CHERUVULU
-
ఊర చెరవు పండుగ.. సర్పంచ్‌లకు కష్టాలు!
జగిత్యాల: నెర్రెలు బారిన చెరువుకు కళ వచ్చిందని సంతోషించాలా..? లేక, ఊర చెరువు పండుగకు తప్పనిసరి పరిస్థితుల్లో చెరువు నింపాల్సి రావడానికి బాధపడాలా..? ఇదిగో ఈ మీమాంసే సర్పంచులను వేధించింది. జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం బట్టపల్లిలో.. ఊర చెరువు పండుగ చేసేందుకు సిద్ధమైనా.. చెర్లో నీళ్లు లేకపోవడంతో అక్కడి సర్పంచ్ కష్టాలు అన్నీఇన్నీ కావు. ఏకంగా ట్యాంకర్ తెచ్చి చెరువును నీటితో నింపే దృశ్యాలు.. ఇప్పటికే అప్పుల బాధతో బిల్లులు కూడా రాక ఇబ్బందులు పడుతున్న సర్పంచుల కష్టాలను కళ్లకు కట్టింది. అయితే, ప్రకృతి సిద్ధంగా నిండాల్సిన చెరువుకు ఎన్ని ట్యాంకర్స్ నీళ్లు పోస్తే మాత్రం నిండుతుంది చెప్పండి. అందుకే, ఏవో కొన్ని నీళ్లతో నింపి.. ఊరచెరువు పండుగను మమ అనిపించారు అక్కడి ప్రజాప్రతినిధులు. -
గల్లీ నుంచి ఢిల్లీ దాకా..ఆక్రమణదారుల చెరలో 38,496 చెరువులు
సాక్షిప్రతినిధి, వరంగల్: నగరాలు, పట్ణణాలు, పల్లెలు.. ఇవేమీ తేడా లేకుండా దేశవ్యాప్తంగా ఆక్రమణదారులు చెరువుల్ని మింగేస్తున్నారు.. ఫలితంగా వేల సంఖ్యలో జలవనరులు కనుమరుగవుతున్నా యి. ఒకప్పుడు తాగునీటి అవసరాలు తీర్చినవాటి లో కొన్ని ఆక్రమణలపాలై కనుమరుగు కాగా మరికొన్ని మురుగునీటి కాసారాలుగా మారాయి. ఇటీవల కేంద్ర మైనర్ ఇరిగేషన్ స్టాటిస్టిక్స్ విభాగం విడుదల చేసిన నివేదిక ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ కేంద్ర ప్రాయోజిత పథకం కింద ‘ఇరిగేషన్ సెన్సెస్’నిర్వహించింది. అనేక చెరువులు కనుమరుగైనట్లు, మరి కొన్ని ప్రమాదంలో ఉన్నట్లు ఆ నివేదికలో పేర్కొంది. ఓరుగల్లు చెరువులు ఎంతెంత పోయాయంటే వరంగల్, హనుమకొండ, కాజీపేట ట్రై సిటీలో కాకతీయ రాజులు నిర్మించిన గొలుసుకట్టు చెరువులు ఆక్రమణలతో కుచించుకు పోయాయి. 100 ఎకరాలకుపైగా ఉండే చిన్నవడ్డేపల్లి చెరువు సుమారు 20 ఎకరాల వరకు ఆక్రమణకు గురైనట్లు కొద్ది రోజుల క్రితం రెవెన్యూ శాఖనే తేలి్చంది. మామునూరు పెద్ద చెరువు 170 ఎకరాలకుగాను సుమారు 40 ఎకరాలు, 126 ఎకరాల్లో విస్తరించి ఉన్న పాతబస్తీ ఉర్సు రంగ సముద్రం (ఉర్సు చెరువును) సుమారు 26 ఎకరాలు, హనుమకొండ హంటర్‌రోడ్ న్యూశాయంపేటలో 150 ఎకరాల విస్తీర్ణంలోని కోటి చెరువులో సుమారు 25–30 ఎకరాల వరకు ప్రైవేటుపరమయ్యాయి. హన్మకొండ, కాజీపేట ప్రాంతవాసుల తాగునీటి అవసరాలు తీర్చే హన్మకొండ వడ్డేపల్లి చెరువులో 40 ఎకరాలకు వరకు, 336 ఎకరాల భద్రకాళి చెరువులో సుమారు 40 ఎకరాల పైచిలుకు కనుమరుగైందని అధికారులు గుర్తించారు. తెలంగాణలో ఆక్రమణకు గురైనవి 3,032 దేశవ్యాప్తంగా గల్లీ నుంచి ఢిల్లీ దాకా చిన్ననీటి వనరులు కుచించుకుపోతున్నాయి. దేశవ్యాప్తంగా 38,496 చెరువులు, ట్యాంకులు, సరస్సులు తదితర చిన్ననీటి వనరులు ఆక్రమణకు గురికాగా, సుమారు 14,535 చోట్ల ప్రమాదంలో ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. కాగా అత్యధికంగా ఆక్రమణలకు గురైన ఐదు రాష్ట్రాల జాబితాలో తెలంగాణ రాష్ట్రం ఉంది. 64,056 చిన్ననీటి వనరుల్లో 3,032 ఆక్రమణలకు గురైనట్లు నివేదిక తేల్చింది. ఈ 3,032 చెరువుల్లో ఎక్కువ హైదరాబాద్, వరంగల్, మహబూబ్‌నగర్, కరీంనగర్, నల్లగొండ, మెదక్ జిల్లాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఐదు సెంటిమీటర్ల వాన పడితే నగరం మునుగుడే కాకతీయ రాజులు నిర్మించిన అనేక చెరువులు వరంగల్ నగరం చుట్టూ ఆక్రమణలకు గురయ్యాయి. ఆక్రమణల వల్ల గొలుసుకట్టు చెరువుల సిస్టం దెబ్బతిని ఐదు సెంటిమీటర్ల వర్షం పడితే చాలు నగరం మునిగిపోయే పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ఆక్రమణలను నియంత్రించకపోతే ఆ చెరువులు పూర్తిగా ఆనవాళ్లు లేకుండా పోయే ప్రమాదం ఉంది. – చీకటి రాజు, రాష్ట్ర కన్వీనర్, కాకతీయ వారసత్వ సంపద పరిరక్షణ కమిటీ లోకాయుక్తలో విచారణ జరుగుతోంది వరంగల్‌లో 8కి పైగా చెరువులు ఆక్రమణలకు గురయ్యాయి. వీటన్నింటిపై లోకాయుక్తలో ఫిర్యాదు చేశాం. భద్రకాళీ సహా అన్ని చెరువుల ఆక్రమణపై లోకాయుక్త కోర్టులో చేసిన ఫిర్యాదులపై తదుపరి విచారణ 2024 జూన్ 23న ఉంది. – సాంబరాజు చక్రపాణి, రాష్ట్ర అధ్యక్షుడు, వినియోగదారుల మండలి చెరువుల ఆక్రమణలపై నోటీసులు వరంగల్ నగరం, పరిసర ప్రాంతాల్లో చెరువుల ఆక్రమణలపై వచి్చన ఫిర్యాదులపై చర్యలు తీసుకుంటున్నాం. మా దృష్టికి వచి్చన వాటిని ఇతర అధికారులు, సిబ్బందితో కలిసి సందర్శించి ఆక్రమణదారులకు నోటీసులు ఇచ్చాము. పోలీసు, రెవెన్యూ అధికారులకు కూడా ఫిర్యాదులు చేశాం. – ఎ.సుధాకర్ రెడ్డి, ఎస్ఈ, జలవనరులశాఖ చదవండి: ‘థర్మల్’కు బై.. ‘రెన్యూవబుల్’కు జై! -
చెరువుకు శోకం.. రైతుకు శాపం
టి.నరసాపురం : మెట్ట ప్రాంతంలోని సాగునీటి చెరువులు ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కుచించుకుపోతున్నాయి. ఫలితంగా భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. సాగునీటి ఎద్దడి తలెత్తి రైతులు తీవ్ర నష్టాలకు గురవుతున్నారు. తాగునీటికీ కటకటలు తప్పడం లేదు. చెరువుల్ని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నీరు–చెట్టు పథకాన్ని అమలు చేస్తున్నా ఆచరణలో అంతంతమాత్రంగానే ఉంది. అధికార పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు ఈ పథకాన్ని చెరబట్టారు. నిధులు.. చెరువుల్లోని మట్టిపైన కన్నేసి అసలు లక్ష్యాన్ని నీరుగారుస్తున్నారు. అక్కడక్కడా పనులు చేపట్టినా ఆక్రమణలు తొలగించకుండా తూతూమంత్రంగా మట్టి తొలగించి అమ్ముకోవడానికే పరిమితమయ్యారు. వర్షాకాలం వచ్చినా.. తొలకరి వర్షాలు జిల్లాను పలకరించాయి. వేసవిలో పూర్తిగా ఎండిపోయిన చెరువులు నేడోరేపో నీటితో నిండే అవకాశాలున్నా రైతులకు అక్కరకు వచ్చే పరిస్థితి లేదు. వీటి కళింగలు శిథిలమయ్యాయి. ఇన్లెట్, అవుట్ లెట్స్ పూడుకుపోయాయి. దీనివల్ల చెరువుల్లోని నీరు పొలా ల్లోకి పారే అవకాశం లేకుండా పోయింది. భారీ వర్షాలు కురిసినప్పుడు చెరువులు పొంగితే మాత్రం పొలాలన్నీ నీటమునిగి పంట నష్టం ఏర్పడుతోంది. జిల్లాలో 100 ఎకరాలకు పైగా విస్తీర్ణం గల సాగునీటి చెరువులు 450 ఉండగా, సాధారణ, మధ్యస్థాయి చెరువులు 3,100 ఉన్నాయి. మొత్తంగా ఈ చెరువులన్నీ 1.80 లక్షల ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి. వీటిని అభివృద్ధి చేస్తే మెట్ట ప్రాంతంలో దాదాపు 10 లక్షలకు పైగా ఎకరాలకు సాగునీరు అందుతుంది. దీంతో రైతుల కష్టాలు తీరిపోతాయి. కానీ.. చెరువుల అభివృద్ధిపై ప్రభుత్వం కనీస శ్రద్ధ కూడా చూపటం లేదు. జిల్లాలోని అన్ని చెరువులు ఆక్రమణల బారినపడి బక్కచిక్కాయి. జమ్మి చెరువు పెద్ద ఉదాహరణ టి.నరసాపురం మండలం ముక్కినవారి గూడెంలో 108 ఎకరాల విస్తీర్ణంలో జమ్మి చెరువు ఉంది. దీనిని మినీ రిజర్వాయర్‌గా అభివృద్ధి చేయాలనే ప్రతిపాదన నేటికీ అమలుకు నోచుకోలేదు. ఈ చెరువు ఎగువ, దిగువ తూముల కింద 3 వేల ఎకరాల ఆయకట్టులో పంటలు సాగయ్యేవి. చెరువులో నీరుండటం వల్ల భూగర్భ జలమట్టం పెరిగి 10 గ్రామాల్లోని పొలాలకు మేలు కలిగేది. ఈ చెరువు లోతట్టులో దాదాపు 40 ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయి. ఎక్కడికక్కడ మడులు కట్టి మరీ వ్యవసాయం చేస్తున్నారు. గత ఏడాది కురిసిన వర్షాలకు చెరువు నిండి కళింగ పక్కన గండి పడింది. 6 వేల ఇసుక బస్తాలు వేసి గండిని తాత్కాలికంగా పూడ్చారు. ఈ చెరువు తూములు సైతం శిథిలావస్థకు చేరాయి. గత ఏడాది వేసిన ఇసుక బస్తాలు చివికిపోయాయి. ఇదే ప్రాంతంలో గండిపడే ప్రమాదం పొంచివుంది. అదే జరిగితే సమీపంలోని 3 వేల ఎకరాల్లో పంటలు నీటమునిగి రైతులు నష్టపోయే పరిస్థితి ఉంది. గండిపడితే ఆ పొలాల్లో ఇసుక మేటలు వేసే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. జమ్మిచెరువులోని ఆక్రమణల్ని తొలగించి.. మరమ్మతులు చేపట్టాలని ఏళ్ల తరబడి రైతులు కోరుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. ఈ పరిస్థితి ఒక్క జమ్మి చెరువుకే పరిమితం కాలేదు. మెట్టలోని అన్ని చెరువులు ఇలాంటి దుస్థితిలోనే కొట్టుమిట్టాడుతున్నాయి. కొత్త తూములు కట్టిస్తాం జమ్మిచెరువుకు తిరిగి గండిపడే అవకాశాలు ఉన్న విషయాన్ని ఇరిగేషన్ అసిస్టెంట్ ఇంజినీర్ ఎస్.ఇమ్మానియేల్ దృష్టికి తీసుకెళ్లగా.. రెండు కొత్త తూములు నిర్మించేందుకు రూ.20 లక్షలు మంజూరయ్యాయని చెప్పారు. చెరువు కళింగను పూర్తిస్థాయిలో ఆధునికీకరించడానికి రూ.కోటి ఖర్చవుతుందని అంచనా వేసి, ప్రభుత్వానికి నివేదించామని చెప్పారు. నిధులొస్తే ఆ పనులు చేపడతామన్నారు. గొలుసుకట్టు చెరువుల అభివృద్ధిలో భాగంగా ఏనుగుబంధం చెరువు, చింతల చెరువుకు రూ.4.50 లక్షల చొప్పున మంజూరయ్యాయన్నారు. ఈ నిధులతో ఆ చెరువులకు తూములు నిర్మిస్తున్నామన్నారు. మళ్లీ గండి తప్పదు వర్షాకాలం నెత్తిమీదకు వచ్చింది. గత ఏడాది జమ్మి చెరువు కట్టకు గండిపడింది. తాత్కాలికంగా ఇసుక బస్తాలు వేశారు. పటిష్టమైన చర్యలు చేపట్టలేదు. ఈ ఏడాది ఏ మాత్రం వర్షాలు పడినా గండిపడి పొలాలు నీట మునుగుతాయి. ఇసుక మేటలు వేస్తాయి. అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలి. – మక్కిన వెంకట గోపాలరావు, మాజీ సర్పంచ్ పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలి మెట్ట ప్రాంతంలోని చెరువులన్నీ ఆక్రమణల బారినపడ్డాయి. తూములు, కళింగలు శిథిలావస్థకు చేరాయి. మరమ్మతులు చేయకపోవడంతో ఏటా రైతులు నష్టపోతున్నారు. భూగర్భ జలాలు పడిపోయాయి. అతిపెద్దదైన జమ్మిచెరువును పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలి. చెరువు కట్టకు గండిపడకుండా వెంటనే చర్యలు చేపట్టాలి. అన్ని చెరువుల్లో ఆక్రమణలు తొలగించాలి. – ఆకుల శ్రీను, రైతు, మక్కినవారి గూడెం ప్రధాన పనులు వదిలేసి.. ఎంతో ప్రాధాన్యత ఉన్న జమ్మి చెరువు అభివృద్ధిని గాలికొదిలేశారు. ఎందుకూ పనికిరాని ఏనుగు బంధం, చింతల చెరువులకు కొత్తగా తూములు కట్టిస్తున్నారు. ఆ చెరువుల కింద సాగయ్యే విస్తీర్ణం లేదు. నీరు పారే అవకాశం కూడా లేదు. అయినా అటువంటి చెరువులకు వృథాగా డబ్బు ఖర్చు చేస్తున్నారు. రైతులందరికీ ఉపయోగపడే జమ్మి చెరువును పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలి. – సిరిమళ్ల వెంకట సత్యనారాయణ, రైతు, మక్కినవారి గూడెం -
చెరువుకు శోకం.. రైతుకు శాపం
టి.నరసాపురం : మెట్ట ప్రాంతంలోని సాగునీటి చెరువులు ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కుచించుకుపోతున్నాయి. ఫలితంగా భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. సాగునీటి ఎద్దడి తలెత్తి రైతులు తీవ్ర నష్టాలకు గురవుతున్నారు. తాగునీటికీ కటకటలు తప్పడం లేదు. చెరువుల్ని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నీరు–చెట్టు పథకాన్ని అమలు చేస్తున్నా ఆచరణలో అంతంతమాత్రంగానే ఉంది. అధికార పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు ఈ పథకాన్ని చెరబట్టారు. నిధులు.. చెరువుల్లోని మట్టిపైన కన్నేసి అసలు లక్ష్యాన్ని నీరుగారుస్తున్నారు. అక్కడక్కడా పనులు చేపట్టినా ఆక్రమణలు తొలగించకుండా తూతూమంత్రంగా మట్టి తొలగించి అమ్ముకోవడానికే పరిమితమయ్యారు. వర్షాకాలం వచ్చినా.. తొలకరి వర్షాలు జిల్లాను పలకరించాయి. వేసవిలో పూర్తిగా ఎండిపోయిన చెరువులు నేడోరేపో నీటితో నిండే అవకాశాలున్నా రైతులకు అక్కరకు వచ్చే పరిస్థితి లేదు. వీటి కళింగలు శిథిలమయ్యాయి. ఇన్లెట్, అవుట్ లెట్స్ పూడుకుపోయాయి. దీనివల్ల చెరువుల్లోని నీరు పొలా ల్లోకి పారే అవకాశం లేకుండా పోయింది. భారీ వర్షాలు కురిసినప్పుడు చెరువులు పొంగితే మాత్రం పొలాలన్నీ నీటమునిగి పంట నష్టం ఏర్పడుతోంది. జిల్లాలో 100 ఎకరాలకు పైగా విస్తీర్ణం గల సాగునీటి చెరువులు 450 ఉండగా, సాధారణ, మధ్యస్థాయి చెరువులు 3,100 ఉన్నాయి. మొత్తంగా ఈ చెరువులన్నీ 1.80 లక్షల ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి. వీటిని అభివృద్ధి చేస్తే మెట్ట ప్రాంతంలో దాదాపు 10 లక్షలకు పైగా ఎకరాలకు సాగునీరు అందుతుంది. దీంతో రైతుల కష్టాలు తీరిపోతాయి. కానీ.. చెరువుల అభివృద్ధిపై ప్రభుత్వం కనీస శ్రద్ధ కూడా చూపటం లేదు. జిల్లాలోని అన్ని చెరువులు ఆక్రమణల బారినపడి బక్కచిక్కాయి. జమ్మి చెరువు పెద్ద ఉదాహరణ టి.నరసాపురం మండలం ముక్కినవారి గూడెంలో 108 ఎకరాల విస్తీర్ణంలో జమ్మి చెరువు ఉంది. దీనిని మినీ రిజర్వాయర్‌గా అభివృద్ధి చేయాలనే ప్రతిపాదన నేటికీ అమలుకు నోచుకోలేదు. ఈ చెరువు ఎగువ, దిగువ తూముల కింద 3 వేల ఎకరాల ఆయకట్టులో పంటలు సాగయ్యేవి. చెరువులో నీరుండటం వల్ల భూగర్భ జలమట్టం పెరిగి 10 గ్రామాల్లోని పొలాలకు మేలు కలిగేది. ఈ చెరువు లోతట్టులో దాదాపు 40 ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయి. ఎక్కడికక్కడ మడులు కట్టి మరీ వ్యవసాయం చేస్తున్నారు. గత ఏడాది కురిసిన వర్షాలకు చెరువు నిండి కళింగ పక్కన గండి పడింది. 6 వేల ఇసుక బస్తాలు వేసి గండిని తాత్కాలికంగా పూడ్చారు. ఈ చెరువు తూములు సైతం శిథిలావస్థకు చేరాయి. గత ఏడాది వేసిన ఇసుక బస్తాలు చివికిపోయాయి. ఇదే ప్రాంతంలో గండిపడే ప్రమాదం పొంచివుంది. అదే జరిగితే సమీపంలోని 3 వేల ఎకరాల్లో పంటలు నీటమునిగి రైతులు నష్టపోయే పరిస్థితి ఉంది. గండిపడితే ఆ పొలాల్లో ఇసుక మేటలు వేసే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. జమ్మిచెరువులోని ఆక్రమణల్ని తొలగించి.. మరమ్మతులు చేపట్టాలని ఏళ్ల తరబడి రైతులు కోరుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. ఈ పరిస్థితి ఒక్క జమ్మి చెరువుకే పరిమితం కాలేదు. మెట్టలోని అన్ని చెరువులు ఇలాంటి దుస్థితిలోనే కొట్టుమిట్టాడుతున్నాయి. కొత్త తూములు కట్టిస్తాం జమ్మిచెరువుకు తిరిగి గండిపడే అవకాశాలు ఉన్న విషయాన్ని ఇరిగేషన్ అసిస్టెంట్ ఇంజినీర్ ఎస్.ఇమ్మానియేల్ దృష్టికి తీసుకెళ్లగా.. రెండు కొత్త తూములు నిర్మించేందుకు రూ.20 లక్షలు మంజూరయ్యాయని చెప్పారు. చెరువు కళింగను పూర్తిస్థాయిలో ఆధునికీకరించడానికి రూ.కోటి ఖర్చవుతుందని అంచనా వేసి, ప్రభుత్వానికి నివేదించామని చెప్పారు. నిధులొస్తే ఆ పనులు చేపడతామన్నారు. గొలుసుకట్టు చెరువుల అభివృద్ధిలో భాగంగా ఏనుగుబంధం చెరువు, చింతల చెరువుకు రూ.4.50 లక్షల చొప్పున మంజూరయ్యాయన్నారు. ఈ నిధులతో ఆ చెరువులకు తూములు నిర్మిస్తున్నామన్నారు. మళ్లీ గండి తప్పదు వర్షాకాలం నెత్తిమీదకు వచ్చింది. గత ఏడాది జమ్మి చెరువు కట్టకు గండిపడింది. తాత్కాలికంగా ఇసుక బస్తాలు వేశారు. పటిష్టమైన చర్యలు చేపట్టలేదు. ఈ ఏడాది ఏ మాత్రం వర్షాలు పడినా గండిపడి పొలాలు నీట మునుగుతాయి. ఇసుక మేటలు వేస్తాయి. అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలి. – మక్కిన వెంకట గోపాలరావు, మాజీ సర్పంచ్ పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలి మెట్ట ప్రాంతంలోని చెరువులన్నీ ఆక్రమణల బారినపడ్డాయి. తూములు, కళింగలు శిథిలావస్థకు చేరాయి. మరమ్మతులు చేయకపోవడంతో ఏటా రైతులు నష్టపోతున్నారు. భూగర్భ జలాలు పడిపోయాయి. అతిపెద్దదైన జమ్మిచెరువును పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలి. చెరువు కట్టకు గండిపడకుండా వెంటనే చర్యలు చేపట్టాలి. అన్ని చెరువుల్లో ఆక్రమణలు తొలగించాలి. – ఆకుల శ్రీను, రైతు, మక్కినవారి గూడెం ప్రధాన పనులు వదిలేసి.. ఎంతో ప్రాధాన్యత ఉన్న జమ్మి చెరువు అభివృద్ధిని గాలికొదిలేశారు. ఎందుకూ పనికిరాని ఏనుగు బంధం, చింతల చెరువులకు కొత్తగా తూములు కట్టిస్తున్నారు. ఆ చెరువుల కింద సాగయ్యే విస్తీర్ణం లేదు. నీరు పారే అవకాశం కూడా లేదు. అయినా అటువంటి చెరువులకు వృథాగా డబ్బు ఖర్చు చేస్తున్నారు. రైతులందరికీ ఉపయోగపడే జమ్మి చెరువును పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలి. – సిరిమళ్ల వెంకట సత్యనారాయణ, రైతు, మక్కినవారి గూడెం