ధర్నాలో పాల్గొన్న పార్టీ నాయకులు గౌతంరెడ్డి, పోతిరెడ్డి సుబ్బారెడ్డి తదితరులు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): చంద్రబాబు జీవితమంతా హత్యారాజకీయాలేనని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర అధికారప్రతినిధి పూనూరు గౌతంరెడ్డి, ప్రచార కమిటీ నగర అధ్యక్షుడు పోతిరెడ్డి సుబ్బారెడ్డి ధ్వజమెత్తారు. ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌పై విశాఖ ఎయిర్‌పోర్టులో జరిగిన హత్యాయత్నాన్ని నిరసిస్తూ ఆ పార్టీ ప్రచార విభాగం ఆధ్వర్యంలో లెనిన్‌సెంటర్‌లో శుక్రవారం ధర్నా చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారు మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే 427 మంది వైఎస్సార్‌సీపీ నాయకులను హతమార్చారన్నారు.
వెయ్యికి పైగా దాడులకు పాల్పడ్డారన్నారు. ప్రజాసంకల్పయాత్రలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక టీడీపీ ప్రభుత్వం హత్యాయత్నానికి పాల్పడిందన్నారు. జగన్‌ను అడ్డుతొలగించేందుకు చంద్రబాబు కుట్ర పన్నారన్నారు. జగన్‌పై హత్యాయత్నం ముమ్మాటికీ ప్రభుత్వ కుట్రేనన్నారు. ఘటనపై స్వతంత్ర సంస్థ చేత దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రజాసంకల్పయాత్ర తిరిగి ప్రారంభమవుతున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జగన్‌కు గట్టి భద్రత ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ధర్నాలో విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు అంజిరెడ్డి, ప్రచార కమిటీ నాయకులు తంగిరాల రామిరెడ్డి, కాలే పుల్లారావు, ఎస్ ఈశ్వరరెడ్డి, మురళీనాయక్, సాదు సత్యనారాయణ, కేసరి కృష్ణారెడ్డి, ఎంఎస్ బేగ్, లంకా బాబు, మల్లికార్జునరెడ్డి, యానాల వెంకటేశ్వరరావు, హరీష్‌మిత్ర, నాగరాజు, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment