p goutham reddy
-
ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్‌గా గౌతమ్‌రెడ్డి బాధ్యతలు
సాక్షి, విజయవాడ: ఏపీ స్టేట్ ఫైబర్‌నెట్ మిలిటెడ్ (ఏపీఎస్ఎఫ్ఎల్) చైర్మన్‌గా పి. గౌతమ్‌రెడ్డి శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచన విధానాలకు అనుగుణంగా పనిచేస్తానని తెలిపారు. ఫైబర్ గ్రిడ్ ద్వారా ట్రిపుల్ ప్లే సర్వీసులు అందిస్తామని ఆయన వెల్లడించారు.ఈ సర్వీసులు తక్కువ ధరకే అందిస్తామని చెప్పారు. కేబుల్,ఇంటర్నెట్, టెలిఫోన్ సౌకర్యం కల్పిస్తామని పేర్కొన్నారు. (చదవండి: టీడీపీలో రచ్చకెక్కిన విభేదాలు..) ‘‘గ్రామ, మండలస్థాయిలో అండర్ గ్రౌండ్ కేబుల్ లైన్స్ వేస్తాం. ఫైబర్ గ్రిడ్‌లో 10లక్షల కనెక్షన్స్ ఉన్నాయి. త్వరలో కొత్త సెట్ టాప్బాక్స్లు తీసుకువస్తాం. రూ. 599లకే అన్ లిమిటెడ్ ప్లాన్‌తో నెట్ కేబుల్ ఇస్తాం. రూ.450లకే ఇంటర్నెట్ను అన్‌లిమిటెడ్‌తో ఇస్తాం. విద్యార్థుల లాప్‌ట్యాప్‌లకు ఫైబర్ గ్రిడ్ ద్వారా నెట్ ఇస్తాం. ఫైబర్‌గ్రిడ్‌లో రూ.వేల కోట్లు స్వాహా చేశారు. గత ప్రభుత్వం చేసిన అవినీతిని వెలికి తీస్తాం. సీబీఐ విచారణ కూడా చేస్తుంది.అవినీతికి పాల్పడిన ఒక్కరినీ కూడా వదలమని’’గౌతమ్‌రెడ్డి స్పష్టం చేశారు.(చదవండి: టీడీపీ కుటిల యత్నం!) -
బాబు జీవితమంతా హత్యారాజకీయాలే!
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): చంద్రబాబు జీవితమంతా హత్యారాజకీయాలేనని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర అధికారప్రతినిధి పూనూరు గౌతంరెడ్డి, ప్రచార కమిటీ నగర అధ్యక్షుడు పోతిరెడ్డి సుబ్బారెడ్డి ధ్వజమెత్తారు. ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌పై విశాఖ ఎయిర్‌పోర్టులో జరిగిన హత్యాయత్నాన్ని నిరసిస్తూ ఆ పార్టీ ప్రచార విభాగం ఆధ్వర్యంలో లెనిన్‌సెంటర్‌లో శుక్రవారం ధర్నా చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారు మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే 427 మంది వైఎస్సార్సీపీ నాయకులను హతమార్చారన్నారు. వెయ్యికి పైగా దాడులకు పాల్పడ్డారన్నారు. ప్రజాసంకల్పయాత్రలో వైఎస్ జగన్మోహన్రెడ్డికి వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక టీడీపీ ప్రభుత్వం హత్యాయత్నానికి పాల్పడిందన్నారు. జగన్‌ను అడ్డుతొలగించేందుకు చంద్రబాబు కుట్ర పన్నారన్నారు. జగన్‌పై హత్యాయత్నం ముమ్మాటికీ ప్రభుత్వ కుట్రేనన్నారు. ఘటనపై స్వతంత్ర సంస్థ చేత దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రజాసంకల్పయాత్ర తిరిగి ప్రారంభమవుతున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జగన్‌కు గట్టి భద్రత ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ధర్నాలో విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు అంజిరెడ్డి, ప్రచార కమిటీ నాయకులు తంగిరాల రామిరెడ్డి, కాలే పుల్లారావు, ఎస్ ఈశ్వరరెడ్డి, మురళీనాయక్, సాదు సత్యనారాయణ, కేసరి కృష్ణారెడ్డి, ఎంఎస్ బేగ్, లంకా బాబు, మల్లికార్జునరెడ్డి, యానాల వెంకటేశ్వరరావు, హరీష్‌మిత్ర, నాగరాజు, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో అతి పెద్ద నిరుద్యోగి ...
వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ నేత గౌతంరెడ్డి ఆరోపణ అంగన్వాడీలకు వేతనాల పెంపు జీవో జారీచేయాలని డిమాండ్ విజయవాడ: రాష్ట్రంలో అతి పెద్ద నిరుద్యోగి నారా లోకేశ్ అని, 18 నెలల్లో దోచుకున్న రూ. 2.50 లక్షల కోట్లను చంద్రబాబు తన తనయుడికి కానుకగా ఇచ్చారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గౌతంరెడ్డి ఆరోపించారు. విజయవాడలోని లెనిన్ సెంటర్లో వేతనాలు జీవో విడుదల చేయాలని కోరుతూ అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ చేస్తున్న రిలే నిరాహార దీక్షలు శనివారం రెండో రోజుకు చేరాయి. దీక్షా శిబిరాన్ని గౌతంరెడ్డి శనివారం సందర్శించి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పర్యటనలకు రూ. వేల కోట్లు ఖర్చు చేస్తున్న చంద్రబాబుకు అంగన్వాడీల వేతనాలను చెల్లించేందుకు మాత్రం చేతులు రావడం లేదన్నారు. అంగన్వాడీలతో వెట్టిచాకిరీ చేయిస్తూ వేతనాలు ఇవ్వకుండా వారిని రోడ్డున పడేశారన్నారు. కొన్ని రాష్ట్రాల్లో అంగన్వాడీలకు రూ.16 వేల నుంచి రూ.20 వేల వరకు వేతనాలు ఇస్తున్నారని చెప్పారు. మన రాష్ట్రంలో మాత్రం అంగన్వాడీ వర్కర్లకు కనీస వేతనం కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. వేతనాల కోసం అంగన్వాడీలు చేస్తున్న ఆందోళనకు వైఎస్సార్సీపీ మద్దతిస్తోందన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో అంగన్వాడీ సమస్యలను ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రస్తావిస్తారని తెలిపారు. కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ (ఏఐటీయూసీ) రాష్ర్ట ప్రధాన కార్యదర్శి జె.లలితమ్మ, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్(సీఐటీయూ) ప్రధాన కార్యదర్శి సుబ్బరావమ్మ, తదితరులు పాల్గొన్నారు.