జగిత్యాల: నెర్రెలు బారిన చెరువుకు కళ వచ్చిందని సంతోషించాలా..? లేక, ఊర చెరువు పండుగకు తప్పనిసరి పరిస్థితుల్లో చెరువు నింపాల్సి రావడానికి బాధపడాలా..? ఇదిగో ఈ మీమాంసే సర్పంచులను వేధించింది. జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం బట్టపల్లిలో.. ఊర చెరువు పండుగ చేసేందుకు సిద్ధమైనా.. చెర్లో నీళ్లు లేకపోవడంతో అక్కడి సర్పంచ్ కష్టాలు అన్నీఇన్నీ కావు.
ఏకంగా ట్యాంకర్ తెచ్చి చెరువును నీటితో నింపే దృశ్యాలు.. ఇప్పటికే అప్పుల బాధతో బిల్లులు కూడా రాక ఇబ్బందులు పడుతున్న సర్పంచుల కష్టాలను కళ్లకు కట్టింది. అయితే, ప్రకృతి సిద్ధంగా నిండాల్సిన చెరువుకు ఎన్ని ట్యాంకర్స్ నీళ్లు పోస్తే మాత్రం నిండుతుంది చెప్పండి. అందుకే, ఏవో కొన్ని నీళ్లతో నింపి.. ఊరచెరువు పండుగను మమ అనిపించారు అక్కడి ప్రజాప్రతినిధులు.
Comments
Please login to add a commentAdd a comment