
నేరెళ్ల మూలమలుపు వద్ద శిథిలమైన జాతీయ రహదారి
సాక్షి, బుగ్గారం: ధర్మపురి నుంచి జగిత్యాలకు వెళ్లే జాతీయ రహదారిపై నేరెళ్ల గ్రామ సమీపంలోని గుట్ట వద్ద రహదారి పూర్తిగా శిథిలమైంది. దీంతో వాహనదారులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. రహదారి అంతా గుంతలమయంగా మారడంతో రాత్రిపూట వాహనదారులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. రహదారి గుంతలమయం కావడమే కాకుండా, మూల మలుపు ప్రాంతం కూడా కావడంతో గతంలో ఇదే ప్రాంతంలో వాహనాలు నియంత్రణ కోల్పోయి పలు ప్రమాదాలు సంభవించాయి. పలుమార్లు వాహనాలు బోల్తా పడడంతో పాటు కొంతమంది చనిపోయిన సంఘటనలూ ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి రహదారికి మరమ్మతులు చేయాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment