Bullock carts
-
ఎడ్లంటే ప్రేమ.. పోటీలకు సై..
పొదలకూరు: ఆ యువకుడికి వ్యవసాయమన్నా, పశువుల పెంపకమన్నా ప్రాణం. ఉన్నత చదువులు చదివి సాఫ్ట్‌వేర్‌గా ఉద్యోగం చేస్తున్నా.. మనసంతా ఎడ్లపైనే ఉండేది. ఆ మమకారంతోనే రెండు కోడె దూడలను కొనుగోలు చేసి వాటికి రాముడు, భీముడు అని ముద్దుగా పేర్లు పెట్టుకుని పిలుస్తున్నాడు. అవి ఇప్పుడు పెద్దవయ్యాయి. రాష్ట్రస్థాయి ఎడ్ల పందేల్లో (బండ లాగుడు) పాల్గొని అవి ప్రథమ స్థానంలో నిలవాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నాడు.ఆలనాపాలనకు ప్రత్యేకంగా ఒకరు కోడెదూడలను కొనుగోలు చేసిన నాటి నుంచి వాటి ఆరోగ్యంపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నాను. వాటిని రాముడు, భీముడు అనే పేర్లతో మా కుటుంబమంతా పిలుచుకుంటున్నాం. వాటి ఆలనాపాలనకు నెల జీతం ఇచ్చి ఓ మనిషిని కూడా ఏర్పాటు చేశాను. చెబితే అతిశయోక్తిగా ఉంటుందేమో కానీ వాటి పోషణకు నిత్యం రూ.2 వేలు వరకు ఖర్చు చేస్తున్నాను. పశుగ్రాసంతోపాటు ఉలవలు, జొన్నలు కూడా పెడుతున్నాం. నేను కోడెలను కొని మూడేళ్లయింది. వాటి వయసు ఇప్పుడు నాలుగేళ్లు. పోటీలకు సిద్ధం చేసే ఉద్దేశంతో శిక్షణ ఇప్పిస్తున్నాను. తోటలోనే పరుగులు తీయించి అలసటను తట్టుకునేలా అలవాటు చేస్తున్నాను. పశువైద్యుల సలహాలు సూచనలు తీసుకుని వాటి ఆరోగ్యంపై పరీక్షలు కూడా చేయిస్తున్నాను. ఏదో తెలియని వెలితి ఆ యువకుడి పేరు బుధవరపు ప్రతాప్. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం బిరదవోలు పంచాయతీ ముత్యాలపేట గ్రామం. సాక్షి అతడిని పలుకరించగా ఏం చెప్పారంటే... మాది వ్యవసాయ కుటుంబం. నేను కావలి విట్స్ ఇంజినీరింగ్ కాలేజీలో చదివాను. ఐదేళ్ల క్రితం హైదరాబాద్ హెచ్‌సీఎల్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగంలో చేరాను. కరోనా సమయంలో వర్క్‌ఫ్రం హోమ్‌లో భాగంగా ఇంటి నుంచే పనిచేసేవాడిని.చదవండి: సింహపురి ‘కోడల్లుళ్లు’ వచ్చేశారోచ్!ఉద్యోగంలో జీతం బాగానే వస్తున్నా ఏదో తెలియని వెలితి ఉండేది. తాత, తండ్రుల నుంచి పోషిస్తున్న ఎడ్లపై అభిలాష కలిగింది. ఒంగోలు జాతికి చెందిన కోడెలు కొనుగోలు చేసి పోషించాలని భావించి మా నాన్న పెంచలయ్యతో చెప్పాను. దానికి ఆయన మొదట సందేహించినా నా ఇష్టాన్ని కాదనలేదు. తండ్రి సహకారంతో వెంకటాచలం మండలం సర్వేపల్లి గ్రామంలో 8 నెలల వయస్సు ఉన్న దూడను రూ.80 వేలు వెచ్చించి, అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఏడాది వయసున్న దూడను రూ.లక్ష వెచ్చించి కొన్నాను. ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తున్నా రాముడు, భీముడుకు ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తే రాష్ట్రస్థాయి బండలాగుడు పోటీల్లో రాణిస్తాయని నమ్మకంగా ఉంది. ఇందుకోసం నెలకు రూ.30 వేలు వెచ్చించి వైఎస్సార్ జిల్లా చెన్నూరులో నెల కిందటే శిక్షకుడి వద్ద వదిలిపెట్టాను. ప్రతినిత్యం వాటిని వీడియోకాల్‌లో చూసుకుంటూ శిక్షణకు ఎలా సహకరిస్తున్నాయో తెలుసుకుంటున్నాను. నా ఎడ్ల గురించి తెలిసిన కొందరు రైతులు మంచి ధరతో కొనుగోలు చేస్తామని ముందుకొచ్చినా నేను ససేమేరా అన్నాను. బండలాగుడు పోటీల్లో అవి ప్రథమ స్థానంలో నిలవడమే నా లక్ష్యం. -
పోలీస్ స్టేషన్ కు ఎడ్ల బండ్లు..
-
Sagubadi: వారెవ్వా! ఇకపై బండి లాగే ఎద్దుల కష్టం తగ్గుతుంది!
బండి లాగే ఎద్దుల కష్టం తగ్గించడంతో పాటు రైతుల దైనందిన జీవనాన్ని సులభతరం చేసేందుకు దోహదపడే చక్కని ఆవిష్కరణను అందించి ప్రజలందరితోనూ శభాష్ అనిపించుకుంటున్నారు మహారాష్ట్ర ఇంజనీరింగ్ విద్యార్థులు. సంగ్లికి సమీపంలోని రాజారాంబాపు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఆర్.ఐ.టి.)కి చెందిన ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ విద్యార్థులు మూగ జీవాల భుజాలపై బరువును తగ్గించే గొప్ప ఆవిష్కరణను అందించారు. బండిలో సరుకు బరువంతా దానికి ఉన్న రెండు చక్రాల మీద ఉంటుంది. అంతిమంగా ఆ బరువు బండిని లాగడానికి కట్టిన జత ఎద్దుల మెడలపై పడుతుంది. బండిపై చెరకు గడల్లాంటి భారీ లోడు వేసుకొని రోడ్డుపై లాక్కెళ్తున్న క్రమంలో స్పీడ్ బ్రేకర్లు వచ్చినప్పుడు, రాళ్లు రప్పలు, గోతులు, ఎత్తు, పల్లాలు వచ్చినప్పుడు జోడెట్లపై తీవ్ర వత్తిడి ఉంటుంది. ఆ వత్తిడిలో ఒక్కోసారి ఎద్దుల కాళ్లు మడతపడి గిట్టలు దెబ్బతినటం, కాళ్లు విరగటం వంటి పరిస్థితులు కూడా తలెత్తుతూ ఉంటాయి. అటువంటప్పుడు రైతుకూ చాలా కష్టం కలుగుతుంది. పనులు ఆగిపోవడమే కాకుండా ఆర్థిక నష్టం కూడా జరుగుతుంది. మహారాష్ట్రలో 200కు పైగా చక్కెర మిల్లులకు ఎడ్ల బండ్లపైనే చెరకు గడలను రైతులు తోలుకెళ్తూ ఉంటారు. ఒక్కో మిల్లు పరిధిలో 250 వరకు ఎడ్ల బండ్లు ఉంటాయి. ఓవర్ లోడింగ్ తదితర కారణాల వల్ల తరచూ ప్రమాదాలు జరగడం గమనించిన బీటెక్ ఆటోమొబైల్ ఇంజినీరింగ్ నాలుగో సంవత్సరం విద్యార్థులు ఎద్దుల బండ్ల రైతులు, ఎద్దులు ఎదుర్కొంటున్న సమస్యలనే ప్రాజెక్టుకు ఎంపిక చేసుకున్నారు. ‘సారధి’... ఈ ప్రాజెక్టుకు ‘సారధి’ అని పేరుపెట్టారు. సౌరభ్ భోసాలే, ఆకాష్ కదమ్, నిఖిల్ టిపైలే, ఆకాష్ గైక్వాడ్, ఓంకార్ మిరాజ్‌కర్‌తో కూడిన విద్యార్థి బృందానికి అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.సుప్రియా సావంత్ మార్గనిర్దేశం చేశారు. ఈ పరిశోధన క్రమంలో రెండు చక్రాల బండిని లాక్కెళ్లే ఎద్దుల మెడపై పడుతున్న బరువును తగ్గించేందుకు విద్యార్థులు మంచి ఆలోచన చేశారు. రెండు చక్రాల బండి ముందు వైపు పోల్‌కు, రెండు ఎద్దుల మధ్యలో, ఒక చిన్న టైరుతో కూడిన చక్రాన్ని బిగించారు. దీన్ని అమర్చటం వల్ల ఎద్దుల మెడపై పడే బరువులో 80% తగ్గిపోయిందని డా.సుప్రియా సావంత్ తెలిపారు. మిగతా 20% బరువును ఎద్దులు సునాయాసంగా భరించగలుగుతాయి. ఎక్కువ సేపు, ఎక్కువ దూరం అలసిపోకుండా బండిని లాక్కెళ్ల గలుగుతాయి. ‘థర్డ్ రోలింగ్ సపోర్ట్’ ఈ టైరును ‘థర్డ్ రోలింగ్ సపోర్ట్’ అని పిలుస్తున్నారు. ఎద్దుల ఎత్తును బట్టి దీని ఎత్తును సరిచేసుకోవటానికి అవకాశం కల్పించటంతో ఈ ఆవిష్కరణ విజయవంతమైంది. పొలంలో చెరకు గడలను కూలీలు బండికి లోడ్ చేస్తున్న సమయంలో కూడా టైరుతో కూడిన చక్రం సపోర్టుగా నిలుస్తోంది. ఓవర్ లోడ్ చేయడం వల్ల రోడ్డుపై వెళ్లున్నప్పుడు స్పీడ్ బ్రేకర్లపై ఎద్దుల కాళ్లు జారిపోవడం, కాళ్లు మెలికలు తిరగడం వంటి అనేక ఇబ్బందులు కూడా ఈ ఆవిష్కరణతో తగ్గుతాయి. మేధోహక్కుల కోసం పేటెంట్ కార్యాలయంలో దరఖాస్తు దాఖలు చేశారు. అద్భుతమైన ఈ ఆవిష్కరణ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రైతులు, కార్మికులు, కూలీలతో పాటు నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపించారు. ప్రాజెక్టు పరిశోధన కాలంలో అండగా నిలిచి తోడ్పాటునందించిన ప్రొఫెసర్లు డాక్టర్ ఎస్.ఆర్. కుంభార్, ప్రొఫెసర్ పి.ఎస్. ఘటగే, ఆర్.ఐ.టి. డైరెక్టర్ డాక్టర్ సుష్మా కులకర్ణిలకు రుణపడి ఉంటామని సౌరభ్ ఆవిష్కర్తలు కృతజ్ఞతలు తెలిపారు. రైతు సంఘాలు, స్వచ్ఛంద సంస్థల తోడ్పాటుతో వచ్చే చెరకు క్రషింగ్ సీజన్లో ఈ ఆవిష్కరణను రైతులకు ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తేవడానికి కృషి చేస్తున్నామని ఆవిష్కర్తల్లో ఒకరైన సౌరభ్ భోసాలే ‘సాక్షి’కి తెలిపారు. చదవండి: Terrace Garden: చక్కనింట.. మిద్దె పంట .. ఆదాయం.. ఆరోగ్యం बैलों का लोड कम करने के लिए बैलगाड़ी पर लगाया गया रोलिंग स्पोर्ट. फ़ोटो: साभार pic.twitter.com/icjwYkd0Ko — Awanish Sharan (@AwanishSharan) July 14, 2022 -
ఏజెన్సీలో ఎడ్లబండి అంబులెన్స్..
సాక్షి,నార్నూర్(గాదిగూడ): ఏజెన్సీ పరిధిలో రోడ్డు, రవాణా సౌకర్యాలు లేక అంబులెన్స్ వెళ్లలేని గ్రామాలకు వెళ్లి బాధితులను ఆస్పత్రికి తీసుకువచ్చేలా ఐటీడీఏ ఎడ్లబండి అంబులెన్స్ ఏర్పాటు చేసింది. గాదిగూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో దీనిని అందుబాటులో ఉంచారు. బాధితులను ఆస్పత్రికి తరలించడం ఆలస్యమైతే ప్రాణాలు పోతున్న నేపథ్యంలో ఎడ్లబండి అంబెలెన్స్ ఏర్పాటు చేసినట్లు ఏజెన్సీ అదనపు వైద్యాధికారి డాక్టర్ మనోహర్ తెలిపారు. గ్రామానికి చెందిన వారు ఎవరైనా ఎడ్లబండిపై బాధితులను ఆస్పత్రికి తీసుకొస్తే వారికి రూ.1,300 రవాణా చార్జీ ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. గిరిజనులు ఎడ్లబండి అంబులెన్స్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. చదవండి: రూ.10 కోసం గొడవ.. ఇంటికొచ్చి మరీ కాల్చి చంపిన దుండగులు -
కార్లు వదిలి.. ఎడ్ల బండ్లపై.. ఎందుకిలా?
ఇండోర్ : మధ్యప్రదేశ్‌లో ఇండోర్ సమీపంలోని పలాడ ఇండస్ట్రియల్ ప్రాంతంలో ఓ వింత సంఘటన చోటుచేసుకుంది. ఆడీ, బీఎండబ్ల్యూ కార్లను వదిలి పారిశ్రామికవేత్తలు ఎడ్లబండ్లు పట్టారు. ఇండోర్‌కు 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న పలాడ ఇండస్ట్రియల్ పాంతానికి వెళ్లే రోడ్లు ఎన్నో ఏళ్లుగా దుర్బరస్థితిలో ఉన్నాయి. ఒక్క వర్షం కురిస్తే బురదతో కనీసం నడవడం కూడా ఇబ్బంది అయ్యేలా రోడ్లు తయారయ్యాయి. దీంతో ఎన్నోసార్లు రోడ్ల విషయమై ఉన్నతాధికారులకు మొరపెట్టుకున్నా ఎవరూ పట్టించుకోలేదు. (ఇది బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ కాదు: సోనియా గాంధీ) దీంతో పలాడ ఇండస్ట్రియల్ ప్రాంతంలో పరిశ్రమలు నిర్వహిస్తున్న యజమానులు, ఉన్నతాధికారులు ఖరీదైన తమ కార్లను వదిలేసి, ఎడ్లబండ్లు ఎక్కి తమ నిరసనను ప్రభుత్వానికి తెలిపారు. పారిశ్రామికవేత్తలు ఎడ్లబండి నడుపుతున్న ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.(సరిహద్దుల్లో చైనా సన్నద్ధత?.. నిజమెంత!) -
ఎడ్లబండ్లు యాడికిపాయే!
సాక్షి, కొండగట్టు(జాగిత్యాల) : గ్రామాల్లో ఒకప్పుడు ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి వెళ్లాలంటే రవాణా సౌకర్యాం కోసం ఎండ్లబండి మీదనే ప్రయాణాలు సాగించే వారు. బంధువుల ఇంటికి, ఇతర గ్రామాలకు వెళ్లాలన్న అప్పటి గ్రామీణ ప్రజలకు ఎండ్లబండిని ముఖ్య ఆధారం చేసుకునేవారు. దీంతో బండిలో ప్రయాణం చేసేందుకు పిల్లలు ఎంతో సంతోషంగా గంతులు వేస్తు వెళ్లేవారు.పొలం పనులకు, ఇతరత్ర పనులకు ఎడ్లబండిని వినియోగించేవారు. ప్రస్తుత పరిస్థితుల్లో గ్రామంలో ఇంటికో కారు, ద్విచక్రవాహనం ఉన్నాయి. గ్రామాలకు వెళ్లేందుకు బస్సులు అందుబాటులోకి రావడంతో ఎండ్లబండి ప్రయాణం కనుమరుగైంది. అనాటి ఎండ్లబండి ప్రయాణం నేటికి మర్చిపోని తీపి జ్నాపకం. ముడిసరుకుల రవాణాకు ఎండ్లబండినే ఉపయోగించేవారు. వ్యవసాయంపై వచ్చిన పంటధాన్యాన్ని తమ ఇండ్లలోకి బండ్ల ద్వారానే తరలించేవారు. ప్రస్తుతం అంతా యంత్రాల మయంగా మారింది. ఆ కాలంలో యంత్రాలు లేకపోవడంతో వరిధాన్యాలకు ఎండ్ల బండ్లను ఉపయోగించేవారు. కాలుష్యం ఉండేది కాదు ఆకాలంలో బండ్ల ద్వారా రవాణా ఉండటం వల్ల ఎలాంటి కాలుష్యం ఉండేది కాదు. నేడు ట్రాక్టర్లు, వ్యాన్లు, లారీలు, డీసీఎం వంటి వాహనాలతో ఎంతో కాలుష్యం వెలువడుతోంది. దీంతో బండ్ల ఆదరణ తక్కువయింది. గ్రామానికి ఒకటైనా కానరావడం లేదు. ఆరోజుల్లో ప్రయాణం సురక్షితంగా ఉండేది. తీర్థయాత్రలకు సైతం కుటుంబ సమేతంగా తీర్థయాత్రలకు ఎండ్ల బండిలోనే వెళ్లేవారు. దీంతో వారి అనుభూతులు ఆప్యాయతలు తెలుపుకునేవారు. దీంతో కాలుష్యం కాకుండా ప్రమాదాలు కూడా అయ్యేవి కావు. మొత్తానికి రానున్న రోజుల్లో ఎండ్లబండ్ల పుస్తకాల్లో చూడాల్సిన పరిస్థితి నెలకొననుంది. -
తాండూరులో ఎడ్లబండ్లతో ర్యాలీ
తాండూరు మండలాన్ని ఆదిలాబాద్ జిల్లాలోనే ఉంచాలని కోరుతూ తాండూరులో ఆందోళనలు సాగుతున్నాయి. అఖిల పక్షం నేతృత్వంలో కొందరు నాయకులు గురువారం తాండూర్‌లో దుకాణాలు బంద్ చేయించారు. కొత్తగా అవతరించిన మంచిర్యాల జిల్లాలో మండలాన్ని కలుపవద్దంటూ మండల కేంద్రంలో ఎడ్లబండ్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. మండల కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. అయితే, మూసి వేసిన షాపులను జడ్పీటీసీ సురేష్‌బాబు తిరిగి తెరిపించటంతో ఆయనతో కొందరు వాదులాటకు దిగారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మంచిర్యాల జిల్లా ఏర్పాటు చేసినందుకు, తాండూరును మంచిర్యాలలో కలిపినందుకు కృతజ్ఞతతో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కేసీఆర్ చిత్రపటానికి పాలతో అభిషేకం చేశారు. -
ఏరువాకా సాగారో..
గ్రామాల్లో సోమవారం ఏరువాక జోరుగా సాగింది. అక్షయ తృతీయను పురస్కరించుకుని రైతులు తమ కాడెద్దులు, ఎడ్లబండ్లను అలంకరించారు. బోనాలు, ఎడ్లబండ్లతో పొలాలకు వెళ్లి భూమిపూజ చేశారు. ఈ ఏడాది పంటలు బాగా పండాలని భగవంతుడిని ప్రార్థించారు. అరకలు కట్టి దుక్కులు దున్నారు. అక్షయ తృతీయనుపురస్కరించుకుని సోమవారం గ్రామాల్లో ఏరువాక సాగించారు. రైతులు తమ కాడెద్దులు, ఎడ్లబండ్లను అందంగా అలంకరించారు. బోనాలు, ఎడ్లబండ్లతో వ్యవసాయ పొలాల్లోకి వెళ్లి భూమిపూజ నిర్వహించారు. ఈ సంవత్సరం పంటలు బాగా పండి సుఖసంతోషాలతో ఉండేలా చూడాలని భగవంతుడిని ప్రార్థించారు. అరకలు కట్టి దుక్కులు దున్నడం ప్రారంభించారు. -
ఇంటి‘వలస’
పొట్టకూటికి ఇల్లు, వృద్ధులు, పిల్లల్ని వదిలి వెళ్లిన వారంతా తిరిగి ఇంటిముఖం పట్టారు. కంగ్టి మండలంలోని ఆరు వేల మందికిపైగా కూలీలు బోధన్, కామారెడ్డి,మాగి, సంగారెడ్డి , మెదక్ చెరకు కర్మాగారాల పరిధిలోని చెరకు నరికే పనులకు వెళ్లారు. గత సెప్టెంబరులో వలసబాట పట్టిన వీరంతా శుక్రవారం తిరిగి ఒక్కొక్కరే ఇంటిముఖం పట్టారు. ఎడ్లబండ్లపై సరంజామా సర్దుకుని స్వగ్రామాలకు చేరారు. - కంగ్టి -
10,000 ఎడ్ల బండ్లు వస్తయ్..
మేడారంలో పది క్యాంపులు కోళ్లకు కూడా వైద్య పరీక్షలు జాతర ముగిసే వరకు మూడు షెడ్యూళ్లు పశు సంవర్థక శాఖ జాయింట్ డెరైక్టర్ వెంకయ్య నాయుడు తమ కోర్కెలు తీర్చితే మేడారం జాతరకు ఎడ్లబండ్లపై వస్తామని కొందరు అమ్మవార్లను మొక్కుతుంటారు. ఈ మేరకు మొక్కును తీర్చుకునేందుకు కుటుంబసమేతంగా ఎడ్ల బండ్లపై జాతరకు వస్తుంటారు. ప్రస్తుతం బస్సులు, ప్రైవేట్ వాహనాలు ఎక్కువ కావడంతో వాటి సంఖ్య తక్కువగా ఉంటుంది. గత జాతరకు సుమారు 15 వేల ఎడ్ల బండ్లు వచ్చాయి. ఈసారి 10 వేలు ఎడ్ల బండ్లు వస్తాయని అంచనా వేస్తున్నాం. మేడారం పశువులకు టీకాలు తాడ్వాయి మండలంలోని 43 గ్రామాల్లో ఉన్న పశువులను ఇప్పటికే గుర్తించాం. జనవరి 30 వరకే మండల పరిధిలోని పశువుల కు వ్యాధి నిరోధక టీకాలు వేయించాం. ఆయా గ్రామాల్లోని రైతులు జాతర సమయంలో తమ పశువులను బయటకు వదల వద్దని ఇప్పటికే సూచించాం. జాతర ముగి సిన నెలరోజుల వరకు పశువులను బయట కు పంపించొద్దని సమాచారం అందించాం. రూ.9 లక్షలు మంజూరు జాతరలో పశుసంవర్థక శాఖ సేవల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 9 లక్షలు మంజూరు చేసింది. ఈ నిధులతో మేడారంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి, మందులను కొనుగోలు చేస్తాం. ఈనెల 15 నుంచి 20వ తేదీ వరకు సేవలు అందిస్తాం. 10 క్యాంపుల ఏర్పాటు జాతరకు వచ్చే పశువులకు వైద్య సేవలందించేందుకు 10 క్యాంపులు ఏర్పాటు చేస్తాం. పస్రా, నార్లాపూర్, తాడ్వాయి, ఏటూరునాగారం, చిన్నబోయినపల్లి, కొం డారుు, కన్నెపల్లి, ఉరట్టం, కొత్తూరు, రెడ్డిగూడెంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తాం. ఒక్కో క్యాంపులో ఒక డాక్టర్, ఇద్దరు పారా సిబ్బంది, ఒక అటెండర్ విధులు నిర్వర్తిసారు. అలాగే రెండో జాతరగా పేరొందిన అగ్రంపహాడ్‌లో కూడా క్యాంపును ఏర్పాటు చేస్తున్నాం. పౌల్ట్రీ ఫాంలో నిరంతర నిఘా జాతరలో ఏర్పాటు చేసే తాత్కాలిక పౌల్ట్రీఫాంలలో నిరంతర నిఘా ఉంటుంది. భక్తులకు విక్రయించే కోళ్లకు వైద్య పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్లు అందజేస్తాం. వీటిని నిర ం తరంగా తనిఖీ చేసేందుకు రెండు టీంలు ఏర్పాటు చేశాం. వీరు 24 గంటల పాటు తనిఖీలు నిర్వహిస్తూనే ఉంటారు. ఈ టీంలో ఒక డాక్టర్, సిబ్బంది ఉంటారు. ప్లాస్టిక్ కవర్లు తింటే చనిపోతాయి జాతరలో పశు సంవర్థకశాఖ ఆధ్వర్యంలో మూడు షెడ్యూళ్లు ఏర్పాటు చేసుకుని ముం దుకు వెళ్తున్నాం. జాతరకు ముందు, జాతర సమయంలో, తర్వాత పశువులకు వైద్య సేవలందించేందుకు చర్యలు తీసుకుంటాం. మేడారంలో పశువులు బెల్లం, ప్లాస్టిక్ కవర్లు తినకుండా చూడాలి. ప్లాస్టిక్ కవర్లు తినడం ద్వారా పశువులు మృతి చెందే అవకాశం ఉంది. జాతర తర్వాత మేడారం, రెడ్డిగూడెం, నార్లాపూర్, కన్నెపల్లి, ఊరట్టం, కొత్తూరులో వైద్య శిబిరాలు నిర్వహిస్తాం. -
ఎడ్ల చలోరే...
ఆధునిక రవాణా వ్యవస్థ వాయువేగంతో దూసుకుపోతుంటే.. ఆదివాసీలు మాత్రం తమ సంప్రదాయ రవాణా వ్యవస్థను వీడటం లేదు. గంటకు వందల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సూపర్ ఫాస్టు రైళ్లు, వోల్వో బస్సులు సామాన్యులకు సైతం అందుబాటులోకి వచ్చినా.. అడవినే నమ్ముకుని జీవనం కొనసాగిస్తున్న ఈ గిరిజనుల మాత్రం ఆ సదుపాయాల దరికి చేరడం లేదు! ఇప్పటికీ వారు సుదూర ప్రయాణాలకు ఎడ్లబండ్లనే ఎంచుకుంటున్నారంటే నమ్మి తీరాల్సిందే. అలా వందల కిలో మీటర్లు దూరంలో ఉన్న మహారాష్ట్ర, చత్తీస్‌ఘడ్‌ల నుంచి కుటుంబాలతో కలిసి బండ్లపై వచ్చిన ఆదివాసీలతో గత నాలుగు రోజులగా నాగోబా సన్నిధిలో ‘జాతర’ జరిగింది. అలా వచ్చిన వారిలో మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా పాండ్రవణికి చెందిన మేస్రం జాగేరావు, దుర్పతబాయిలు కూడా ఉన్నారు. వారు తమ కొడుకు, కోడలు మనువళ్లు, మనువరాండ్లతో సకుటుంబ సమేతంగా జాతరకు వచ్చారు. ఆ కుటుంబం ఈనెల 14న తమ స్వగ్రామం నుంచి ఎడ్లబండ్లపై బయలుదేరింది. ఐదు రోజుల పాటు అటవీ మార్గం గుండా వీరి ప్రయాణం సాగింది. ఈనెల 18న రాత్రి నాగోబా కొలువై ఉన్న కేస్లాపూర్‌కు చేరుకుంది. సుమారు 150 కిలోమీటర్ల ప్రయాణం ఎడ్లబండ్లపైనే సాగింది. వ్యవసాయాన్నే ప్రధాన వృత్తిగా చేసుకుని జీవనం కొనసాగిస్తున్న ఆదివాసీలు సంస్కృతీ సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తారనడానికి ఇదే నిదర్శనం. ‘‘నాగోబా జాతరతున్ కోంద, కసూర్తో వయివాల్ మా ఆచార.. ఇద్ సల్దున్ గేర్ మావ ఆచారం పకరం వాతోమ్.. కోంద, కసూర్తే వాతేకే మాకున్ చోకోట్ కరేమాంత్’’ (నాగోబా జాతరకు ఎడ్లబండ్లపై రావడం మా ఆచారం.. ఈసారీ మా ఆచారాన్ని కొనసాగించాము. ఈ ఎడ్ల బండ్లపై జాతరకు రావడం సంతోషంగా ఉంటుంది) అంటున్నారు మేస్రం జాగేరావు తమ గోండి బాషాలో. ఈనెల 22న జాతర ముగిసిన అనంతరం వీరంతా ఇక్కడి నుంచి తిరిగి తమ గూడేనికి బయలుదేరి వెళతారు. - పాత బాలప్రసాద్, సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ -
కనుమ సందడి
తమిళనాట శుక్రవారం కనుమ పండుగ సందడి నెలకొంది. గ్రామగ్రామాన మూగజీవాలను పూజించారు. శనివారం కానం పొంగల్ సందర్భంగా జన సందోహం పర్యాటక, వినోద కేంద్రాలకు తరలి రానుంది. దీంతో చెన్నైని నీఘా నీడలోకి తెచ్చారు. మెరీనా, బీసెంట్ నగర్ బీచ్‌లలో పర్యాటకులపై ఆంక్షలు విధించారు. సాక్షి, చెన్నై: సంక్రాంతి సంబరాల్లో భాగంగా రాష్ట్ర ప్రజలు శుక్రవారం కనుమ పర్వదినాన్ని ఘనంగా జరుపుకున్నారు. తమకు జీవనాధారంగా ఉన్న పశువులను రైతులు భక్తిశ్రద్ధలతో పూజించారు. ఆశ్రమాల్లో, గో మందిరాల్లో ఉదయాన్నే గోమాతలకు స్నానాలు చేయిం చారు. కొమ్ములకు కొత్త రంగులు వేశారు. వివిధ రంగులు, బెలూన్లు, గజ్జెలతో అలంకరించారు. పండ్లు నైవేద్యంగా సమర్పించారు. చెన్నై మెరీనా తీరంలోకి తమ పశువుల్ని పెంపకదారులు తోలుకు వచ్చారు. వాటికి సముద్ర స్నానం చేయించిన అనంతరం పూజలు నిర్వహించారు. ఎడ్ల బండ్లతో పురవీధుల్లో చక్కర్లు కొట్టారు. జనానికి వినోదాన్ని పంచి పెట్టారు. పెద్ద పండుగలో మూడు ముఖ్య ఘట్టాలు ముగిశా యి. ఇక చివరగా కానం పొంగళ్ శనివారం ఘనంగా జరగనుంది. నేడు కానం పొంగల్ కానం పొంగల్ అంటే అందరికీ మహదానందం. ఇంటిల్లిపాదీ పర్యాటక ప్రాంతాలకు తరలి వెళ్లి ఈ పండుగను ఉత్సాహంగా జరుపుకుంటారు. వీరి కోసం పర్యాటక ప్రాంతాలు, వినోద కేంద్రాలు ముస్తాబ య్యాయి. ఒక్క చెన్నై నగరంలో రెండు వందల ప్రత్యేక బస్సుల్ని నడిపేందుకు నగర రవాణా సంస్థ నిర్ణయించింది. ఆయా మార్గాల్లో ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు ప్రత్యేక బస్సులు తిరగనున్నాయి. జనం అత్యధికంగా తరలివచ్చే మెరీనా, బీసెంట్ నగర్ బీచ్‌ల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సముద్రంలోకి ఎవరినీ వెళ్లనీయకుండా బారికేడ్లను ఏర్పాటు చేశారు. సముద్ర స్నానాన్ని నిషేధించారు. సందర్శకుల భద్రత నిమిత్తం పోలీసులు యంత్రాంగం గట్టి భద్రతా చర్యలు తీసుకుంది. ప్రత్యేక హెల్ప్ లైన్లను ఏర్పాటు చేశారు. తప్పిపోయిన వారిని రక్షించేందుకు, జేబు దొంగల భరతం పట్టేం దుకు ప్రత్యేకంగా మఫ్టీలో సిబ్బందిని రంగంలోకి దించనున్నారు. అదే విధంగా చెన్నై నగరంలోని గిండి చిల్డ్రన్స్ పార్కు, వండలూరు జూ తదితర ప్రాంతాలు పర్యాటకుల కోసం ముస్తాబయ్యాయి. జనం నగరంలోని పర్యాటక, వినోద కేంద్రాలకు తరలి రానుండడంతో భద్రత నిమిత్తం 18 వేల మందిని రంగంలోకి దించారు. అలాగే ప్రత్యేక మొబైల్ టీమ్‌లను సైతం ఏర్పాటు చేశారు.