నిందితుడు గంగారాం
మేడిపెల్లి(వేములవాడ)/కోరుట్ల: ఎనిమిదేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. జగిత్యాల జిల్లా మేడిపెల్లి మండలం పసునూర్‌లో గురువారం సాయం త్రం ఈ సంఘటన జరిగింది. గ్రామానికి చెందిన బెజ్జంకి గంగారెడ్డి అలియాస్ గంగారాం (50) 3 నెలల క్రితం పంచాయతీ పారిశుధ్య కార్మికుడిగా విధుల్లో చేరాడు. కాగా, స్థానిక ప్రాథమిక పాఠశాలలో రెండోతరగతి చదువుతున్న ఎనిమిదేళ్ల చిన్నారితోపాటు ఆమె అక్క, మరో బాలిక స్కూల్ నుంచి ఇంటికి తిరిగివస్తుండగా గంగారాం వారికి చాక్లెట్లు కొనిస్తానని నమ్మించాడు. అతడిని నమ్మిన ఆచిన్నారులు అతడి వెంటవెళ్లారు. అందులో ఎనిమిదేళ్ల చిన్నారిని గ్రామపంచాయతీ భవనంలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఇది గమనించిన అంగన్‌వాడీ టీచర్ చిన్నారి ఇంటికెళ్లి తల్లికి విషయం చెప్పింది. సర్పంచ్ సహకారంతో పోలీసులకు సమాచారం అందించగా మెట్‌పల్లి డీఎస్పీ గౌస్‌బాబా, కోరుట్ల సీఐ రాజశేఖరరాజు, మేడిపెల్లి ఎస్సై శ్రీనివాస్ రాత్రి పసునూర్‌కు చేరుకొని విచారణ చేపట్టారు. తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. నిందితుడు బెజ్జంకి గంగారాంను శుక్రవారం అరెస్టు చేసినట్లు సీఐ రాజశేఖరరాజు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment