ఇండోర్ : మధ్యప్రదేశ్‌లో ఇండోర్ సమీపంలోని పలాడ ఇండస్ట్రియల్ ప్రాంతంలో ఓ వింత సంఘటన చోటుచేసుకుంది. ఆడీ, బీఎండబ్ల్యూ కార్లను వదిలి పారిశ్రామికవేత్తలు ఎడ్లబండ్లు పట్టారు. ఇండోర్‌కు 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న పలాడ ఇండస్ట్రియల్ పాంతానికి వెళ్లే రోడ్లు ఎన్నో ఏళ్లుగా దుర్బరస్థితిలో ఉన్నాయి. ఒక్క వర్షం కురిస్తే బురదతో కనీసం నడవడం కూడా ఇబ్బంది అయ్యేలా రోడ్లు తయారయ్యాయి. దీంతో ఎన్నోసార్లు రోడ్ల విషయమై ఉన్నతాధికారులకు మొరపెట్టుకున్నా ఎవరూ పట్టించుకోలేదు. (ఇది బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ కాదు: సోనియా గాంధీ)
దీంతో పలాడ ఇండస్ట్రియల్ ప్రాంతంలో పరిశ్రమలు నిర్వహిస్తున్న యజమానులు, ఉన్నతాధికారులు ఖరీదైన తమ కార్లను వదిలేసి, ఎడ్లబండ్లు ఎక్కి తమ నిరసనను ప్రభుత్వానికి తెలిపారు. పారిశ్రామికవేత్తలు ఎడ్లబండి నడుపుతున్న ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.(సరిహద్దుల్లో చైనా సన్నద్ధత?.. నిజమెంత!)
Comments
Please login to add a commentAdd a comment