సాక్షి, కొండగట్టు(జాగిత్యాల) : గ్రామాల్లో ఒకప్పుడు ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి వెళ్లాలంటే రవాణా సౌకర్యాం కోసం ఎండ్లబండి మీదనే ప్రయాణాలు సాగించే వారు. బంధువుల ఇంటికి, ఇతర గ్రామాలకు వెళ్లాలన్న అప్పటి గ్రామీణ ప్రజలకు ఎండ్లబండిని ముఖ్య ఆధారం చేసుకునేవారు. దీంతో బండిలో ప్రయాణం చేసేందుకు పిల్లలు ఎంతో సంతోషంగా గంతులు వేస్తు వెళ్లేవారు.పొలం పనులకు, ఇతరత్ర పనులకు ఎడ్లబండిని వినియోగించేవారు.
ప్రస్తుత పరిస్థితుల్లో గ్రామంలో ఇంటికో కారు, ద్విచక్రవాహనం ఉన్నాయి. గ్రామాలకు వెళ్లేందుకు బస్సులు అందుబాటులోకి రావడంతో ఎండ్లబండి ప్రయాణం కనుమరుగైంది. అనాటి ఎండ్లబండి ప్రయాణం నేటికి మర్చిపోని తీపి జ్నాపకం. ముడిసరుకుల రవాణాకు ఎండ్లబండినే ఉపయోగించేవారు. వ్యవసాయంపై వచ్చిన పంటధాన్యాన్ని తమ ఇండ్లలోకి బండ్ల ద్వారానే తరలించేవారు. ప్రస్తుతం అంతా యంత్రాల మయంగా మారింది. ఆ కాలంలో యంత్రాలు లేకపోవడంతో వరిధాన్యాలకు ఎండ్ల బండ్లను ఉపయోగించేవారు.
కాలుష్యం ఉండేది కాదు
ఆకాలంలో బండ్ల ద్వారా రవాణా ఉండటం వల్ల ఎలాంటి కాలుష్యం ఉండేది కాదు. నేడు ట్రాక్టర్లు, వ్యాన్‌లు, లారీలు, డీసీఎం వంటి వాహనాలతో ఎంతో కాలుష్యం వెలువడుతోంది. దీంతో బండ్ల ఆదరణ తక్కువయింది. గ్రామానికి ఒకటైనా కానరావడం లేదు. ఆరోజుల్లో ప్రయాణం సురక్షితంగా ఉండేది.
తీర్థయాత్రలకు సైతం
కుటుంబ సమేతంగా తీర్థయాత్రలకు ఎండ్ల బండిలోనే వెళ్లేవారు. దీంతో వారి అనుభూతులు ఆప్యాయతలు తెలుపుకునేవారు. దీంతో కాలుష్యం కాకుండా ప్రమాదాలు కూడా అయ్యేవి కావు. మొత్తానికి రానున్న రోజుల్లో ఎండ్లబండ్ల పుస్తకాల్లో చూడాల్సిన పరిస్థితి నెలకొననుంది.
Comments
Please login to add a commentAdd a comment