు.
శ్రీనివాస్ మాలపాటి స్వరపరచిన ఈ చిత్రం పాటలను నవ్యాంధ్ర ఫిలిం చాంబర్ అధ్యక్షుడు ఎస్‌విఎన్ రావు, నిర్మాత సాయి వెంకట్ విడుదల చేశారు. క్రాంతి కిరణ్ మాట్లాడుతూ– ‘‘కుటుంబ నేపథ్యంలో తెరకెక్కిన మంచి ప్రేమకథా చిత్రమిది. అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. నాకీ చాన్స్ ఇచ్చిన సత్యశ్రీగారికి థ్యాంక్స్’’ అన్నారు. ‘‘దర్శకుడు, కెమెరామెన్ రెమో, హీరో, హీరోయిన్ల సపోర్ట్ వల్లే ఈ సినిమా తీయగలిగాను.వారికి నా స్పెషల్ థ్యాంక్స్’’ అన్నారు సత్యశ్రీ.
Comments
Please login to add a commentAdd a comment