తాండూరు మండలాన్ని ఆదిలాబాద్ జిల్లాలోనే ఉంచాలని ఆందోళనలు సాగుతున్నాయి.
తాండూరు మండలాన్ని ఆదిలాబాద్ జిల్లాలోనే ఉంచాలని కోరుతూ తాండూరులో ఆందోళనలు సాగుతున్నాయి. అఖిల పక్షం నేతృత్వంలో కొందరు నాయకులు గురువారం తాండూర్‌లో దుకాణాలు బంద్ చేయించారు. కొత్తగా అవతరించిన మంచిర్యాల జిల్లాలో మండలాన్ని కలుపవద్దంటూ మండల కేంద్రంలో ఎడ్లబండ్లతో భారీ ర్యాలీ నిర్వహించారు.
మండల కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు.
అయితే, మూసి వేసిన షాపులను జడ్పీటీసీ సురేష్‌బాబు తిరిగి తెరిపించటంతో ఆయనతో కొందరు వాదులాటకు దిగారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మంచిర్యాల జిల్లా ఏర్పాటు చేసినందుకు, తాండూరును మంచిర్యాలలో కలిపినందుకు కృతజ్ఞతతో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కేసీఆర్ చిత్రపటానికి పాలతో అభిషేకం చేశారు.